వ్యాపారవేత్త 815

రంజిత : ఏమైంది అమర్ గత నెల నుండి ఇలానే ఉంటున్నావ్?

అమర్ : ఏం చెప్పాలో కూడా అర్ధం కావట్లేదు, ఎప్పుడు కూడా నేను ఇంత ప్రెషర్ ఫీల్ అవ్వలేదు. కానీ లాస్ట్ మంత్ నుండి మాత్రం ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను. నా సేల్స్ కూడా తగ్గిపోయాయి. ఇందాక అశోక్ సార్ చెప్పారు ఈ మంత్ లో సేల్స్ తగ్గితే ఉద్యోగం పోతుంది అని.

రంజిత అమర్ చేతిని తన చేతిలోకి తీసుకుని,

రంజిత : ఏం కాదు టెన్సన్ పడకు, లాస్ట్ ఇయర్ లో కూడా నువ్వెంటో ప్రూవ్ చేసుకున్నావ్, లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. నీ మీద నాకు నమ్మకం ఉంది.

అమర్ లేచి ఫ్రెష్ అయ్యి వచ్చాడు ఇద్దరూ తిని నిద్రలోకి జారుకున్నారు.

మరునాడు రావ్, అశోక్ గౌడ కి కాల్ చేసి ఏం జరుగుతుందో అడిగాడు. అమర్ అనుకున్నట్టే వర్క్ చేయలేకపోతున్నాడు. ఆల్రెడీ చెప్పాను సరిగ్గా లేకపోతే ఉద్యోగం నుండి తీసేస్తా అని అన్నాడు. రావ్ హ్యాపీ గా ఫీల్ అయ్యాడు అంతా అనుకున్నట్టు జరుగుతుంది అని.

రోజులు గడుస్తున్న కొద్దీ అమర్ ఇంటికి చాలా లేట్ గా వచ్చేవాడు. ఎప్పుడు నీరసం గా అలిసిపోయి కనిపించేవాడు. కనీసం రంజిత తో కూడా మాట్లాడటానికి టైం లేకుండా పోతుంది. తను ఇంటికి తిరిగి వచ్చేసరికి రంజిత నిద్ర పోతుంది కూడా

చూస్తుండగానే రెండో నెల కూడా గడిచిపోయింది. ఆ రోజు సాయంత్రం అశోక్ గౌడ మీటింగ్ పెట్టాడు. సేల్స్ డిపార్ట్మెంట్ అంతా వచ్చింది. అశోక్ అందరిని చూస్తూ

అశోక్ : ఆల్రెడీ మీకు చెప్పాను, మన సేల్స్ సరిగ్గా లేవు అని దాంతో ప్రాఫిట్స్ కూడా తగ్గిపోయాయి. అందువల్ల నేను కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఎవరి మీద కోపం తోనే లేక వేరే ఉద్దేశం తో అయితే ఈ డెసిషన్ తీసుకోలేదు. ఇంతకముందే చెప్పాను సరిగ్గా సేల్స్ లేకపోతే ఉద్యోగానికి నేను గ్యారంటీ ఇవ్వలేను అని. అందుకే సరిగ్గా పెర్ఫార్మన్స్ ఇవ్వని వాళ్ళని ఉద్యోగం నుండి తీసేయాల్సి వస్తుంది.

ఆ మాటతో అందరు ఒకరి మొహాలని మరొకరు చూసుకున్నారు. అశోక్ తీసేస్తున్న పేర్లు చదివాడు. అందులో అమర్ పేరు కూడా ఉంది. తీసేసిన వాళ్ళని HR డిపార్ట్మెంట్ కి వెళ్లి శాలరీ క్లియర్ చేసుకోమని చెప్పాడు.

ఆఫీస్ అయిపోయాక అమర్ అలానే ఆఫీస్ బయట ఉన్న చైర్ లో డల్ గా కూర్చున్నాడు. అంతలో సాజిద్ వచ్చి

సాజిద్ : హే అమర్ ఏంటి ఇంకా ఇంటికి వెళ్ళలేదు.

అమర్ : ఎలా వెళ్ళను. ఏం మొహం పెట్టుకుని వెళ్ళమంటావ్?

సాజిద్ : బాధ పడకు అమర్, నిజం గా బాధ ఉంటుంది కానీ అలానే డల్ అయిపోకూడదు. నువ్వు మళ్ళీ బౌన్స్ అవుతావు, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఈ కంపెనీ కాకపోతే ఇంకొకటి.

అంటూ అమర్ ని ఎదురుగా ఉన్న బార్ కి తీసుకొని వెళ్ళాడు. బాధలో అమర్ ఫుల్ గా తాగాడు. అసలు పైకి లేచే పోసిషన్ లో కూడా లేడు, సాజిద్ టాక్సీ మాట్లాడి అమర్ తో పాటు తన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు. బయట ఉన్న వాచ్మెన్ కి అమర్ ని అప్పగించి పైకి తీసుకుని వెళ్ళమని చెప్పి తాను వెళ్ళిపోయాడు.

డోర్ బెల్ మొగటంతో అమర్ వచ్చాడు అనుకుని తలుపు తీసింది నవ్వుతు రంజిత, కానీ అమర్ ని మోస్తూ వాచ్మెన్ కనిపించాడు. లోపలికి తీసుకొని వచ్చి సోఫాలో కూర్చోపెట్టి వెళ్ళిపోయాడు.

అమర్ మత్తులో ఏదేదో వాగుతున్నాడు. రంజిత తన షూస్ తీసింది. వెంటనే సోఫాలో పక్కకి పడిపోయాడు. రంజిత కూడా అసహనం గా తన బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకుంది కానీ నిద్ర పట్టలేదు.

మరునాడు ముందే నిద్ర లేచింది కాసేపటికి అమర్ కూడా నిద్ర లేచి సోఫాలో ఉండటం చూసి రంజిత ని పిలిచాడు. రంజిత కిచెన్ లో నుండి మజ్జిగ గ్లాస్ తెచ్చి అమర్ కి ఇచ్చింది. అమర్ అది తాగి.

అమర్ : నేను ఇలానే సోఫాలో నిద్ర పోయనా.? అసలు ఇంటికి ఎప్పుడు వచ్చాను?

రంజిత జరిగింది అంతా చెప్పి విసురుగా లోపలికి వెళ్తుంటే అమర్ తన చేతిని గట్టిగా పట్టుకుని ఆపి

అమర్ : నిన్న నా జాబ్ పోయింది రంజు.

ఆ మాటకి రంజిత వెనక్కి తిరిగింది ఆశ్చర్యం గా

అమర్ : నేను అనుకున్నదే జరిగింది. గత రెండు నెలలుగా నా సేల్స్ పడిపోయాయి. అందుకే జాబ్ పోయింది. అలా బాధ పడుతుంటే సాజిద్ వచ్చి బార్ కి తీసుకుని వెళ్ళాడు. బాధలో ఎక్కువ తాగేసాను. ప్లీజ్ నన్ను క్షమించు రంజిత.

రంజిత ముందుకి వచ్చి అమర్ మొహాన్ని చేతుల్లోకి తీసుకొని

రంజిత : అమర్ బాధ పడకు, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. మనం త్వరలోనే వీటి నుండి బయట పడతాం. సరే నా

అని చెప్పి తను ఆఫీస్ కి వెళ్ళిపోయింది.

1 Comment

  1. Enduku Ilanti Panikimalina Kathalu Rastaru

Comments are closed.