రియా – part 3 97

“ఐ మిస్డ్ యూ టూ….”అంది రియా…..అలా వాళ్లిద్దరూ మాట్లాడుతుండగా వినకూడదని తెల్సినా వినకుండా వుండలేకపోయాడు విక్కి…..రియా చాలా హ్యాపీ గా వుంది…..తను నేను లేకుండా నిజం గా హ్యాపీ గా వుండగలదా…?నా ప్రేమ తనని అంతలా సఫొకేట్ చేసిందా….?నా కేరింగ్ కరెక్ట్ కాదా…?అయినా కరెక్ట్ అయితే…..ఇప్పుడు నా ప్లేస్ లో విజయ్ ఎందుకు వుంటాడు లే….?తను నన్ను ఎప్పటికి ప్రేమించదు అనే నిజం ఆల్రేడి జీర్ణించుకోగలిగాను కానీ…..తను వేరొకరి సొంతం అంటే ఎందుకు నా వల్ల అవ్వటం లేదు….?”అని ఆలోచిస్తూ…..రియా ఫోన్ పెట్టేసిన వెంటనే…..తనకి కాల్ చేసి డాక్యుమెంట్ మెయిల్ చెయ్యమన్నాడు…..
అది విన్న రియా….”సహజంగా ఐతే ఫైల్ తీసుకు రమ్మని చెప్పాలి కాని మెయిల్ చెయ్యమన్నాడు అంటే నా ముఖం చూడడం కూడా తనకి ఇష్టం లేదన్నమాట….ఒక్కసారిగా ఎంత మారిపోయాడు……నా కోసం ఐ.ఐ.టి లో సీట్ వదులుకున్న అభి ఏనా…..?నన్ను చూడకుండా వుండలేడని అమెరికా ప్రయాణం మానుకోవాలనుకున్న అభి ఏనా తను….?ఒక్కోసారి మనం ఎంత వద్దనుకున్నా ఒకరు మనల్ని ఎవాయిడ్ చేస్తే ఆ బాధ వర్ణాతీతం….నాక్కుడా ఇదే గా కావాల్సింది…అనుకుని మెయిల్ ఫార్వాడ్ చేసింది…..ఒక పది నిమిషాలకి తన ఫోన్ రింగ్ అయ్యింది….విక్కి తనని తన క్యాబిన్ కి పిలిచాడు “ఏమైవుంటుంది ?”అనుకుంటూ భయం భయం గా లోపలికి అడుగు పెట్టింది రియా

“so this the way you are working well done…..మిమ్మల్ని నమ్ముకుంటే కంపెనీ ని అమ్ముకోవాల్సిందే అని ఈ రోజు బాగా అర్థమయ్యింది నాకు…పొద్దున్న నుంచి దీని మీదే కూర్చున్నారు….cant you just make it perfect?forget it…you are good for nothing…మిమ్మల్ని హైర్ చేసిన వాళ్లని అనాలి….వర్క్ చేయడం రాకపోతే ఇంట్లో కూర్చుని అంట్లు తోముకోవాలి…..అంతే గానీ మా ప్రాణాలు ఎందుకు తీస్తారమ్మా….?పైగా తమరిని ఒక్కమాట అనడానికి వీల్లేదు…..మీకు మళ్ళీ సిఫార్సులు…..”అని అరిచేశాడు విక్కి

కళ్లలో నుంచి కన్నీళ్లు ఏరులై ప్రవహిస్తుండగా….అలానే నిల్చుండిపోయింది రియా

“ఇంకా నా ముఖం ఏం చూస్తావ్….జస్ట్ గెట్ లాస్ట్….”అని గట్టిగా అరిచేసరికి ఏడుస్తూ తన క్యూబికల్ కి వచ్చి కూర్చున్న రియా అసలు తను ఏం తప్పు చేశానా అని చూసింది రాంగ్ మెయిల్ సెంట్ చేయడం వల్ల తనకీ పరిస్థితి వచ్చిందని అర్థమయ్యి…..అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చింది……

ఆ నైట్ తన క్యాబిన్ నుంచి బయటకి వచ్చిన విక్కి…ఆఫీసులో ఇంకా ఎవరో వర్క్ చేస్తున్నారనిపించి చూడ్డానికి వెళ్ళాడు……రియా వర్క్ చేస్కుంటూ కనిపించింది…….తన కళ్ళు ఏడ్చి ఎర్రగా వున్నాయి……తనని చూస్తేనే తెలుస్తుంది తను చాలా నీరసంగా వుందని…..వెళ్ళిపొమ్మని చెబుదామని ముందడుగు వేసి మళ్ళి నాకెందుకు అని తన దారిన తను వెళ్ళిపోయాడు….

10 గంటల సమయం….

వర్షం మొదలైంది అప్పుడే…..వాచ్ మెన్ కి కాల్ చేసిన విక్కి

“ఆఫీస్ లో అందరూ వెళ్ళిపోయారా?”

అతనిచ్చిన సమాధానానికి విక్రాంత్ భృకుటి ముడి పడింది…..

5 Comments

  1. Abhi bro u r the best lover

  2. Next part bro
    Two parts send bro

  3. ఇవి సెక్స్ కథలా థూ

  4. ఇవి సెక్స్ కథలా థూ

  5. Anna plz continue ramuku autograph ,ramu jareena Anitha tho dengudu sessions,ramu manasa anjali deepikalato dengudu rayandi plz

Comments are closed.