లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – End 69

“హే ….. నీ చేతిలో వాచ్ చాల బాగుందే…… ఎప్పుడు కొన్నావ్??” అని అడిగాను.

“చంపేస్తాను నిన్ను…… నువ్వు కావాలని టాపిక్ డైవర్ట్ చేస్తున్నావ్…….నాకు ఆన్సర్ చెప్పకుండా…..”

“నీకు కంప్లిమెంట్ ఇవ్వటం తప్ప ??”

“నువ్వు చాల ఓవర్ స్మార్ట్ గా మాట్లాడుతున్నావ్…..”

“ఈ డ్రెస్ లో చాల బాగున్నావే……” అన్నాను.

“సంజు….. నువ్వు కావాలని నన్ను ఏడిపించటానికి…. ఇలా నాకు సమాధానం చెప్పటంలేదు……”

“ఎం సమాధానం ??”

నన్ను చిరుకోపంతో చూస్తుంది. నా మెడ చుట్టూ ఉన్న చేతులు తీసేసింది.

“పో.. సంజు…. నీతో మాట్లాడను…..” అంది.

నేను తనని ఇంకా గట్టిగ హత్తుకొని “సరే ….. చెప్తాను…..”

కొంచెం కోపంలో “చెప్పు……” అంది.

“కేక్ కోసం…..” అన్నాను.

“కేక్ ఆ ??” అని ఒక్కసారిగా తన ఫేస్ అంత మారిపోయి విచిత్రంగా చూసింది.

“యా…..ఎందుకు నన్నలా చూస్తున్నావు ??” అని అడిగాను.

స్వీటీ “నీకు కేక్ చేయటం వచ్చా ??” అని అడిగింది

“రాదు…..” అన్నాను.

“మరి ??”

“ఇద్దరం ట్రై చేద్దాం……ఈ రోజు హాలిడే నే గా…….”

నన్ను స్వీటీ అలాగే చూస్తుంది.

“ఏంటే నాన్నల చూస్తున్నావ్ ??” అని అడిగాను.

“ఎం లేదు…… ఐన సడెన్ గా కేక్ చేయాలని నీకు ఎందుకు అనిపించింది ??”

“నిన్న రాత్రి కలొచ్చింది….”

“కల ??”

“నిన్న రాత్రి ఇద్దరం రొమాంటిక్ గా సరదాగా ఇంట్లో ….. కేక్ తయారు చేస్తున్నాం అంట…..” అంటూ తన చెవిలో “….ఆ తర్వాత నీతో కలసి ఆ కేక్ ని నేను చాల నాటి గా తిన్నానంట…..” అన్నాను.

స్వీటీ కొంచెం సిగ్గు పడి నన్ను చేయి మీద మెల్లగా కొట్టింది.

“స్వీటీ…..నిజం…..”

స్వీటీ నన్ను అలాగే చూస్తుంది.

“ఏంటే వింతగా చూస్తున్నావ్ నన్ను ??”

“ఎం లేదు……”

“నువ్వు ఊహించుకుంటున్నావ్ కదా ??”

“ఏంటి ??”

“అదే….. నేను కేక్ ని ఎంత నాటి గా తింటాను అని…..”

“ఎం లేదు…..”

“నీ కళ్ళలో నాకు కనిపిస్తుంది……”

స్వీటీ లో సిగ్గు కనిపించింది.

స్వీత్యిని అలాగే ఒక అరా నిమిషం డిఫరెంట్ అంగెల్స్ లో చూసి “అంత నటించక్కర్లేదు…….” అన్నాను.

ఒక్కసారిగా నవ్వేసింది.

“సరే రెడీ అయ్యి రా వెళదాం……” అన్నాను.

“ఒకే……” అంటూ వెనక్కి తిరిగింది.

నేను తన చేయి పట్టుకున్నాను. తను వెనక్కు తిరిగి చూసింది. తనని దగ్గరగా తీసుకొని తన నడుం పై చేయి వేసి తనకి ఒక తీయటి ముద్దిచ్చాను.

ఇద్దరం ఒకరి కళ్ళలో ఒకరం చూసుకుంటూ ఉన్నాం స్వీటీ ఏదో చెప్పాలని ఉంది ….. అందుకే స్వీటీ తో “ఏంటి ??” అని అడిగాను.

“కేక్ తిన్నాక….. ఎం చేద్దాం ??” అని మెల్లగా అడిగింది.

Updated: January 10, 2023 — 3:14 am

2 Comments

  1. Ah honeymoon episode kuda raasi konchm punyam kattuko mawa…

  2. Your story is very good and very intresting . So please continued next part

Comments are closed.