లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – End 69

“నాకు కూడా టైం ఒస్తది రా…..మీ అందరితో నేను కూడా ఆడుకుంటాను…..”

ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లా నవ్వుకున్నాం. నాకు షాక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు.

నేను ఈవెనింగ్ టైం లో ఫోన్ లో ఒక మంచి హోటల్ వెతికి బుక్ చేసాను. అంత కలిపి పదివేల పైనే అయ్యింది. ఒక మంచి ఫోర్ స్టార్ హోటల్ లో శుక్రవారం ఈవెనింగ్ నుంచి ఆదివారంఈవెనింగ్ వరకు ఒక మంచి రూమ్ బుక్ చేసాను. డబ్బులు ఆన్లైన్ లో అడ్వాన్స్ పే చేసాను. బుకింగ్ కంఫర్మ్ అయ్యిందని మెసేజ్ వచ్చింది. ఇదంతా శుక్రవారం వరకు దాచి స్వీటీని సుర్ప్రైస్ చేయాలని అనుకున్నాను.

శుక్రవారం:

ఇద్దరం లేసి రెడీ అయ్యాము ఆఫీస్ కి వెళ్ళటానికి. ఇద్దరం హోటల్ లో స్పెండ్ చేస్తాం కాబట్టి మంచి ఉషారు నాలో వచ్చింది. తనకి ఆ సుర్ప్రైస్ ఇచ్చి తనలో రియాక్షన్ చూడాలని బాగా అనిపించింది. ఇప్పుడే ఆఫీస్ కి వెళ్లేముందే చెప్పేద్దామా లేక ఈవెనింగ్ చెబుదామా అని ఆలోచించాను. ఎలాగో ఆఫీస్ మూడ్ లో ఉన్నాం కదా అని ఈవెనింగ్ చెబుదామని డిసైడ్ అయ్యాను. అయితే స్వీటీ కి ఆఫీస్ లో లేట్ అవ్వొచ్చని నేను స్వీటీతో

“స్వీటీ….”

“hmmmmm…..”

నేను తన దగ్గరకు వెళ్లి రెండు చేతులు పట్టుకొని “ఈ రోజు……ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేయి…….” అన్నాను.

“ఒకే……”

“ఐదుకల్లా వచ్చేసేయి…..” అన్నాను.

“ఒకే……” అని చాల నార్మల్ గా చెప్పింది.

ఇద్దరం ఆఫీస్ కి వెళ్ళాం. అయితే నా మూడ్ అంత వీకెండ్ గురించే. మేమిద్దరం హోటల్ రూమ్ లో ఆడుకోవటానికి కార్డ్స్, కొన్ని బోర్డు గేమ్స్ (board games) కూడా నిన్న మొన్న కొన్నాను. అలాగే కొన్ని మంచి మంచి సినిమాలు కూడా లాప్టాప్ లోను పెన్ డ్రైవ్ లోను ఎక్కించాను. ఇద్దరం అలా హోటల్ లాన్ లో బయట రొమాంటిక్ గా తిరగటానికి స్వీటీ కోసం షాలువా కూడా కొన్నాను. రేపు ఈవెనింగ్ కి హోటల్ టెర్రస్ పైన రెస్టారంట్ లో కాండిల్ లైట్ డిన్నర్ కి కూడా బుక్ చేసాను. అలాగే ఎప్పటిలాగే స్వీటీ కోసం ఒక పెద్ద చాక్లెట్ అలాగే ఒక రోజా పువ్వు కూడా కొన్నాను. అలాగే ఇద్దరి కోసం మంచి మ్యూజిక్ కూడా సేవ్ చేసి పెట్టుకున్నాను. ఆఫీస్ లో చాల కష్ట పది ఏదో అలా అలా పని పూర్తి చేసి ఇంటికి వచ్చాను.

స్వీటీ రాక కోసం ఎదురు చూసాను. తను రావటానికి ఇంకా టైం పడుతుంది, ట్రాఫిక్ లో ఉన్నానని చెప్పింది. నేను ఈ లోగ ఒక సూట్ కేసు తీసి ఈ రెండు రోజులకి సద్దుకున్నాను. తన నల్ల చీర, అలాగే తను సెక్సీగా నా కోసం కొన్న డ్రెస్సులు కూడా ప్యాక్ చేసి పెట్టాను రెడీ గా.

అప్పుడే బెల్ మోగింది. వెంటనే సూట్ కేసు ని లాక్కుని డోర్ ఎదురుగా కొంచెం దూరంలో పెట్టి డోర్ ఓపెన్ చేసాను. స్వీటీ కనిపించింది. సూట్ కేస్ చూసింది, తనకేమి అర్ధం కాలేదు.

“సంజు…. సూట్ కేస్ ఏంటి ??”

“అది….. మనిద్దరం ఈ వీకెండ్ హోటల్ లో ఉండబోతున్నాం…..”

తనకెలా రియాక్ట్ అవ్వాలో అర్ధంకాలేదు “ఓ…..వావ్…….” అని కొంచెం నవ్వింది.

తనని గట్టిగ హగ్ చేసుకున్నాను. నన్ను కూడా తను గట్టిగ హగ్ చేసుకుంది. నేననుకున్నంత రియాక్షన్ ఇవ్వలేదు స్వీటీ. ఆఫీస్ లో అలిసిపోయిందేమో అనుకున్నాను.

అలాగే స్వీటీని హాగ్ చేసుకుంటూ నేను “స్వీటీ……అక్కడే రెడీ అవ్వు……ఇప్పుడే క్యాబ్ బుక్ చేస్తున్నాను …..టైం లేదు…. మనకి…..ఎప్పుడెప్పుడు నీతో ఏకాంతం దొరుకుతుందా… అని వెయిట్ చేసాను….నా వల్ల కావట్లేదే…….” అన్నాను.

“hmmmmm……” అంది

కౌగిలి నుంచి నెమ్మదిగా బయటకు వచ్చాక “ఏంటే ?? ఎందుకు అదోలా ఉన్నావ్ ఈ రోజు ??” అని అడిగాను.

“ఎం లేదు….. ఆఫీస్ వర్క్ కదా…..” అంది

“ఆఫీస్ లో ఏమైనా అయ్యిందా ??”

“అలాంటిదేమి లేదు……ఆఫీస్ ఎప్పటిలాగే హ్యాపీ గా ఉంది వీకెండ్ వల్ల……”

“hmmmm…… సర్లే….. కొంచెం అలిసిపోయినట్లు కనిపిస్తున్నావు….. అక్కడికి వెళ్తే నీకు కూడా మూడ్ వచ్చేస్తుందిలే….”

స్వీటీ నవ్వింది.

“సరే పద….. కిందకి వెళదాం… ” అన్నాను.

“ఒకే…..” అంది.

ఇద్దరం కిందకు వెళ్లి క్యాబ్ ఎక్కాము. క్యాబ్ లో కూడా స్వీటీ మూడ్ అంతగా బాలేదు. ఏదో మూడ్ ఆఫ్ లో ఉంది. క్యాబ్లో ఇద్దరం బాగా దగ్గరగా కూర్చున్నాము. ఒకరి చేతులు ఒకరం పట్టుకున్నాం. స్వీటీ నా భుజం పై తల పెట్టుకొని అలాగే సైలెంట్ గా ఉండిపోయాము. తను అలా నా భుజం పై తల పెట్టుకొని తన చేతులతో నన్ను గట్టిగ కౌగిలించుకొని అలాగే తన కళ్ళు రెండు మూసుకొని పోయాయి.

నెమ్మదిగా హోటల్ కి చేరుకున్నాము. రిసెప్షన్ లో రూమ్ డోర్ స్వైప్ చేసే కార్డు తీసుకొని పైకి వెళ్లాం. బెల్ బాయ్ రూమ్ చూపించటానికి వచ్చాడు. మాకు రూమ్ చూపించి అక్కడి నుంచి బెల్ బాయ్ వెళ్ళిపోయాడు. నేను తలుపేసేసి లాక్ చేసాను.

స్వీటీ మంచం పై కూర్చుంది. నేను తన పక్కనే బెడ్ పైన కూర్చొని “హే…… ఇందాకటి నుంచి చూస్తున్నాను…..ఇంతే స్వీటీ అలా ఉన్నవేంటి ?? మొహం లో ఉషారు లేదు…..”

నా వైపు చూసి “ఎం లేదు…..సంజు…..”

“స్వీటీ……ఏదో ఉంది….. అది ఏంటో నాకు చెప్పట్లేదు…..”

Updated: January 10, 2023 — 3:14 am

2 Comments

  1. Ah honeymoon episode kuda raasi konchm punyam kattuko mawa…

  2. Your story is very good and very intresting . So please continued next part

Comments are closed.