లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – End 69

“సంజు…..అది…. ఎం లేదు……”

“స్వీటీ….నేను నీ లైఫ్ పార్టనర్ నే….. ఏంటో చెప్పు….నా దగ్గర ఎందుకు మోహుమాటం ??”

“సంజు ఐ అం వెరీ సారీ……. ” అంది

“ఇట్స్…. ఓకే….. ఎం జరిగిందో చెప్పు…..”

తన కళ్లలోనుంచి కన్నీళ్లు వచ్చాయి వెంటనే నన్ను హగ్ చేసుకుంది.

నేను తన వీపుని నిమిరి సముదాయిస్తూ “హే….హే….. ఏమైందే నీకు ?? ఎందుకేడుస్తున్నావ్ ఇలా ??” అని అడిగాను.

తాను మెల్లిగా “నా…..నా….బెస్ట్ ఫ్రెండ్ ….. ”

“నీ బెస్ట్ ఫ్రెండ్…….”

“తను ఈ రోజే సూసైడ్ చేసుకొని……..”

“ఒకే ….. ఒకే…..” అని మళ్ళి తనని దగ్గరకు తీసుకున్నాను.

బాగా ఏడ్చేసింది నన్ను గట్టిగ పట్టుకొని. నాకు ఎం చేయాలో అర్ధం కాలేదు. తనని గట్టిగ పట్టుకొని “స్వీటీ….. ఇట్స్ ఒకే…..ఇట్స్ ఒకే………”

అలాగే కొంచెం సేపు ఏడ్చి నాకు సారీ చెప్పింది.

“సారీ సంజు…..నువ్వు నా కోసం ప్లన్స్ చేసావ్……కానీ…. కానీ…..”

“స్వీటీ….ఎం మాట్లాడొద్దు…..” అంటూ తన కనిళ్ళు తుడిచి తన చేయి పట్టుకొని బాత్రూమ్ లోకి తీసుకొని వెళ్లి తన మొహం తుడుచుకుంది.

స్వీటీ చాల బాధలో ఉండేసరికి వాళ్ళ మధ్య బంధం ఎంత మంచిదో అర్ధమైంది. తనకి ఇలాంటి సమయంలో నేను దగ్గరగా ఉండాలని ఇద్దరం మంచం పైన పడుకున్నాం. స్వీటీ నన్ను గట్టిగ కౌగిలించుకొని ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి చెప్పింది. తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరినో పెళ్లి చేసుకొని వాళ్ళు పెట్టె హింసలు తట్టుకోలేక నిన్న రాత్రి సూసైడ్ నోట్ రాసి విషం తాగి చనిపోయిందని చెప్పింది. చాల మంచి అమ్మాయని చెప్పింది. ఎలాంటి చెడు తెలియని ఒక అమ్మాయి అలా బలైపోయిందని స్వీటీ అస్సలు తట్టుకోలేక పోయింది. మొన్న కూడా స్వీటీతో ఫోన్ లో ఒక రెండు నిమిషాలు బాగానే మాట్లాడిందంట. అలాగే స్వీటీ నాకు తన బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్తుంటే వింటూ అలాగే ఇద్దరం డిన్నర్ కూడా తినకుండా నిద్రపోయాము.

నాకు మధ్య రాత్రి మెలుకువ వచ్చింది. టైం చూస్తే రాత్రి రెండయ్యింది. స్వీటీ నా పక్కన లేదు. లేసి చూసాను. బాత్రూం లో నీళ్ల శబ్దం వినిపించింది. బాత్రూం డోర్ లాక్ చేసి లేదు. నెమ్మదిగా వెళ్లి డోర్ తీసి చూసాను. స్వీటీ బాత్రూమ్ లో షవర్ డోర్ వెనకాల కింద కూర్చొని బాగా బాధలో ఏడుస్తుంది.

నేను వెళ్లి తన పక్కనే కూర్చున్నాను. షవర్ ఆన్ చేసే ఉంది. నెమ్మదిగా నీళ్లు పడుతున్నాయి. నిద్ర పట్టలేదని చెప్పింది. నెమ్మదిగా షవర్ ఆపేసి తనని దగ్గరకు తీసుకొని అలాగే ఇద్దరం ఉండిపోయాము.

కొన్ని రోజుల తరువాత:

నెమ్మది నెమ్మదిగా స్వీటీ మళ్ళి మాములుగా అయ్యింది. ఇక వచ్చే వారమే మా హనీ మూన్.

టైం రాత్రి పదయ్యింది. స్వీటీ నేను బెడ్ లో పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నాము.

“స్వీటీ, చాల రోజుల తరువాత నువ్వు మళ్ళి సంతోషంగా కనిపిస్తున్నావు…… తెలుసా ??”

“థాంక్స్ సంజు….. నాకు సపోర్ట్ గా ఇన్ని రోజులు ఉన్నందుకు…….”

“hmmmm……”

“సంజు……”

“ఏంటే ??”

“సరే, నా వల్ల ఇదంతా జరిగింది కాబట్టి, నేను నీకోసం ఏమైనా చేయాలని అనుకుంటున్నాను…….”

“స్వీటీ నేనిదంతా ప్రేమతో చేసాను, ఏదో ఆశించి కాదు……”

“సంజు…. నాకు తెలుసు….. కానీ నాకు కొంచెం గిల్టీ గా ఉంది…… నా వల్ల మన ప్లన్స్ అన్ని చెడిపోయాయి….. నువ్వు కూడా ఇన్ని రోజులు నాకోసం అన్ని అడ్జస్ట్ అయ్యావు……”

నేనేం మాట్లాడలేదు, తననే చూస్తూ ఉండిపోయాను.

“సరే నా ఫోన్ చార్జర్ పక్కన టేబుల్ పైన పెట్టుంది…… అది తెచ్చివ్వు…..చాలు” అన్నాను.

స్వీటీ నన్ను కొట్టి “సంజు…నేను సీరియస్ గా చెబుతున్నాను …….”

“సరే అయితే ….. నా ఫోన్ చార్జర్ పక్కన టేబుల్ పైన పెట్టుంది, సీరియస్ పేస్ పెట్టి నాకు తెచ్చివ్వు…..”

స్వీటీ నన్ను చిరుకోపంతో చూసి “చి….. నేను నీతో మాట్లాడను…..”

“అయితే ప్రశాంతంగా పాడుకోవొచ్చు….ఈ రోజు …. ”

“ఆ ?? అంటే నీ ఉద్దేశం ఏంటి ?? నిన్ను…….” అంటూ నన్ను కొట్టడం స్టార్ట్ చేసింది.

“స్వీటీ….. ఆపవే……ప్లీస్…….”

“లేదు….. ఎప్పుడు నన్ను టీస్ చేయటమే నీకు పని……” అంటూ మళ్ళి మళ్ళి కొట్టింది. నా చేతులు అలాగే అడ్డం పెట్టుకొని ఉండిపోయాను.

Updated: January 10, 2023 — 3:14 am

2 Comments

  1. Ah honeymoon episode kuda raasi konchm punyam kattuko mawa…

  2. Your story is very good and very intresting . So please continued next part

Comments are closed.