వ్యాపారవేత్త 815

10 రోజులు గడిచాయి. అమర్ పేపర్ లో యాడ్స్ చూస్తూ వచ్చిన ప్రతి ఇంటర్వ్యూ కి వెళ్ళాడు కానీ సెలెక్ట్ అవ్వలేకపోయాడు. ఇటు రంజిత కి వచ్చే జీతం తో ఇల్లు గడవదు అని భయం పట్టుకుంది. ఒకరోజు కిరణ్ కి కాల్ చేసి ఇంటికి రమ్మంది. అమర్, రంజిత, కిరణ్ ముగ్గురు కూర్చున్నారు.

రంజిత : అన్న అమర్ గురించి ఇంకొకసారి అశోక్ గారితో మాట్లాడొచ్చుగా

కిరణ్ : కష్టం రంజిత, నా ఉద్యోగం కూడా ఉంటుందో పోతుందో తెలియట్లేదు.

రంజిత : అయ్యో, అసలు ఎం అర్ధం కావట్లేదు అన్న, నా జీతం తో ఇల్లు గడవాలి అంటే కష్టం గా ఉంది.

కిరణ్ : రంజిత ఈ ప్రాబ్లెమ్ నుండి మనల్ని ఒకళ్ళు బయట పడేయగలరు

రంజిత, అమర్ ఇద్దరూ కిరణ్ మొహం చూసారు.

రంజిత : ఎవరు అన్న

కిరణ్ : Mr రావ్, అతను అశోక్ కన్నా పెద్ద బిజినెస్ మాన్, అతను తప్పకుండా హెల్ప్ చేస్తాడు. అమర్ నీకు పరిచయమేగా అతను. రంజిత నువ్వు కూడా రెండు మూడు సార్లు కలిసావ్ గా ఇద్దరు కలిసి అడగండి.

రంజిత : హ అన్న మొన్న పెళ్ళిలో తన విసిటింగ్ కార్డు ఇచ్చారు.

కిరణ్ : గుడ్ ఒకసారి కాల్ చేసి అప్పోయింట్మెంట్ అడగండి.

అని చెప్పి తను బయటకు వచ్చి రావ్ కి కాల్ చేసి జరిగింది చెప్పాడు.

కిరణ్ వెళ్లిన తరువాత రంజిత, అమర్ ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు ఎలా రావ్ తో మాట్లాడాలా అని. అమర్ కూడా ఇంతకుమించి మంచి ఐడియా లేదు అని గట్టిగా చెప్పాడు. ఇంక రంజిత తన హ్యాండ్ బ్యాగ్, డ్రెస్సింగ్ టేబుల్ అంతా వెతికింది Mr రావ్ నెంబర్ కోసం.

వెతకగా చివరికి డ్రెస్సింగ్ డ్రాయర్ లో దొరికింది. కార్డు మీద Mr సుబ్బారావ్, మేనేజింగ్ డైరెక్టర్, రావ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అతని ఫోన్ నెంబర్ ఉన్నాయి.

రంజిత కి మాట్లాడాలి అంటే కొంచెం మొహమాటం గా ఉంది కానీ అమర్ బలవంతం చేయటం తో బెరుకుగానే కాల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయలేదు. కాసేపాగి మళ్ళీ ట్రై చేసింది. మూడు రింగుల తరువాత ఫోన్ లిఫ్ట్ చేసాడు.

రావ్ : హలో!

రంజిత : కొంచెం రావ్ సార్ తో మాట్లాడాలి.

రావ్ : నేను రావ్ నే మాట్లాడుతున్నా మీరు ఎవరు?

రంజిత : హాయ్ సార్ నేను రంజిత ని గుర్తు ఉన్నానా?

రావ్ : హెల్లో రంజిత, ఎలా ఉన్నావ్..? చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావ్ గా.

రంజిత : అవును సార్ చాలా రోజులైంది మాట్లాడి. ఎలా ఉన్నారు?

రావ్ : బాగున్నాను రంజిత, అమర్ ఎలా ఉన్నాడు?

రంజిత : సార్ అదే…. ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు.

రావ్ : ఏమైంది రంజిత, ఎందుకు మొహమాటం. ఏంటో చెప్పు.

రంజిత : మీరు నన్ను సెల్ఫిష్ అనుకోవద్దు సార్ అవసరం ఉంటేనే కాల్ చేసావా అని.

రావ్ : అయ్యో అదేం లేదు రంజిత. మన అనుకున్న వాళ్లే కదా కష్టాల్లో గుర్తు వస్తారు. మెహమాట పడకుండా ఏంటో చెప్పు.

రంజిత : సార్ విషయం ఏంటి అంటే అమర్ తన జాబ్ పోగొట్టుకున్నాడు. ఇంట్లో చాలా ఇబ్బంది గా ఉంటుంది.

రావ్ : డబ్బులు ఎమన్నా కావాలా?

రంజిత : లేదు లేదు సార్, అమర్ కి కొంచెం జాబ్ చూస్తారేమో మీ కంపెనీ లో అని అడగటానికి కాల్ చేసాను.

రావ్ : సరే ఒక పని చేయండి. నువ్వు అమర్ ఇద్దరూ ఈ ఆదివారం మా ఇంటికి రండి లంచ్ కి, అక్కడ మాట్లాడుకుందాం. వెచ్చేటప్పుడు అమర్ ని తన CV తెచ్చుకోమని చెప్పు. నేను నా అడ్రెస్ ని టెక్స్ట్ చేస్తాను.

రంజిత : ఓకే సార్.

ఫోన్ కన్వెర్సేషన్ ముగిసింది.

చూస్తుండగానే ఆదివారం వచ్చింది. రంజిత అమర్ ఇద్దరూ 12:30 కల్లా రావ్ మాన్షన్ చేరుకున్నారు. సెక్యూరిటీ గార్డ్ వాళ్ళని లోపలికి పంపించాడు. ఇద్దరూ మాన్షన్ ని ఆశ్చర్యం గా చూస్తూ లోపలికి వెళ్లారు. డజన్ కి పైగా రకరకాల కార్స్ పార్క్ చేసి ఉన్నాయి. గార్డెన్ చాలా అందం గా ఉంది.

లోపల రావ్ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, వీళ్ళు రావటం తో ఒక సెర్వెంట్ ని పంపి ముందు ఇల్లంతా చూపించమన్నాడు. అతను వెళ్లి అమర్ వాళ్ళని పలకరించి సార్ కాసేపట్లో వస్తారు అని చెప్పి వాళ్ళకి ఇల్లంతా చూపించటం మొదలుపెట్టాడు. అప్పుడే ఇద్దరూ షార్ట్ మీద బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న రావ్ ని చూసారు. రంజిత ఈ వయసులో కూడా అతని బాడీ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఆశ్చర్యపోయింది.

1 Comment

  1. Enduku Ilanti Panikimalina Kathalu Rastaru

Comments are closed.