“అబ్బో స్థాయి…..నువ్వు మాట్లాడుతున్నావా దాని గురించి….?”హేళనగా నవ్వాడు విక్కి
ఒక సీరియస్ లుక్కించింది రియా
“తప్పు చేసి ఆ చూపేంటే…?”కోపంగా అన్నాడు విక్కి
“మర్యాద ఇచ్చి మాట్లాడు అభిమన్యు…”అంది రియా
“నేను మాట్లాడాను….నేను నా పెళ్లంతో ఇలానే మాట్లాడతాను “అన్నాడు విక్కి
“ఎవరు నీకు పెళ్ళాం….నువ్వు వదిలించుకోవాలనే కదా ఇంత దూరం వచ్చాను…మళ్ళి దాపరించావ్ శని లాగా…”అంది రియా
“నువ్వు అవునన్నా-కాదన్నా నువ్వే నా పెళ్ళాం……దానికి సాక్ష్యం నీ చేతికి వున్న ఆ వుంగరం…..నిశ్చితార్థం అయితే సగం పెళ్ళి అయిపోయినట్టె…..”అన్నాడు విక్కి
“ఏ కాలం లో వున్నావ్….నిశ్చితార్థం జరిగిన అన్ని జంటలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయా….?”అంది వెటకారంగా రియా
“అవ్వాల్సిన అవసరం లేదు….కానీ నీకు నేను అంతగా ఇష్టం లేకపోతే….నేను తొడిగిన వుంగరం నువ్వెందుకు వుంచుకున్నావ్ తీసి పడయొచ్చు గా….”అన్నాడు విక్కి
వెంటనే తన చేతికి వున్న వుంగరం తీసి విక్కి చేతిలో పెట్టి…ముందుకు నడిచిన రియా….చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్న విక్కి….”ఇది తీసిచ్చావ్ సరే….మరి ఆరోజు నీకు-నాకు మధ్య జరిగింది నీ మనసులోంచి ఇంత తేలికగా తీసేస్తావా….?నా మీద ఏ ఫీలింగ్ లేకుండా…..నాతో అలా…?”అని చెబుతుండగా…..
“విక్కి…”అన్న విజయ్ గొంతుకి ఇద్దరూ ఎలర్ట్ అయ్యారు…….!!!
16.మాట రాని మౌనమిది….
“విక్కి…విక్కి…”అని పిలుస్తూ వస్తున్నాడు విజయ్ …
వెంటనే రియా ని వదిలేసి ముందుకు కదిలాడు విక్కి…..ఎదురుగా వస్తున్న విక్కి ని చూసిన విజయ్….”ఇక్కడేం చేస్తున్నావ్ రా….?”అని అడగడం తో …”ఏం లేదు….పద “అని విజయ్ తో పాటు ముందుకి నడిచాడు….
కాని విజయ్ కళ్ళు ఎవరి కోసమో వెతకడం చూసిన విక్కి…”ఎవరి కోసం వెతుకుతున్నావ్….?”
“అది…..తను…..అదే రియా….పాపం సిటీ కి కొత్త కదా…..అందుకే తన కోసం చూస్తున్నాను…”అని విజయ్ చెప్పడం తోనే మారు మాట్లాడకుండా ముందుకు నడిచి కార్ డొర్ ఓపెన్ చేసి……విజయ్ కోసం చూడకుండా ముందుకు పోనిచ్చాడు కార్ ని….
విజయ్ చేష్టలుడిగి చూస్తుండిపోయాడు….
Abhi bro u r the best lover
Next part bro
Two parts send bro
ఇవి సెక్స్ కథలా థూ
ఇవి సెక్స్ కథలా థూ
Anna plz continue ramuku autograph ,ramu jareena Anitha tho dengudu sessions,ramu manasa anjali deepikalato dengudu rayandi plz