రియా – part 2 68

13.వెల్ కం

ఆఫీసులో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు విజయ్…….”రియా…కి ఇది ఫస్ట్ రోజు…చక చకా చెప్పిన పనులన్నీ చేస్కుపోతుంది…అఫీసులో సీనియర్స్ కాక తన ఏజ్ వాళ్లంతా అప్పుడే తనకి ఫ్రెండ్స్ అయిపోయారు……ఎందుకవ్వరు…?తన ప్రవర్తన అలాంటిది……..

ఆ రోజు కి పని ముగించుకుని……విక్రాంత్ వస్తుండటం తో రైల్వే స్టేషన్ కి బయల్దేరాడు విజయ్……కార్ పంపిస్తాను అన్నా కూడా విక్రాంత్ ట్రైన్ లోనే వస్తానడడం తో ఇలా తనని పిక్ చేస్కోడానికి రైల్వేస్టేషన్ కి వెళ్తున్నాడు…..దారిలో రియా నడుస్తూ కనిపించింది….తన పక్కగా కార్ ఆపి….

“రియా…ఏంటి నడుస్తున్నావ్…?”అడిగాడు విజయ్

“అది….ఆటో దొరకలేదు సార్…”అంది రియా

“సార్ ఆ….నిన్న మామూలు గానే మాట్లాడావ్ గా ఇవాళ ఏమయ్యింది…?”అనుమానంగా అడిగాడు విజయ్

“సారీ సార్…మీరు బాస్ అని తెలియక ఏదేదో వాగేశాను…క్షమించండి…”అంది రియా

“క్షమాపనలు తర్వాత…ముందు కార్ ఎక్కు నేను డ్రాప్ చేస్తాను….”అని అనడం తో…”పర్లేదు సార్…”అంది రియా

“చాలు చాల్లే…నీ మొహమాటం….ఎక్కు…”అనేసరికి ఇక తప్పక కార్ ఎక్కింది రియా

“అవును నువ్వెక్కడికి వెళ్లాలి…”డ్రైవ్ చేస్తూ అడిగాడు విజయ్…చెప్పింది రియా

“ఓహ్ అవునా…నా ఫ్రెండ్ వూరి నుంచి వస్తున్నాడు దారిలో రైల్వే స్టేషన్ లో పిక్ చేసుకుని…ఆ తర్వాత నిన్ను డ్రాప్ చేస్తాను నీకేం పర్లేదు గా ?”అడిగాడు విజయ్

“హా పర్లేదు…”అంది రియా

రైల్వే స్టేషన్ లో……..

ట్రైన్ రావడం తోనే విక్రాంత్ వున్న బోగి వైపు పరిగెత్తాడు విజయ్…….విక్కి కూడా విజయ్ కోసం చూస్తూ ట్రైన్ కొంచెం స్లో అవ్వగానే విజయ్ ని చూసి అమితానందం తో కౌగిలించుకున్నాడు……..

అక్కడున్న వాళ్లంతా వీళ్ళను వింతంగా చూశారు…….

విజయ్ విక్కి లగేజ్ తీసుకుని మాట్లాడుతూ ఎంట్రంస్ దాకా వచ్చేశాక గుర్తొచ్చింది అతనికి రియా విషయం….

“ఇంతకి తనేది?”అన్నాడు ఒక్కసారిగా విజయ్

“తనెవరు….?”అడిగాడు విక్కి

ఇంతలో రియా ని చూసిన విజయ్…”దేర్ షీ ఈస్ “అని అనడంతో విజయ్ చూసిన వైపు చూసిన విక్కి రియా ని చూసి షాక్ అయ్యాడు……..

విక్కి ని చూసిన రియా కళ్ల లోంచి నీళ్లు….అది విక్రాంత్ ఇంకా విజయ్ ఇద్దరూ చూశారు…కానీ విజయ్ మాత్రం ఒక అడుగు ముందుకేసి……”ఏమయ్యింది రియా…?”అడిగాడు తనని

“కంట్లో ఏదో పడింది విజయ్…”ఒక్కసారిగా సార్ నుంచి విజయ్ కి పిలుపు మార్చింది రియా

విక్కి-విజయ్ ముందు కూర్చున్నారు…..రియా వెనక కూర్చుంది…..

“విజయ్ ఇక్కడే అపేయ్యి…”అనేస్రైకి కార్ ఆపాడు విజయ్…

“ఓహో ఇదే నా మీ హాస్టలా….ఒకే టేక్ కేర్ రియా….బై…”అని చెప్పేసి కార్ ముందుకు పోనిచ్చాడు విజయ్…..

“విక్కి రేపటి నుంచి ఆఫీస్ కి వస్తున్నావ్ గా…?”అడిగాడు విజయ్

ఏదో ఆలోచిస్తూ సమాధానం చెప్పలేదు విక్కి…”రేయ్ నిన్నేరా…?ఎక్కడున్నావ్…?’అని విజయ్ మరొక్కసారి అడిగేసరికి…”హా వస్తా లే రా…టైర్డ్ గా వుంది నోర్మూస్కుని ఇంటికి పోనివ్వు ముందు…”అనేసరికి 10 నిమిషాల్లో ఇంటి ముందు వున్నాడు విజయ్

విక్కి కి రూం చూపించి తను కూడా ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి నిద్రపోయాడు……..

మధ్య రాత్రి లో ఎందుకో మెలకువ వచ్చి……తన రూం లో వాటర్ అయిపోవడం తో కిచెన్ లోకి వెళ్తూ తెరచి వున్న విక్కి రూం వైపు చూశాడు విజయ్….

2 Comments

  1. Anna continue ramuku autograph plz plz,ramu jareena dengudu affair ramu Anitha tho dengudu ramu manasa Pragathi anjali deepika lago sex encounters rayandi plzzz continue ramulu autograph

Comments are closed.