లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – End 69

నేను నా ఫోన్ లో ఓపెన్ చేసి చూస్తే “రాత్రికే లేక ఇప్పుడేనా ??” అని రాసింది.

ఆ మెసేజ్ చదవగానే నాలో ఏదో తెలియని ఫీలింగ్. తనని చూసి “ఇంటికి వెళ్దామా ??” అన్నాను.

“పద” అంది.

ఇద్దరం వెంటనే బిల్ కట్టేసి అక్కడినుంచి ఇంటికి వెళ్ళాము. సినిమా టికెట్స్ వేస్ట్ అయిపోయాయి. ఐన సరే మా ఇద్దరి మధ్య ఏదో తెలియని ఒక అట్రాక్షన్.

ఇద్దరం కొంచెం ప్రశాంతంగా బైక్ మీద ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళాము. ఇంటి డోర్ తెరిచి లోపలికి వెళ్ళగానే తనని వెంటనే ఎత్తుకొని బెడ్ రూమ్ లోకి తీసుకొని వెళ్లి ఇద్దరం ఇంకో రౌండ్ శృంగారం బాగా ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమతో బాగా కసిగా చేసాం.

అదయ్యాక స్వీటీ కి హెల్ప్ చేస్తాను అని స్వీటీ వంట చేసేటప్పుడు నేను బాగా డిస్టర్బ్ చేసాను తనని. బాగా నాటి పనులు చేసాను. అలా చేయటంతో నన్ను హెల్ప్ చేయొద్దు అని చెప్పింది. ఇద్దరం రొమాంటిక్ గా డిన్నర్ చేసి.

డిన్నర్ అయ్యాక ఇద్దరం మంచం మీద ఒకరి కౌగిలిలో ఒకరం పడుకుని,

“స్వీటీ……”

“ఏంటి సంజు ??”

“ఈ రోజు ఆఫీస్ కి వెళ్లుంటే చాల మిస్ అయ్యేవాళ్ళమే…..”

“అవును సంజు……” అంది.

స్వీటీ నాతో “సంజు…… మనం ఆఫీస్ మానేసి ఇవన్నీ చేస్తున్నాం……కొంచెం గిల్టీ గా ఉంది…… నాకు”

“స్వీటీ ఒక రోజే గా ఎం కాదు లే…..”

“సంజు….. ”

“ఏంటే ??”

“సంజు….. నాకు….. నీ గురించే అన్ని ఆలోచనలు తెలుసా ?? మొన్న కూడా అందుకే ఆఫీస్ కి వెళ్ళలేదు నేను…….నా వల్ల కావట్లేదు”

“నాకు కూడా అవే ఫీలింగ్స్ ఉన్నాయే…….”

“సంజు…… లవ్ అంటే ఇలాగే ఉంటుందేమో……”

“hmmmm……..”

స్వీటీ నేను మరుసటి రోజు నుంచి మా జాబ్స్ లో బిజీ అయిపోయాము. అయితే ఈ సరి వీకెండ్ ఎక్కడైనా మంచి ఫైవ్ స్టార్ హోటల్ లో కానీ రిసార్ట్ లో కానీ గడుపుదామని అనుకున్నాను. కానీ రెండు రోజులు కాబట్టి మంచి మంచి హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ 10 వేలు తక్కువ ఎక్కడ లేవు. వీకెండ్ ప్లాన్ కాబట్టి డిస్కౌంట్స్ కూడా ఎక్కడ లేవు. ఇక డబ్బులు లేవని వదిలేసాను.

“రేయ్ సంజయ్…..”

“హే శరత్……”

“నువ్వు డిస్కౌంట్ కుఫాన్స్ కానీ ఏమైన్స్ ఆఫర్స్ కోసం అడిగావు కదా…..నేను పోయిన సరి మెంబర్షిప్ దేనికో క్లబ్ కి తీసుకుంటే నాకు ఒక రెండు కూపన్స్ ఇచ్చారు…..నిన్నే ఇంట్లో కనపడ్డాయి….. ఇంకో 10 రోజుల్లో వాటికి డేట్ కూడా అయిపోతుంది……”

“డిస్కౌంట్ అంటే ఏ హోటల్ కైనా పనిచేస్తుందా ??”

“చూడు సంజయ్ డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ కాదు…… నువ్వు ఈ ఇయర్ ఎక్కడైనా హోటల్ బుక్ చేసుకుంటే వచ్చే ఇయర్ ఇదే రోజు నీకు అదే హోటల్ లో ఫ్రీగా ఉండొచ్చు….. అంటే ఇప్పుడు మొత్తం పే చేయాలి….. నెక్స్ట్ ఇయర్ ఫ్రీ…..”

“ఓ…..” అని కొంచెం నిరాశ పడ్డాను.

“సంజయ్…. నీకు ఒకే అంటే చెప్పు….. లేదంటే ఇంకెవరికైనా ఇస్తాను….. వాటిని ఎందుకు వేస్ట్ చేయాలి……”

నేను ఆలోచించాను, ఒక 10 వేలు పోయిన మళ్ళి నెక్స్ట్ ఇయర్ కూడా ఇద్దరం ఒక వీకెండ్ స్టే చేయొచ్చు ఫ్రీగా. ఇదేదో ఆఫర్ బాగుందని అనుకున్నాను.

“ఒకేరా థాంక్స్……బానే ఉంది ఆఫర్…..ఎం చేస్తాం మీ లాగా మాకు అంత డబ్బు లేదు….. ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళం …….” అన్నాను.

“రేయ్ ఏడవడం ఆపుతావా ?? నాకు ప్రమోషన్ తొందరగా వచ్చిందని మీ అందరికి నేనొకడ్ని దొరికాను…… నా పై పంచ్ లు వేయటం అందరికి కామన్ అయిపోయిందిరా…. నాకు కూడా టైం వస్తుంది….”

“ఏడిశావులే వెళ్లు…..”

Updated: January 10, 2023 — 3:14 am

2 Comments

  1. Ah honeymoon episode kuda raasi konchm punyam kattuko mawa…

  2. Your story is very good and very intresting . So please continued next part

Comments are closed.