లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – End 69

“సరే సరే…… సారీ……. ఆపు….. ప్లీస్…..స్వీటీ….. ఆపవే….” అంటూ నవ్వుతు చెప్పాను.

మధ్యలో ఆపింది.

నేను చేతులు తీసేసి తననే చూస్తున్నాను. ఇద్దరి మోహంలో పెద్ద చిరునవ్వే దాగుంది. స్వీటీ నవ్వే వరకు నేను నవ్వకూడదని అలాగే చూస్తూ ఉండిపోయాను.

“అయ్యిందా ??” అని అడిగాను.

“లేదు…..”

“మరి ??”

నానా చేయి మీద ఒకసారి కొట్టింది. కానీ ఇద్దరిలో ఆ చిరునవ్వు అలాగే దాగుంది.

“అయ్యిందా ఇప్పుడు ??” అని అడిగాను.

తలూపింది.

నేను కొంచెం నవ్వటం స్టార్ట్ చేసాను, తను కూడా నవ్వటం స్టార్ట్ చేసింది. ఇద్దరం నవ్వుకున్నాము. నేను తనని దగ్గరకు తీసుకొని కౌగిలించుకున్నాను. అలాగే కొంచెం సేపు ఉండిపోయాము. అలా స్వీటీని దగ్గరగా కౌగిలించుకుంటే చాల హాయిగా అనిపించింది.

స్వీటీ నన్ను చూసి “సంజు…… సీరియస్ గా అడుగుతున్నాను……..” అనింది.

“నాకేం కావాలో నీకు ఆల్రెడీ తెలుసు……” అన్నాను.

స్వీటీ నన్ను అదోలా చూసింది.

“స్వీటీ ఏదో నేనంటే ఎవరో తెలియక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లు నువ్వు ఫేస్ ని పెట్టావ్ తెలుసా ??”

స్వీటీ నవ్వేసింది. ఇద్దరం అలాగే ఒకరి కళ్ళలోకి ఒకరం ప్రేమతో చూసుకున్నాము. నేను నెమ్మదిగా స్వీటీ పెదాల దగ్గరకు నా పెదాలను తెచ్చి ఇద్దరం ముద్దిచ్చుకున్నాము. అలాగే కొన్ని క్షణాలు ముద్దుపెట్టుకున్నాం.

“సంజు……చెప్పు…ప్లీస్ ..సీరియస్ గా అడుగుతున్నాను……”

“సరే……….అయితే నువ్వు నన్ను ఇప్పటి నుంచి రా తో పిలువు……”

“ఆ?”

“సంజు అని కాకుండా “రా” తో పిలువు నన్ను…..”

స్వీటీ ఏమి మాట్లాడలేదు…….

“పోరా నేను నిన్ను పిలవను ….” అని నవ్వుతు చెప్పింది.

“మాటలు బాగా నేర్చావే నువ్వు……” అంటూ నేను తన పైకెక్కి రెండు చేతులు గట్టిగ అటు ఇటు పట్టుకుని “…..పొట్టి పొట్టి డ్రెస్సులేసుకుంటే ఇంకా సెక్సీగా కనిపిస్తావు తెలుసా ??” అన్నాను.

అటు ఇటు “అవును” అని చెప్పటానికి తలూపింది.

“అలా తలూపటం కాదు…… సెక్సీగా డ్రెస్సులు వేసుకొని రోజు నువ్వు నీ అందాలతో నన్ను బాగా టీస్ చేయాలి……” అన్నాను.

స్వీటీ ఎం మాట్లాడలేదు.

Updated: January 10, 2023 — 3:14 am

2 Comments

  1. Ah honeymoon episode kuda raasi konchm punyam kattuko mawa…

  2. Your story is very good and very intresting . So please continued next part

Comments are closed.