లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – End 69

“వొద్దు …… ”

“ఎందుకు ” అని నవ్వుతు అడిగింది.

“అలాంటి డిస్కషన్స్ చేస్తే నీకు పిల్లల పిచ్చి పట్టద్దని భయంగా ఉంది ….. ”

“పిల్లల పిచ్చా ??”

“ఎస్ ……. పిల్ల గురించి ఎక్కువ ఆలోచిస్తే పిల్లలు కావలి అనిపిస్తుంది ……. అందుకే ……”

“చిట్టి చిట్టి చేతులు ……క్యూట్ గా నవ్వుతు ……. అల్లరి చేస్తూ….. చిన్న చిన్న అడుగులు వేస్తూ …. చిట్టి చిట్టి మాటలతో ….. భలే ఉంటారు కదా పిల్లలు” అంది.

“చూసావా ?? అప్పుడే పిల్లల గురించి ఆలోచిస్తున్నావు ……. ”

“వావ్ …… నువ్వు చెప్పింది నిజమే …… ”

“ఎందుకో నా మనసు ఒక్కసారిగా అటు వెళ్లిపోయింది ……. ”

“అందుకే నేను ఆ టాపిక్ ఎక్కువ డిస్కస్ చేయాలనుకోవడం లేదు ……. ప్రస్తుతం మనం లవర్స్ లాగ ఆలోచించాలి ….. ఎక్కడెక్కడికి డేట్ కి వెళ్ళాలి ….. వాలెంటైన్స్ డే ఎలా ప్లాన్ చేయాలి …… ”

“యా ….. ” అని నవ్వుతు అంది.

“లేదంటే …… బేబీ ఫీవర్ వచ్చేస్తుంది ……. ”

“బేబీ ఫీవర్ ఆ ??”

“బేబీ ఫీవర్ అంటే బేబీ కి ఫీవర్ రావటం కాదు తెలుసు కదా ??”

స్వీటీ నన్ను కొట్టి “…… బేబీ ఫీవర్ అంటే బేబీ కావలి అనే ఒక తీవ్రమైన కోరిక …… ”

“hmmmm …… సో అర్ధమైంది కదా ??”

“యా…. ”

ఇద్దరం అలాగే సోఫా లో కబుర్లు చెప్పుకుంటూ లంచ్ స్విగి నుంచి ఆర్డర్ చేసాము. ఆర్డర్ వాచ్చేలోగా టీవీ చూస్తూ టైం స్పెండ్ చేసాము.

లంచ్ చేసేసరికి బాగా మాతుగా అనిపించింది.

ఇద్దరం బెడ్ రూమ్ లో కౌగిలించుకొని చిలిపి మాట్లాడు మాట్లాడుకుంటూ నిద్రపోయాము.

ఒకటున్నారా గంట తర్వాత:

నేను బాల్కనీ లో చైర్ వేసుకొని కూర్చొని చల్లటి గాలి ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను. స్వీటీ ఇంకా పడుకునే ఉంది. తను ఎప్పుడు నిద్ర లో నుంచి లేస్తుందా అని ఎదురు చూసాను …..

ఈ లోగ అనుకున్నానో లేదో అప్పుడే ….. స్వీటీ కూడా బాల్కనీ లోకి వచ్చింది.

“హే ….. లేచావా …… చైర్ తెచ్చుకొని కూర్చో …… చల్లటి గాలి వస్తుంది ….. ”

స్వీటీ కూడా చైర్ తెచ్చుకొని పక్కనే కూర్చుంది.

ఇద్దరం చల్లటి ఆకాశాన్ని చూస్తూ అపార్ట్మెంట్ లాన్ లో పిల్లలు ఆడుకోవటం అలాగే కింద అందరిని చూస్తూ ఒకరి చేయి ఒకరం పట్టుకున్నాం.

“భలే ఉంది కదా weather …. ” అన్నాను.

“యా …… చాల చాల బాగుంది …… కాని వర్షం పడేటట్లుంది …… ”

అప్పుడే ఒక ఉరుము ఉరిమింది.

నేను స్వీటీ వైపు చూసాను.

“సంజు….. అలా నా వైపు చూస్తే చంపేస్తాను …… నా వల్ల రాలేదు ఉరుము ….. ”

“ఇందాకటి దాకా హాయిగా ఉంది …… ఇప్పుడే నువ్వు వచ్చావు….. ” అనేలోగా

తన చేత్తో నా పై చేయి వేసి “ఆపు ……. ”

నేను స్వీటీ చేయి తీసి “కం ఆన్ …… టీస్ చేస్తున్నాను ….. ”

స్వీటీ నా వైపు సిల్లీగా చూసింది.

ఇంకో ఉరుము ఉరిమింది.

Updated: January 10, 2023 — 3:14 am

2 Comments

  1. Ah honeymoon episode kuda raasi konchm punyam kattuko mawa…

  2. Your story is very good and very intresting . So please continued next part

Comments are closed.