వ్యాపారవేత్త 815

రావ్ : పర్లేదు రంజిత, కంగ్రాట్స్. వెల్కమ్ టు ది రావ్ గ్రూప్స్. ఇక నుండి సార్ అక్కర్లేదు జస్ట్ రావ్ అని పిలువు చాలు.

రంజిత నవ్వి మరోసారి థాంక్స్ చెప్పి ఇంటికి బయలుదేరింది. వెళ్లేదారిలో స్వీట్స్ తీసుకుని వెళ్ళింది. అమర్ కూడా చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు.

రోజులు గడుస్తున్నాయి. రంజిత చాలా త్వరగా వర్క్ నేర్చుకుంటుంది. ఇటు అమర్ కి కూడా రెండు మూడు కంపెనీస్ లో జాబ్ మాట్లాడాడు రావ్ కానీ ఇంటర్వ్యూ లోనే వెనక్కి తిరిగి వచ్చాడు.

ఒకరోజు రావ్, సాజిద్ కి కాల్ చేసి.

రావ్ : సాజిద్ నెక్స్ట్ ప్లాన్ స్టార్ట్ చెయ్ టైమ్ వచ్చింది.

సాజిద్ : సరే సార్.

రంజిత నార్మల్ గానే ఆఫీస్ కి వచ్చింది. ఇంట్లో అమర్ కాళీ గా కూర్చుని ఉన్నాడు. ఇంతలో తన ఫోన్ మోగింది. స్క్రీన్ మీద సాజిద్ పేరు కనపడింది.

అమర్ : హలో సాజిద్, ఎలా ఉన్నావ్?

సాజిద్ : బాగున్నా అమర్ నువ్వెలా ఉన్నావ్?

అమర్ : ఇప్పటికి గుర్తు వచ్చానా?

సాజిద్ : అదేం లేదు అమర్, తెలుసుగా వర్క్ బిజీ, ఇప్పుడు కాళీ దొరికింది అందుకని చేశాను. ఇంతకీ నీ జాబ్ ఏమైంది.

అమర్ : ఇంకా ఎం దొరకలేదు సాజిద్ ట్రై చేస్తున్నా.

సాజిద్ : హో వస్తుంది లే కానీ ఇంట్లో ఉంటే మనసు మారుతూ ఉంటుంది మీ అపార్ట్మెంట్ కింద ఉన్నాను రా అలా బయటకు వెళ్దాం కాస్త నువ్వు కూడా ఫ్రీ అవుతావు.

అమర్ కూడా సరే అని బయటకు వచ్చాడు. సాజిద్ కార్ లో ఉన్నాడు. అమర్ కూడా కార్ ఎక్కాడు, సాజిద్ కార్ స్టార్ట్ చేసి బార్ ముందు ఆపాడు. ఇద్దరూ లోపలికి వెళ్లి తాగుతూ మాట్లాడుకోసాగారు.

అమర్ మాటల్లో తన భార్య రావ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో జాబ్ చేస్తుంది, నేనే ఎం చేయలేకపోతున్నాను. ఇంట్లో ఫైనాన్సియల్ గా ఇబ్బంది ఉంది అని చెప్పాడు.

సాజిద్ : అమర్ నీకు పేకాట వచ్చా.. నాకు రాదు కానీ నాకు తెలిసిన చోట ఆడితే నువ్వు ఊహించని డబ్బు వస్తుంది కొంచెం నీకు కూడా హెల్ప్ అవుతుంది గా ఇంట్లో

అమర్ : అమ్మో మళ్ళీ ఎమన్నా రిస్క్ ఏమో

సాజిద్ : అదేం ఉండదు అమర్, ఆ ప్లేస్ నాకు ఎప్పటినుండో తెలుసు.

అంటూ అమర్ ని ఒప్పించాడు. ఇద్దరు కార్ లో ఆ ప్లేస్ కి వెళ్లారు. బయట నుండి చూడటానికి అదోలా ఉంది కానీ లోపల మాత్రం ఇంటీరియర్ చాలా బాగుంది. చాలా టేబుల్స్ ఉన్నాయి, చాలా మంది కూర్చుని ఆడుతున్నారు.

అమర్ కి సాజిద్ కొంత డబ్బు ఇచ్చాడు. అమర్ ఆ డబ్బుతో ఆట మొదలుపెట్టి అన్ని రౌండ్స్ గెలిచాడు. దాంతో చాలా డబ్బు వచ్చింది. సాజిద్ కి అతను ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేసాడు. ఇంక చాలు అనిపించి సంపాదించిన డబ్బు తో ఇద్దరు బయటకు వచ్చారు. సాజిద్ అమర్ ని తన అపార్ట్మెంట్ దగ్గర దించి వెళ్ళిపోయాడు

అప్పటికే రంజిత ఇంట్లో ఉంది. ఫ్రెష్ అయ్యి కూర్చుంది. డోర్ బెల్ మొగగానే డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా అమర్ నవ్వుతూ నిలబడి ఉన్నాడు. కానీ అతని దగ్గర నుండి మందు వాసన వస్తుంది. అమర్ లోపలికి వచ్చి తన జేబులో నుండి రెండు డబ్బు కట్టలు తీసాడు.

రంజిత : ఏంటి అమర్ ఇది?

అమర్ : డబ్బు

రంజిత : అది అర్ధం అవుతుంది కానీ ఇంత డబ్బు నీకు ఎక్కడిది.

అమర్ : నేనే సంపాదించాను. మా ఫ్రెండ్ నన్ను పేకాట క్లబ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అక్కడే మొత్తం గెలిచాను

రంజిత : ఏంటి గాంబ్లీంగ్ చేస్తున్నావా? అసలు ఎవరు ఆ ఫ్రెండ్?

అమర్ : సాజిద్ అని మా పాత కోలిగ్.

రంజిత : ఓహో అతనా ఆ రోజు నిన్ను పీకల దాక తాగించి వాచ్మాన్ కి అప్పగించి వెళ్ళాడు. అలాంటి వాళ్ళకి దూరం గా ఉండు అమర్.

1 Comment

  1. Enduku Ilanti Panikimalina Kathalu Rastaru

Comments are closed.