నేను వదల్లేదు – Part 2 101

కానీ పంట పొలానికి తొలకరి చినుకులా అక్కడ నా కోసం సిరి ఉంది.
తనని కళ్లతోనే నీరసంగా పలకరించి క్లాస్ మీద దృష్టి పెట్టాను.
క్లాస్ జరుగుతుంది కానీ నా మెదడులో ఏవో ఆలోచనలు..
అణువులంత అస్పష్టంగా ఉన్నాయి.
ఒక శక్తివంతమైన కాంతిపుంజం అంత తీవ్రంగా ఉన్నాయి.
ఆ రోజుకి కాలేజీ ఏదో గడిచింది.
నాకు సిరికి మధ్యలో స్నేహం బాగా కుదిరింది.
పొద్దున్నే నా తర్వాత కాలేజీకి వచ్చే బస్ వాళ్ళది.
తను బస్ దిగి వెంటనే నా దగ్గరికి వచ్చేసేది.
తనతో మాట్లాడితే నాకు ఏదో తెలియని ఆనందం.
అవి స్పైసీగా ఉండేవి కాదు, సెక్సీగా ఉండేవి కాదు.
కానీ తనని చూడటమే ఒక ఆనందం.
అది నాకు రోజూ పావుగంట దొరికేది.
నాకు తనకి మధ్య స్నేహం ఎంతో మంది అమ్మాయిలకి అసూయ పుట్టించేది.
తనలాంటి తోడు వాళ్లకి కూడా కావాలనిపించేది.
మేము ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం.
మా కాలేజీకి ఆ రోజు సెలవు.
అందరికీ2వ శనివారం సెలవు అయితే మాకు మాత్రం 2 ఆదివారాలకి ఒక సారి ఇచ్చేవాడు.
ఆ రోజు గ్రౌండ్ మొత్తం మాదే.
ఆ సెలవు రోజు మాత్రం మాకు ప్రత్యేకం.
ఎందుకంటే j2, j1 మధ్య ఎవరు గొప్ప అని తేల్చుకోవాలి.
ఇద్దరం గ్రౌండ్ లో దిగాము.
మా టీం లో ప్రవీణ్ అని ఒక మంచి బౌలర్ ఉండేవాడు.
నేను బౌలింగ్ వేస్తాను, బ్యాటింగ్ కూడా ఆడతాను కానీ యార్కర్ కి బౌల్డ్ అయిపోవడం నా బలహీనత

టాస్ గెలిచి వాళ్లు బ్యాటింగ్ తీసుకున్నారు.
మొదట వాళ్లు 10 ఓవర్లలో 59 పరుగులు చేసారు.
తర్వాత నేను ఇంకొకడు కలిసి ఓపెనింగ్ దిగాము.
ఈ మ్యాచ్ లో మాత్రం బౌల్డ్ అవ్వకుండా ఉండాలని అనుకున్నాను.
మొదటి ఓవర్ మణి కృష్ణ.
వీడు జ్యోత్స్న వాళ్ళ బావ.
3 బంతులకు 6.4.6 దంచడంవల్ల వాడు మళ్ళీ బౌలింగ్ కి రాలేదు.
తిలక్ పవన్ బౌలింగ్ కి వచ్చాడు.
అవుట్ స్వింగ్ యార్కర్స్ వెయ్యడంలో దిట్ట.
వీడి బౌలింగ్ జాగ్రత్తగా ఆడాలి అనుకుంటూనే వాడికి సిక్సర్ ఇంకా ఫోర్ రుచి చూపించాను.
అలా సింగిల్స్ డబుల్స్ తో స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాను.
ఇంకొక పక్క వికెట్స్ వచ్చి వెళ్ళిపోతున్నాయి.
ఓవర్ లో 5 పరుగులు చెయ్యాలి.
కమల్ బౌలింగ్ చేస్తున్నాడు.
మొదటి బంతికి రెండు పరుగులు తీశాను. రెండవ బంతి బౌలర్ నెత్తి మీద నుంచి లేపాను.
కానీ అక్కడే ఉన్న ఫీల్డర్ క్యాచ్ అందుకోవడం వల్ల అవుట్ అయిపోయాను.
అయితేనేం అప్పటికే నేను 51 పరుగులు పూర్తి చేశాను.
చివరికి మ్యాచ్ డ్రా గా ముగిసింది.
ఆ మ్యాచ్ తో కాలేజీలో నేను పతాక స్థాయికి చేరుకున్నాను.
ఇంక అందరి నోటా నా గురించే.