లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – End 69

గట్టిగ పట్టుకున్న చేయిని ఇంకా గట్టిగ పట్టుకుంది

“ఏంటే అలా పట్టేసుకున్నావ్ ??”

“నువ్వేగా ఇంకా గట్టిగ పట్టుకో మంది ……”

“పట్టుకోమన్న …… విరిచేయమనలేదు ….. ”

ఎవ్వరు చూడకుండా తన కాలితో నా కాలు కొట్టింది.

నేను లైట్ గా స్వీటీని చూసి నవ్వాను.

తను కూడా నవ్వింది.

చిన్నగా ఫ్లైట్ ముందుకి స్టార్ట్ అయ్యింది. టేక్ ఆఫ్ కాబట్టి ఫుల్ స్పీడ్ లో రన్ వే పైన స్టార్ట్ అయ్యింది. స్వీటీ నా చేయి అస్సలు వదలేదు.

ఫ్లైట్ ఫాస్ట్ గా ముందుకి వెళ్లి నెమ్మదిగా టేక్ ఆఫ్ చేసుకుంది. నెమ్మది నెమ్మదిగా గా పై పై కి వెళ్ళింది. చిన్నగా భూమి మాయమయిపోయి కిటికీలో మేఘాలు కనిపించటం మొదలయ్యాయి.

స్వీటీకి ఇదే మొదటి ఎక్స్పీరియన్స్ కావటం వల్ల చాల హ్యాపీ గా ఆతృతగా ఉంది. విండో నుంచి ఆశ్చర్యంతో చూస్తూ అలాగే ఉండిపోయింది. టేక్ ఆఫ్ అయ్యి మాములు పోసిషన్ కి వచ్చేవరకు అలాగే బయటకు చూస్తూ గడిపింది. చాల క్యూట్ గా అనిపించింది నాకు.

నెమ్మదిగా బయట చీకటి పడింది. ఫ్లైట్ లో ఏవో స్నాక్స్ ఇచ్చారు. అవి తింటూ మాట్లాడుకుంటూ టైం గడిచిపోయింది. టీం చిన్నగా రాత్రి 11 అయ్యింది.

చిన్నగా స్వీటీ నా భుజం పై తల వాల్చి నిద్రలోకి జారుకుంది.

నాకు మాత్రం అస్సలు నిద్ర పట్టలేదు.

ఫోన్ తీసి తను నాకు పంపిన వాట్సాప్ మెసేజెస్, మేము దిగిన ఫొటోస్, వీడియోస్ అన్ని చూస్తూ కూర్చున్నాను.

స్వీటీ నేను రోజు కలిసే ఉన్న సరే, ప్రతి వీకెండ్ బాగా సెక్స్ చేసిన సరే …….. ఇలా హనీ మూన్ తనతో కలిసి వెళ్తుంటే ఏదో కొత్తగా అనిపించింది. ఏదో తెలియని ఒక బలమైన మాటలలో చెప్పలేని ఫీలింగ్.

తనతో ఎంత టైం స్పెండ్ చేసిన ……….. తన గురించి నాకు ఒకటే ఆలోచనలు ……. తనతో ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని చిలిపి పనులు చేసిన, ఎంత సెక్స్ చేసిన సరే, తన చేయి పట్టుకొని తనతో కబుర్లు చెప్పాలని, తనని గట్టిగ కౌగిలించుకోవాలి, తనకి ముద్దులు పెట్టాలని, తనని నవ్వించాలని, తనతో అలిసిపోయేవరకు సెక్స్ చేయాలని, తనతో బాగా చిలిపి పనులు చేయాలని…… ఇలా ఒకటే ఆలోచనలు నాలో.

అలా మా ఇద్దరి తీయటి జ్ఞాపకాలని చూస్తూ నాలో నేను నవ్వుకుంటూ ……. ఉండిపోయాను.

లవ్ అంటే ఇదే ఏమో……. అనిపించింది.

——————————————————-

అదండీ ……. మొత్తానికి పెళ్లి చూపులతో స్టార్ట్ అయినా మా లవ్ స్టోరీ ……. తెలియకుండానే ఇక్కడ దాకా వచ్చింది…..

ఒక అరేంజ్డ్ మ్యారేజ్ ప్రపోసల్ తో స్టార్ట్ అయిన మా పరిచయం…. ఒక అందమైన అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ గా మారింది.

సైనింగ్ ఆఫ్
సంజయ్

——————————————————-
THE END
——————————————————-

Updated: January 10, 2023 — 3:14 am

2 Comments

  1. Ah honeymoon episode kuda raasi konchm punyam kattuko mawa…

  2. Your story is very good and very intresting . So please continued next part

Comments are closed.