రియా – part 3 97

మరుసటి రోజు

సాయంత్రం 5:00

ప్లేస్ ఎయిర్ పోర్ట్

“ఐ యాం సారీ రియా…నాక్కూడా నీతో టైం స్పెండ్ చెయ్యాలనే వుంది…కాని ఇలా ఎమర్జంసీ వస్తుంది అనుకోలేదు…….ఐ విల్ మిస్ యూ వెరీ బ్యాడ్లీ…”అని చెప్పి వీడ్కోలు పలికాడు విజయ్….

విజయ్ ఏదో ప్రాజక్ట్ పని మీద ఆస్ట్రేలియా వెళ్ళాల్సి వచ్చింది……

ఆ మరుసటి రోజు

“మిష్టర్ వరుణ్…కెన్ యూ బ్రింగ్ ద ప్రాజెక్ట్ ఫైల్….”అని అడగడం తో ఫైల్ తీసుకెళ్తున్న వరుణ్ కి అర్జెంట్ గా రమ్మని ఫోన్ రావడం తో…..అక్కడె వున్న రియా కి ఆ ఫైల్ అప్పగించి……తను వెళ్ళిపోయాడు వరుణ్

“మే ఐ కం ఇన్ సార్…?”ఫైల్ పట్టుకుని వచ్చిన రియా అడగడం తో….”కం ఇన్…”అని విక్కి చెప్పేసరికి ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళింది రియా

తనెందుకాలా నడుస్తుందో అర్థం కాని విక్కి తన కాలి వైపు చూశాడు…ఫ్రాక్చర్ అయ్యి కనిపించింది….ఒక్కసారిగా మనసులో ఏదో తెలియని అలజడి….రెండు రోజుల నుంచి గమనించలేదు తనని…అంటె….వారం తర్వాత తను ఆఫీస్ కి వచ్చినప్పుడు రియా ఆఫీస్ కి ఎందుకు రాలేదు విక్కి కి వెంటనే అర్థమయ్యీంది……మనసంతా ఏదొ గిల్టి ఫీలింగ్ తో నిండిపోయిన మరుక్షణం…తను మరొకరి సొంతం అనే ఆలోచన మనసును గునపంతో గుచ్చినంత గట్టిగా ఙపకం వచ్చేసరికి….కన్ సర్న్ ప్లేస్ లో కోపమొచ్చి యాడ్ అయ్యింది…..

“వరుణ్ అంటే మీరా…?”అడిగాడు విక్కి సీరియస్ గా ముఖం పెడుతూ

“అంటే…అభి అది….”అని నాలుక కరుచుకుంది రియా

“ఇట్స్ సార్ ఫర్ యూ మిస్ రియా….”ఆల్మోస్ట్ అరిచాడు విక్కి

“ఐ యాం సారీ సార్…..అతనికి ఏదో అర్జెంట్ పని పడి నన్ను ఈ ఫైల్ ఇవ్వమన్నారు…….”అంది రియా

“వాట్ ఎవర్…….జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్…”అని విక్కి అరిచేసరికి రియా అక్కడ నుంచి కదిలి వెళ్ళబోతుండగా…..”మరి ఫైల్ ఎవరిస్తారు…మీ బదులు ఇంకొకరు తీసుకు వస్తారా….?”అని అరిచేసరికి వెనుదిరిగి ఫైల్ టేబుల్ మీద పెట్టి క్యాబిన్ బయటకి వచ్చింది….

ఆ సాయంత్రం…

“అభి నా మీద చాలా కోపంగా వున్నాడు….ఇది ఒకందుకు మంచిదే లే ఇలా అయినా తన బాధ నాకు తప్పుతుంది…”అని అనుకుంటుండగా….తన ఫోన్ మోగింది…..విజయ్ నుంచి కావడం తో క్షణం ఆలోచించకుండా….ఎత్తిన రియా….”హలో…సార్ “అంది…అవతల రెస్పాంస్ వచ్చేలోపు…ఎలర్ట్ అయ్యి….ఓ సారీ విజయ్…అలవాటు లో పొరపాటు అని సరిచేసింది……

“రియా…..ఐ రియల్లి మిస్ యూ…”విజయ్ చెప్పాడు….

5 Comments

  1. Abhi bro u r the best lover

  2. Next part bro
    Two parts send bro

  3. ఇవి సెక్స్ కథలా థూ

  4. ఇవి సెక్స్ కథలా థూ

  5. Anna plz continue ramuku autograph ,ramu jareena Anitha tho dengudu sessions,ramu manasa anjali deepikalato dengudu rayandi plz

Comments are closed.