“ఆ ప్రియాంక వేరు తిను వేరు….”కవర్ చెయ్యబోయింది రియా
“నోర్మూస్కో…ఎక్కడికి పంపను నిన్ను…”అని రియా వాళ్లమ్మ చెప్తుండగా….అభి చూసిన రియా అతని దగ్గరికి వచ్చి…చేతిలో చెయ్యేసి……వాళ్లమ్మ దగ్గరికి లాక్కెళ్లి…నేను-అభి వెళతాం ఇప్పుడు ఒకే నా అంది
“అభి ఐతే ఒకే….”అని వాళ్లమ్మ డిక్లరేషన్ ఇవ్వడం తో….ఆ సాయంత్రం ఇద్దరూ సినిమా చూసి వస్తున్నారు…..సినిమా హాల్ ఇంటికి దగ్గరే అవ్వడం తో ఇద్దరూ నడుస్తూ వస్తున్నారు….
“అభి నిన్నోటి అడగనా?”అడిగింది రియా
“ఆడుగు….”అన్నాడు అభి
“నీకెప్పుడూ ఎవరినీ కిస్ చేయాలి అనిపించలేదా….?”అభి ని చూస్తూ అడిగింది రియా
“ఏంటే తింగరి ఏం వాగుతున్నావ్…?”అడిగాడు అభి
“ఈ మూవి లో ఆ సీన్ లు ఎక్కువున్నాయి కదా సో అడిగాను కానీ నువ్వు ఆంసర్ చెప్పు…నీకు అనిపించిందా…?”అడిగింది రియా
“హా అనిపించింది…”అన్నాడు అభి
“ఏంటి నీక్కుడా నా..?”ఆస్చర్యపోయింది రియా
“ఏ నేను మనిషి ని కాదా నాకు ఫిలింగ్స్ వుండవా…అవును నీక్కుడా అన్నావ్…నీకు అనిపించిందా…..?”అడిగాడు అభి
“అబ్బే….ఛా…ఛా…అలాంటిదేమీ లేదు…”అని ముందుకు నడిచింది రియా
సడన్ గా హోరున గాలి వీచడం మొదలైంది…..దానికి తోడు వురుములూ మెరుపులూ ……జనరల్ గా హీరోయింస్ కి ఉరుములంటే భయం వుంటుంది…కానీ ఇక్కడ రివర్స్…..అభి కి చిన్నప్పటి నుంచి అవంటె ఎందుకో భయం……ఒక ఉరుము ఉరమగానే……రియా ని గట్టిగా చుట్టెసాడు…..ఇంతలో చిరు చినుకులు మొదలయ్యాయి…….అభి రియా ని కౌగిలించుకున్నప్పుడు…రియా తల సరిగ్గా అతని గుండెను తాకింది…….అభి గుండె సడి రియా కి సుస్పష్టంగా వినిపిస్తుంది…..పైగా వాన…….అసలే రొమాంటిక్ గా వున్న మూడ్ ని మరింత రొమాంటిక్ చేసింది……మెల్లిగా రియా హార్ట్ బీట్ కూడా పెరిగి తనకే వినిపించసాగింది…..తల ఎత్తి అభి ని చూసింది……అభి రియా ని చూశాడు….ఆ ఒక్క క్షణం లో ఇద్దరికి ఏదో అర్థమయ్యి……వారిద్దరి పెదవులు క్షణ కాలం పాటు కలుసుకుని తిరిగి విడిపోయాయి…తెలియని స్థితిలో ఏదో తెలియని అనుభూతి ఇద్దరిన్ని ముంచెత్తిన మరుక్షణం…రియా వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది……
****
ప్రస్తుతం….
కార్ రియా వాళ్ళ హాస్టల్ వద్దకి వచ్చింది……వచ్చి పది నిమిషాలవుతున్నా ఏం చెయ్యాలో విక్కి కి పాలు పోవట్లేదు……ఇంకా లేట్ అయిటే హాస్టల్ లో ఎలో చెయ్యకపోవచ్చు….అన్న థాట్ రాగానే….మెల్లిగా తన భుజాన్ని కదిపి…”రియా…రియా…”లే అన్నాడు విక్కి …మగతగా కళ్ళు తెరిచిన రియా….
“ఐ లవ్ యూ సొ మచ్” అని తనకి అత్యంత సమీపంలో వున్న విక్కి పెదవులని అందుకుంది……..ముందు షాక్ అయినా ఆ తర్వాత ఆమె ముందు ఓడిపోయిన విక్కి తన ముద్దు అని ఆశ్వాదించసాగాడు……!!!!!
Abhi bro u r the best lover
Next part bro
Two parts send bro
ఇవి సెక్స్ కథలా థూ
ఇవి సెక్స్ కథలా థూ
Anna plz continue ramuku autograph ,ramu jareena Anitha tho dengudu sessions,ramu manasa anjali deepikalato dengudu rayandi plz