లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – End 69

నన్ను అలాగే చిరు కోపంతో చూసింది.

“నువ్వు కావాలనే చేస్తున్నావ్ ……… ”

“ఏంటి ??”

“మరి గిఫ్ట్ సీక్రెట్ అయితే నన్ను ఎందుకు బైక్ లో తీసుకొని వెళ్ళావ్ ?? నువ్వే వెళ్లి సీక్రెట్ గా గిఫ్ట్ తెచ్చి ఇంట్లో పెట్టొచ్చు గా ……. ”

నేను నవ్వాను.

“ఆ నవ్వు చూడు ……. ” అంది.

ఇంకా నవ్వాను.

“ఛి …… నీ మీద నాకు కోపం కూడా రావట్లేదు …… ”

నేను నవ్వి “సరే ……. ఇచ్చేస్తానులే గిఫ్ట్ ………. ఇంక నిన్ను నెక్స్ట్ టైం నుంచి టీస్ చేయనులే …… ” అన్నాను.

“వొద్దు …….. ”

“వొద్దా ??”

స్వీటీ దగ్గరగా జెరిగి “సారీ ……. సంజు ….. ఇందాక ఏదో అలా అనేశాను …… ” అంది.

“హే ఇట్స్ ఒకే ……. ఇప్పుడేం అయిందని ??”

“అలా ఎప్పుడు నాకు ……. నన్ను బాగా టీస్ చేయి ……. ”

“హే …… నేను ఊరికినే అన్నాను …… నిన్ను టీస్ చేయకుండా ఎలా ఉంటాను ??” అన్నాను.

స్వీటీ నవ్వింది. నేను కూడా నవ్వాను. ఇద్దరం కౌగిలించున్నాం.

నేను స్వీటీ జుట్టు నిమురుతూ “ఐ లవ్ యు స్వీటీ …… ”

“ఐ లవ్ యు టూ సంజు …… ” అంది.

అలాగే కొంచెం సేపు ఇద్దరం ఉండిపోయాము.

కౌగిలయ్యాక “పద వెళ్లి కేక్ చేద్దాం ……. ”

నేను వెబ్సైటు ఓపెన్ చేసి instructions తీసాను.

ముందుగా పిండి తాయారు చేయటానికి వాటర్ తీసుకొని పిండిని ఎలా కలపాలి స్వీటీకి ఫోన్ లో చూపించాను.

నేను అక్కడే కిచెన్ గట్టు మీద కూర్చొని స్వీటీకి instructions ఇస్తున్నాను.

“ఓయ్ ….. సంజు ….. ఏంటి ?? నువ్వేం చేయవా ??”

“లేదు….. ”

స్వీటీ నన్ను అలాగే చూస్తుంది.

“మరి ఏదో రొమాన్స్ అన్నావ్ …… ”

నేను గట్టు నుంచి దిగి స్వీటీ దగ్గరికి వెళ్లి తన నడుం పట్టకున్నాను . తన చేతులకి పిండి పొడిగా అంటుకుని ఉంది. తను నా భూయాజల పై చేతులు వేసి “హెల్ప్ చేయమన్నాను ….. డిస్టర్బ్ చేయమనలేదు ….. ” అంది.

నేను నెమ్మదిగా తన పెదాలకి నా పేదలు కలిపి జస్ట్ అలా తాకి వదిలేసాను.

“ఏంటి ఆపేశావ్ ??”

“ఓ …… ముద్దు కావల ??” అన్నాను.

స్వీటీ తల దించుకొని ఇబ్బంది పడింది.

నేను తన తలని కొంచెం ఎట్టి ఒక తీయటి ముద్దిచ్చాను.

“సంజు…… ”

“ఏంటి ??”

“ఇలా కేక్ చేస్తే ….. రాత్రికి కూడా అవ్వదు …… ”

“అందుకే ఆన్లైన్ లో ఆర్డర్ చేసాను ఒకటి ….. ”

“ఏంటి ??”

“నువ్వు కేక్ చేయగలవో లేదో అని …… ”

“అంటే నా మీద నమ్మకం లేదా ??”

“అవును ….”

Updated: January 10, 2023 — 3:14 am

2 Comments

  1. Ah honeymoon episode kuda raasi konchm punyam kattuko mawa…

  2. Your story is very good and very intresting . So please continued next part

Comments are closed.