రియా – part 2 68

సరే పద….అని తను లేవడానికి సహాయం చేసి…తనని పట్టుకుని తనతో పాటు నడవసాగాడు….అలా తనతో పాటు అడుగులేస్తూ మనసులో మాత్రం ఈ అడుగులు తనతో పాటు జీవితాంతం కలసి నడవాలి అని ఆ దేవుడ్ని కోరుకున్నాడు…..

“ఏంటండి మళ్ళీ మీ ఆలోచనలు మన ఊరి దాటి పక్క ఊరి వెళ్ళినట్టున్నాయి ఏం థింక్ చేస్తున్నారేంటి…..?”అని రియా అడగడం తో…..ఏం లేదు అన్నట్టు తలూపాడు అభి…….

కొంచెం దూరం నడిచాక…..”అభిమన్యు గారు……మిమ్మల్నొకటి అడగొచ్చా….?”అంది రియా

“దేవుడా…….రియా నన్ను అభి అని పిలిచేలా చెయ్యి…”అని మనసులో అనుకోసాగాడు అభి….

“అలానే పిలుస్తాను లేండి…ప్రస్తుతానికి నేనడిగిన దానికి సమాధానం ఐతే చెప్పండి….”అంది రియా

“ఏం పిలవడం…?”అర్థం కానట్టు ముఖం పెట్టి అడిగాడు అభి….

“మీరు చెప్పకపోయినా మీ ముఖం చూస్తే నే అర్థం అవుతుంది…మీరు నేను అభిమన్యు అన్నప్పుడల్లా ఎంత ఇబ్బంది గా ఫీల్ అవుతున్నారో…..”అంది రియా

“హా మరి అర్థమయినప్పుడు…….పిలవకుండా వుండొచ్చు కదా….రియా….ఇంతకు ముందులా వుండొచ్చు కదా రియా…?”అడిగాడు అభి

“అది మాత్రం అడగకండి….”అంది రియా ముందుకు చూస్తూ ….

“అది స్సరే గానీ…ఏదొ అడగాలన్నావ్…?అడుగు….”అన్నాడు అభి……

“ఇప్పుడు కాదు లే రాత్రికి వస్తావ్ గా అప్పుడు అడుగుతాను…”ఆంది రియా

“రాత్రికా…నేనొస్తానా…ఎక్కడికి…?”అర్థమయ్యినా అర్థం కానట్టు అడిగాడు అభి….

“ఆహా….నీకేమి అర్థం కాలేదా….?నిజం చెప్పు…?”అడిగింది రియా

“లేదు…నిజంగా…”తన పిలుపు మీరు నుంచి నువ్వు కి మారింది అన్న ఆనందం లో ఉషారుగా చెప్పాడు అభి….

“సరే సరే…..నువ్వు వస్తే నీకుంటది అప్పుడు చెబుతా నీ పని…”వెక్కిరిస్తూ అంది రియా

“ఓహ్….అర్థమయ్యింది…నిన్ను చూడ్డానికి వస్తాను అనే గా నువ్వు అంది….?సారీ నేను నిజంగా మర్చిపోయాను….ఇప్పుడు గుర్తొచ్చింది…”అన్నాడు అభి

“చా….నువ్వు నీ కవరింగ్ లూ…చాలు చాల్లే నువ్వేమి రానక్కర్లేదు……..పొద్దున్నే నిన్ను నేను లేపనక్కర్లేదు…..ఎక్స్ ట్రా గా నీకు నేను హగ్ లూ ఇవ్వనక్కర్లేదు….”అంది రియా

“అవును అడగడమే మర్చిపోయాను….ఆ రోజు నువ్వు నాకు హగ్ ఎందుకిచ్చావ్…?”దొరికిందే ఛాంస్ అన్నట్టు అడిగాడు అభి……

“అది….అది…హా….నీ బైక్ వచ్చేసింది…పద…”అని టాపిక్ డైవర్ట్ చేసింది రియా…..

ఆ రోజు రాత్రి…….ఎప్పటి లాగా అభి రియా కోసం వచ్చాడు…….ఎప్పుడు నిద్రపోయే రియా ఈ సారి మేల్కొని అభి కోసం వెయిట్ చేయసాగింది…….

“ఏంటి రియా….సాయంత్రం ఏదో అడుగుతానన్నావు….అడుగు…”అడిగాడు అభి

2 Comments

  1. Anna continue ramuku autograph plz plz,ramu jareena dengudu affair ramu Anitha tho dengudu ramu manasa Pragathi anjali deepika lago sex encounters rayandi plzzz continue ramulu autograph

Comments are closed.