లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – End 69

“హా …….. అవును సంజు ……. ”

“ఒక రెండు వారాలు మనల్ని డిస్టర్బ్ చేసేవాలెవ్వరు ఉండరు …… కంపెనీ కాల్స్ ఉండవు ……… హ్యాపీ గా ఎంజాయ్ చేయొచ్చు …… ”

“hmmmmmm ……. అవును ……. ”

“ఇంకేంటి ??”

స్వీటీ నేను కబుర్లు చెప్పుంటు పడుకుండిపోయాము.

మరుసటి రోజు :

పొద్దునే స్వీటీ వాళ్ళ నాన్నని రిసీవ్ చేసుకోవటానికి బైక్ లో వెళ్లాను. అక్కడ బస్సు దిగగానే రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చాను.

ఇంట్లో స్వీటీని చూసి చాల హ్యాపీ గా ఫీల్ అయ్యారు అంకుల్. స్వీటీ కూడా చాల హ్యాపీ గా ఫీల్ అయ్యింది.

అందరం రెడీ అయ్యి టిఫిన్ చేసి ఎయిర్ పోర్ట్ కి రెండు క్యాబ్స్ లో వెళ్ళాము.

ఫ్లైట్ కి ఇంకా రెండు గంటల టైం ఉంది. ఎయిర్పోర్ట్ లోకి వెళ్లి లాబీ లో కూర్చొని కొంచెం సేపు అందరం చాలా మాట్లాడుకున్నాం.

“నాన్న ….. మీరెలా వెళ్తారు మరి ??”

“ఏమో రా కనుక్కుంటాం ….. ” అన్నాడు నాన్ను.

“బావ గారు …… ఎం అక్కర్లేదు……. నేను కూడా బస్సుకె…….. నాతో వచ్చేయండి …… నాకు తెలుసు ఎలా వెళ్ళాలో …… అక్కడ నుంచి సులువుగా వెళ్లొచ్చు ”

“ఎంత టైం పడుతుంది …….అంకుల్ ??”

“చెప్పాలంటే …… సాయంత్రం ఉంది బస్సు …… మళ్ళి రాత్రికే ……. ఇప్పుడు వెళ్తే కానీ అక్కడికి చేరుకోలేం …….. లేదంటే మళ్ళి రాత్రి వరకు ఇంకో బస్సు కోసం ఎదురు చూడాలి …… ”

“అలా అయితే వెళ్దాము …… మనం ……. ”

అమ్మ “సరేరా ……. అయితే ……. హ్యాపీ జర్నీ ……. బాగా వెళ్ళిరండి …….. ”

అంకుల్ మా నాన్న కూడా మాకు హ్యాపీ జర్నీ చెప్పి టాటా చెప్పి వెళ్లిపోయారు.

స్వీటీ నేను బోర్డింగ్ పాస్ ప్రింట్ తీసుకొని, లగేజ్ తీసుకొని లోపలికి సెక్యూరిటీ చెక్ కోసం వెళ్ళాము. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాక టికెట్ పై ఉన్న గేట్ నెంబర్ దగ్గరికి వెళ్లి అక్కడ కూర్చున్నాము. అక్కడ ఒక గంట కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపాము. అప్పటికే సాయంత్రం అయ్యింది.

చిన్నగా ఫ్లైట్ రానే వచ్చింది. బోర్డింగ్ పాస్ తో క్యూ లో నిల్చొని నెమ్మదిగా ఫ్లైట్ ఎక్కి మా సీట్స్ లో కూర్చున్నాం.

ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి బాగా పెద్దగా ఉంది ఫ్లైట్. చాలా మంది వచ్చి ఎక్కారు.

“సంజు ……. ” అంది

“ఎం కాదులే …… నా చేయి గట్టిగ పట్టుకో …… ”

“hmmmm …… ”

“ఐన నువ్వు ఫ్లైట్ ఇదే ఎక్కటం ఫస్ట్ టైం అంటే నమ్మలేక పోతున్న …… ”

“నీకంటే ఏదో కంపెనీ మీటింగ్ వాల్ల ఫ్రీ గా వచ్చిందని ఫ్లైట్ ఎక్కావు …… నాకు అలంటి ఛాన్స్ రాలేదు …… ”

“నేను ఎక్కింది మాములు ఫ్లైట్ …… ఇంటర్నేషనల్ ఫ్లైట్ నేను కూడా ఎక్కలేదు …… ”

“హా …….. ”

నెమ్మదిగా ఫ్లైట్ నిండి, అనౌన్స్మెంట్ ఇచ్చారు. మా సీట్ బెల్ట్ వేసుకొని, ఫోన్స్ ఆఫ్ చేసేసి పెట్టుకున్నాం.

ఫ్లైట్ లో కేబిన్ క్రూ ఫ్లైట్ అనౌన్స్మెంట్ లో చెప్పే విషయాలని డెమోగా అందరికి చెప్పారు.

కొన్ని నిమిషాలలో ఫ్లైట్ కదలటం స్టార్ట్ అయ్యింది. స్వీటీ కళ్ళలో మంచి excitement కనిపించింది. నా చేయి గట్టిగ పట్టుకుంది.

నెమ్మదిగా ఫ్లైట్ ని రన్ వే పైకి తీసుకొని వెళ్లి అక్కడ వెయిట్ చేసాడు.

స్వీటీ బయటకు చూస్తుంది. అందరూ ఆతృతగా టేక్ ఆఫ్ కోసం వెయిట్ చేశారు.

“హె………… ఏంటి ఏదో కొంచెం భయంలో ఉన్నట్లున్నావ్ …… రిలాక్స్ ……. ”

“సంజు …..నీకలాగే ఉంటుంది …..”

“రిలాక్స్ అండ్ ఎంజాయ్…….నా చేయి ఇంకా గట్టిగ పట్టుకో…. “

Updated: January 10, 2023 — 3:14 am

2 Comments

  1. Ah honeymoon episode kuda raasi konchm punyam kattuko mawa…

  2. Your story is very good and very intresting . So please continued next part

Comments are closed.