నేను వదల్లేదు – Part 2 112

నేను ఇంటికి వెళ్ళేసరికి కొంపలో అందరూ మెలకువగా ఉన్నారు.
ఎప్పుడూ నేను వెళ్ళే సరికి ఇల్లు ఏంటి ఊరు ఊరు మొత్తం నిద్రపోతుంది.
కానీ మా ప్రిన్సిపాల్ చేసిన పని వల్ల అందరూ నన్ను చూసి కొంచెం జాగ్రత్తలు చెప్పి తలా కొంచెం అనురాగం, ఆప్యాయతలు కార్చేసి పడుకున్నారు.
కొన్ని రోజులకి మనం మళ్ళీ మామూలే.

ఆ గొడవ తర్వాత నేను కాలేజీ లో హీరో అయిపోయాను.
మా లెక్చరర్స్, ప్రిన్సిపాల్ అందరూ నన్ను కొంచెం భయంగా చూడటం మొదలు పెట్టారు.
మాములుగా అయితే లెక్చరర్స్ స్టూడెంట్స్ ని తొక్కేయడం ఆనవాయితీ కానీ ఫర్ ఏ చేంజ్ ఆ స్టూడెంట్స్ వెనక కూడా ఒక హీరో ఉంటే..
ఆ హీరో నేనే.
యెస్ నరేష్ అంటే ఆ రోజు నుండి హీరో..
ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా ముందు నా దగ్గరికి వచ్చేవారు.
కానీ అదే నాకు వరం, శాపం రెండూ అని ఆ తర్వాత కానీ తెలియలేదు.
ఒక రోజు కెమిస్ట్రీ యూనిట్ టెస్ట్ జరిగింది.
నాకు చిన్నప్పటి నుంచి విన్నది రాయడమే కానీ చదవడం, గుర్తు పెట్టుకోవడం పరమ చిరాకు.
ఆ టెస్ట్ లో కూడా అలాగే రాసాను.
25 కి 6 మార్కులు మాత్రమే వచ్చాయి.
డైరెక్ట్ గా కెమిస్ట్రీ సార్ సాంబా దగ్గరికి వెళ్ళిపోయాను.
ఏంటిది అని అడిగాను.
నువ్వు మెటీరియల్ లో ఉన్నట్టు రాయలేదు అందుకే ఆ మార్కులు అన్నాడు.
నేను ఇంటర్మీడియట్ బోర్డు ఈ మెటీరియల్ ఫాలో అవ్వదు కదా అన్నాను కోపంగా.
నాకు అదంతా తెలియదు, నువ్వు మెటీరియల్ లో ఉన్నట్టు రాసావా? అని అడిగాడు.
సరే చూసుకుందాం అని పేపర్ అక్కడ విసిరి కొట్టి వెళ్ళి నా కుర్చీలో కూర్చున్నాను.
అక్కడి నుండే నా కళ్లతో వార్నింగ్ పంపించాను.
అంతే అదిరిపోయిన సాంబా నా దగ్గరికి వచ్చి నువ్వు రాసింది తప్పు అయితే ఏంటి నీకు మార్కులు కావాలి అంతేగా అని 6ని కాస్త 25 చేసేసాడు.
కానీ మా కాలేజీ లో మెరిట్ అనేది లెక్కలు బట్టి ఉంటుంది.
అందుకే నేను j4 నుంచి j2 కి వెళ్ళిపోయాను.
అది నా కలల లోకం.
నా కలల రాణి జ్యోత్స్న ఉండే స్వర్గం.
గబగబా బ్యాగ్ సర్దుకుని స్నేహితులని మర్చిపోయి ఆ గదిలో అడుగు పెట్టిన నాకు అది నరకం అని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
ఎందుకంటే జ్యోత్స్న అక్కడ లేదు.
తను j3 కి షఫుల్ అయ్యింది.
ఇటు ఫ్రెండ్స్ లేరు, అటు లవర్ లేదు.
“నా కలల సౌధం కూలి పోయింది.
ఈ దరిద్రుడి ఆశా జ్యోతి ఆరిపోయింది.”
సరే విధిని ఎవరు తప్పించగలరు?