నేను వదల్లేదు – Part 2 114

నాతో చాలా స్నేహంగా ఉండేవాడు. క్లాస్ లో మంచి మంచి జోకులు వేసి బాగా నవ్వించేవాడు. వాడిని ఎదవని చెయ్యడం మా వాళ్ళ వల్ల అయ్యేది కాదు.
ఎప్పుడూ 8కి క్లాస్ అయిపోతే అలా స్టేషన్ చుట్టుపక్కల తిరిగే వాడిని ట్రైన్ వచ్చే వరకు. నా చేతిలో డబ్బులు ఉండేవి కాదు.
నెలకి ఒకసారి పాస్ కొనుక్కోమని 100 రూపాయలు ఇచ్చేవారు.
కొన్ని నెలలు పాస్ తీసుకున్న తర్వాత నెలకి మిగిలే 15రూపాయలు ఖర్చుకు ఏ మాత్రం సరిపోయేవి కాదు.
తర్వాత పాస్ తీసుకోవడం మానేసాను.
నెలకి 100 రూపాయలు, ఈ 100 రూపాయలు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడిని. మధ్యాహ్నం మెస్ భోజనం మరి రాత్రి భోజనం హోటల్ లో నెలకి 700 పెట్టి తినేవాడిని.
ఈ సురేంద్ర దగ్గరకి భోజనం అయిపోయాక వచ్చే వాడిని. 9.50 వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని.
వాళ్ళ అమ్మగారు నన్ను కూడా సొంత బిడ్డలా చూసుకునేవారు.
ఇంక అక్కడికి వచ్చాక నాకు నెల నెలా 700 కలిసి వచ్చేవి.
ఇంక నేను క్లాస్ లో మెరిట్ అవ్వడం వల్ల వాళ్ళ ఇంట్లో ఒక రేంజ్ వుండేది నాకు.
మేము మాత్రం నిజాయితీగా అమ్మాయిల కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేవాళ్ళం.
ఒక రోజు వాడికి నా ఫ్రెండ్ సిరి వల్ల వాళ్ళ ఫ్రెండ్ భార్గవి కలిసింది.
ఇంక రాత్రి కాలేజీ అవ్వగానే నేను సిరి, వాడు భార్గవి మెసేజ్ లతో చచ్చిపోయే వాళ్ళం.
మా ఫ్రెండ్షిప్ బాగా బలంగా తయారయ్యింది.
కొన్ని రోజులు అలా దొర్లి అవతలకి దెంగేసాయి.
ఆ రోజు నా బతుకులో మరిచిపోలేని రోజు..
రక్షాబంధన్ ఆ రోజు, నేను ఆ రోజు ఎగదొబ్బుదాం అనుకునే కాలేజీ కి వచ్చేసాను.
S1 కి మారిపోయి చాలా కాలం అయ్యింది. కానీ ఏ మూలనో తేడా కొడుతుంది.
సాయంత్రం నాలుగు అయ్యింది.
హమ్మయ్య కట్టలేదు ఉఫ్ అనుకుని సాయంత్రం చల్లని గాలిని గుండెల నిండా పీల్చుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నా.
కానీ నా ధైర్యాన్ని భయపెడుతూ,
నా ఆనందాన్ని భాదపెడుతూ,
నా నమ్మకాన్ని వమ్ము చేస్తూ,
నా మనశ్శాంతి ని భగ్నం చేస్తూ….
క్లాస్ లో అడుగు పెట్టింది జ్యోత్స్న …
తన చేతిలో రాఖీ..
చూస్తుంటే నాకు అంతా అయోమయంగా ఉంది.
అది రాఖీలా కాదు… జైలులో ఉరితాడులా, యముడి చేతిలో పాశంలా ఉంది.
భయం భయంగా నా దగ్గరికి సమీపించి రెండు అడుగుల దూరంలో నిలబడింది.
నాకు తన కళ్ళలోకి చూసే ధైర్యం లేదు.
తనే వణుకుతున్న గొంతుతో నరేష్ అంది.
తప్పక తల ఎత్తాను.
సైలెంట్ గా రాఖీ నా చేతిలో పెట్టింది.
తను తల దించుకునే ఉంది.
ఫట్ మన్న శబ్ధం విని తల ఎత్తి చూసిన తనకి కిటికీ ఊచల మధ్యలో తెగి ఇరుక్కున్న నా పిడికిలి కనిపించింది.
నాలో చెలరేగిన కోపం కట్టలు తెంచుకుని ఆవేశాన్ని అణుచుకోవడానికి కిటికీని బలంగా గుద్దాను.
దాని వల్ల నా చూపుడు వేలు, మధ్య వేలు విడిపోయి ఊచ మధ్యలో ఉంది.
కానీ నా ప్రేమ ఓడిపోయింది అన్న భాద ముందు ఈ భాద అసలు తెలియడంలేదు.
మామూలు మనిషి అవ్వాలి అనుకున్నా నా వల్ల కావడం లేదు.
ఇన్ని రోజుల్లో ఒక్క సారి కూడా జ్యోత్స్న వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు.
కానీ నా భాద నన్ను వదలడం లేదు.
ఆ సమయం లో వాతలకి వెన్నపూసలా వచ్చింది సిరి.
నిజంగా సిరి అని పెరు పెట్టినందుకు వాళ్ళ ఇంట్లో ఎంత సిరిసంపద వచ్చిందో తెలియదు కానీ నాకు మాత్రం సంతోషం అనే సిరిని రోజూ అందించేది.
మళ్ళీ నేను మాములుగా అయ్యాను.
ఒక రోజు క్లాస్ లో ఉన్నాను.
క్లాస్ వింటూ అనుకోకుండా కిటికీ లోంచి బయటకి చూశాను.