రియా – part 3 97

“అభి….పిచ్చా నీకు..చిన్నపిల్లాడిలా చెయ్యకు….”అని తన చున్ని చింపి కట్టు కట్టింది రియా…..

“లిసన్ అభి…నువ్వంటే నాకిష్టమే….కానీ ప్రేమ కాదు…చిన్నప్పటి నుంచి చూస్తున్న నీపై నాకు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు…..అదీ కాక నీ కేరింగ్ అభి….ఐ రియల్లి కాంట్ బేర్ ఇట్……చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా చేస్తుంది.,….అందుకే నేను నీ నుంచి దూరం అయ్యాను…ఇదంతా నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావని చెప్పట్లేదు….నా వల్ల నీకేమి ప్రాబలం కాకూడదని చెబుతున్నా….నీకిది వినడానికి కష్టం గా వున్నా….నేను నా పార్ట్ నర్ ఎలా వుండాలి అని కోరుకున్నాను అచ్చం అలానే నాకు కనిపించారు…యండ్ ఐ రియల్లీ లవ్ హిం…..యండ్ ఇంకో విషయం తను ఎవరో కాదు హీ ఈస్ విజయ్….”అని ముగించింది రియా

ఒక్కసారిగా షాక్ ,బాధ ఒకేసారి విక్కి పై విక్కి మనసు పై దాడి చేసి….అప్పటి దాకా ఎక్కడొ దాగి వున్న హోప్ ని పటాపంచలు చేశాయి…..ఈ క్షణమే చనిపోతే ఎంత బాగుటుందో అని అనిపించేలా చేశాయి…….

ఏ ప్రళయమో వచ్చి తన ప్రాణాన్ని హరించివేస్తే ఎంత బాగుంటుందో అనిపించింది……

అంత ఇంక రియా చెప్పే మాటలేవి చెవులకి వినపడలేదు…….అలానే రోడ్డు పై తిరుగుతూ వుదయాన్నే ఇల్లు చేరాడు…అతను ఇంటికి చేరేసరికి…..విక్కి వాళ్ళ అమ్మా-నాన్న వచ్చి వున్నారు…..విక్కి కూడా వారిని చూసి కూడా చూడనట్టు….ముందుకు కదిలి….స్పృహ తప్పి కిందపడ్డాడు……

ఒక వారం తర్వాత…..

ఎన్నడూ లేని ఉత్సాహం తో అఫీస్ లోనికి అడుగుపెట్టాడు విక్రాంత్ అభిమన్యు….అందరూ అతన్ని విష్ చేస్తున్నారు………అందరికి చిరునవ్వు తో సమాధానమిచ్చి…..చివరగా మిగిలి వున్న క్యూబికల్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఖాళీ చెయిర్ అతన్ని వెక్కిరించింది…….

అయినా అదేమి పట్టించుకోకుండా….తన పనిలో తాను మునిగిపోయిన విక్కి దగ్గరికి లంచ్ బ్రేక్ లొ వచ్చాడు విజయ్

“హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ రా…?”అడిగాడు విజయ్

“బెటర్…”అని చిరునవ్వు తో సమాధానమిచ్చిన విక్కి ని చూసిన విజయ్…గొంతు సవరించుకుంటూ…”నీకో విషయం చెప్పాలి…..”అని మొదలుపెట్టి…..విక్కి ఎటెంషన్ కోసం వెయిట్ చేయసాగాడు….

“హా చెప్పు….”అన్నాడు విక్కి విజయ్ ముఖం చూస్తూ

“ఐ యాం ఇన్ లవ్ విత్ సం వన్…..తనకి ఇవాళ ప్రపోస్ చేద్దామనుకుంటున్నాను….”అని ఆగాడు విజయ్
“కంటిన్యూ…”అన్నాడు విక్కి ఎక్స్ ప్రెషన్ మార్చకుండా

“ఎవరని అడగవా…?”అడిగాడు విజయ్

5 Comments

  1. Abhi bro u r the best lover

  2. Next part bro
    Two parts send bro

  3. ఇవి సెక్స్ కథలా థూ

  4. ఇవి సెక్స్ కథలా థూ

  5. Anna plz continue ramuku autograph ,ramu jareena Anitha tho dengudu sessions,ramu manasa anjali deepikalato dengudu rayandi plz

Comments are closed.