లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – End 69

“కం ఆన్ …… నువ్వే కదా సినిమా అది ఇది అన్నావ్ …… ”

“సరే ……. మనం హనీ మూన్ లో కూడా ఇలాగే రొమాన్స్ చేయాలి ……. ”

“సరే పద …… వెళ్దాము …… లేదంటే జలుబు చేస్తుంది …… ”

స్వీటీ నవ్వింది.

“ఏంటి ?? నీకు చేయదా ??”

“ఏమో నువ్వలా చెప్తే ఏదో చిన్న పిల్లోడు చెప్పినట్లుంది ….. ”

“నువ్వేదైనా అనుకో …… ” అంటూ నేను బాల్కనీ డోర్ వైపుకి వెళ్ళటం స్టార్ట్ చేసాను.

స్వీటీ కూడా నాతో వచ్చేసింది. ఇద్దరం కిందకి వెళ్ళాము.

అపార్ట్మెంట్ లో బాల్కనీ డోర్ తెరిచి అపార్ట్మెంట్ లోపల చైర్స్ వేసుకొని ఇద్దరం చల్లటి గాలిలో బయటకి చూస్తూ ఉండిపోయాము.

చిన్నగా రాత్రయ్యింది.

స్వీటీ డిన్నర్ రెడీ చేస్తుంటే నేను కూడా తనకి హెల్ప్ చేసాను. అలాగే బాగా చిలిపి పనులు కూడా చేసి తనని బాగా టీస్ చేసాను.

స్వీటీ నేను డిన్నర్ కి కూర్చొని రొమాంటిక్ గా కబుర్లు చెప్పుకుంటూ నా కుళ్ళు జోకులకి స్వీటీ నవ్వుతు చాల ఎంజాయ్ చేస్తూ సరదాగా డిన్నర్ చేసాము. మాలో కామం పోయి ఫుల్ రొమాంటిక్ మూడ్ లోకి వొచ్చం. ఇద్దరం డిన్నర్ అయ్యాక బెడ్ రూమ్ లో పడుకొని కబర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం.

డిన్నర్ అయ్యాక ఫ్రిడ్జ్ లో ఉన్న కేక్ తీద్దాం అని వెళ్లాను. ఇందాక స్వీటీ పడుకున్నప్పుడు వచ్చింది కేక్. తను కేక్ గురించి మరచిపోయింది. స్వీటీ రూమ్ లో ఏదో బుక్ చదువుతుంది. నేను ఈ లోగ నెమ్మదిగా కేక్ తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను.

కేక్ మీద “sweetie……..the naughtiest girl………..” అని మెసేజ్ రాయించాను.

రూమ్ లో కి వెళ్లి స్వీటీ చేయి పట్టుకొని …… బయటకు తీసుకొని వెళ్లాను

“సంజు ….. ఎక్కడికి ??” అంది.

కేక్ దగ్గరికి తీసుకొని వెళ్లాను. కేక్ పై ఉన్న మెసేజ్ చదివి నా వైపు చిరు కోపంతో చూసింది.

“ఈ రోజు నా బర్త్డే కాదే …… ”

“అవును……. ”

“ఇంకా నా బర్త్డే కి చాల టైం ఉంది …… ”

“తెలుసు కానీ ….. ఈ రోజు కూడా నీ బర్త్ డే నే …… ”

“అదేంటి ??”

“తిధుల ప్రకారం …… ”

నా వైపు స్వీటీ సిల్లీగా చూసింది.

“నిజంగా ….. అమ్మ ఫోన్ చేసి చెప్పింది …… ”

“ఓ….. ” అని నవ్వుతు అంది.

“మనం నీ బర్త్డే కి హనీ మూన్ లో ఉంటాం…….. సో అప్పుడు చేసుకుందాం ……ఇప్పుడు చేసుకుందాం …… ”

ఇదిగో అని నేను స్వీటీకి చాక్లెట్ బార్ ఇచ్చాను.

స్వీటీ నవ్వుతు “థాంక్స్ ……. ” చెప్పింది.

“థాంక్స్ ఒకటేనా ??” అన్నాను.

“మరేం కావలి ??”

“ఒక తీయటి ముద్దు …… ” అన్నాను.

నవ్వి నా భుజాల పై చేతులు వేసి నా పేదలకు తన పెదాలను కలిపి ఒక తీయటి ముద్దిచ్చింది.

స్వీటీ కోసం కాండిల్ పెట్టి …. కాండిల్ వెలిగించాక… కేక్ కోయించి ….. ఒకరికొకరం తినిపించుకొని ఇద్దరం నవ్వుతు సెల్ఫీ తీసుకున్నాం. అలాగే ఇద్దరం మెమరీ కోసం ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాం.

Updated: January 10, 2023 — 3:14 am

2 Comments

  1. Ah honeymoon episode kuda raasi konchm punyam kattuko mawa…

  2. Your story is very good and very intresting . So please continued next part

Comments are closed.