నేను వదల్లేదు – Part 2 112

బావా దీపు గాడిని ప్రగతి కాలేజీ వాళ్ళు కొట్టారు అని.
అంతే అక్కడి నుండి చెయ్యి కడుక్కుని సైకిల్ మీద వాళ్లతో దీపు గాడి ఇంటికి బయల్దేరాను.
అప్పటికే అక్కడ మా వాళ్లు 20 మంది ఉన్నారు.
వాడికి మొహం మీద దెబ్బలు ఉన్నాయి.
ఏమయ్యింది రా అని అడిగాను వాడిని.
చిన్న మిస్ అండర్స్టాండింగ్ వల్ల వీడు కాదని చెప్తున్నా వినకుండా వీడిని కొట్టారు.
ఇంక నేనేమీ వినదలచుకోలేదు.
ఇప్పుడు కొడదాం అన్నా ఎవరూ దొరకరు.
రేపు వేసేద్దాం అని ఫిక్స్ అయిపోయాం

వాడిని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెప్పి అందరం వెళ్ళిపోయాం.
తర్వాతి రోజు లంచ్ బ్రేక్ లో అందరూ నా క్లాస్ లోకి వచ్చేసారు.
వినయ్ అనే వ్యక్తి వీడిని కొట్టిన వాళ్ళలో మెయిన్ అని తెలిసింది.
దారి కాసి ఏసెద్దాం అన్నారు మా వాళ్లు.
కానీ నాకు ఎందుకో ఆ మాటలు పెద్ద నచ్చలేదు.
గొడవ ఏదైనా దూసుకుపోవడమే నాకు తెలుసు.
అందుకే ఈ గొడవ గురించి సంబంధించిన ఇంకొక హేమంత్ అనే వాడిని పిలిచాను.
దమ్ముంటే వాళ్ళ కాలేజీ నుంచి ఎంత మంది వస్తారో అందరినీ రేపు ఈ.సేవ దగ్గరికి రమ్మన్నాను.
తర్వాత రోజు సాయంత్రం కాలేజీ వదలగానే నేను చెప్పి ఉంచడం వల్ల బస్ మీద వచ్చే వాళ్లు కాకుండా మిగిలిన బాయ్స్ మొత్తం నాతో పాటు సైకిల్స్ మీద, నడిచి వచ్చేసారు.
చూస్తే వాళ్ళ దాంట్లో 10 మంది కూడా లేరు.
ఈ విషయం తెలిసి మా సీనియర్స్ కూడా మా వెనకాల వచ్చేసారు.
నేను దీపు ని వాడిని ఎవడు కొట్టాడో వాడిని కొట్టమని చెప్పాను.
వాడిని కొడుతున్నాడు దీపు. ఇంతలో వినయ్ గాడు దీపు కాలర్ పట్టుకుని వెనక్కి తోసాడు. ఇంక నాలో సహనం చచ్చిపోయింది.
వెర్రిగా ఒక్క కేక పెట్టి వాళ్ళ మీదకి దూకాను.
అమ్మోరు జాతరకి పూనకం వచ్చినట్టు దొరికిన వాడిని దొరికినట్టు చావగొట్టి చెవులు మూసేస్తున్నాను.
అప్పుడు దొరికాడు నా చేతికి వినయ్.
పిడికిలి బిగించి మొహం మీద గుద్ది పైకి లేపితే చర్మం చిట్లిపోయి రక్తం ధార కట్టేసింది.
మనిషిని మెడ చుట్టూ చెయ్యి బిగించి పట్టుకున్నాను.
ఊపిరి ఆడక గింజుకుంటున్నాడు.
ఈ లోపు నా మీదకి ఇద్దరు దూసుకు వస్తున్నారు.
వినయ్ ని ఒంగోబెట్టి బలంగా తోసాను.
ఎదురుగా ఉన్న గేటు కి తల టప్ మని గుద్దుకుని పక్కన ఉన్న డ్రైన్ లో పడిపోయాడు.
ఎదురుగా వస్తున్న ఇద్దరినీ రెండు చేతులతో బిగించి పట్టుకున్నాను.
ఇంతలో ఇంకొకడు వస్తున్నాడు. ఎడమ చేతిలో ఉన్నవాడిని వదిలి ఒక్క గుద్దుతో రోడ్ కి అంటించేశాను.
కానీ అలా చెయ్యి తిప్పుతున్నప్పుడు నా చెయ్యి నొప్పి పట్టేసింది.
ఈ లోపు మా ఫ్రెండ్స్ అక్కడ అందరినీ ప్రక్షాళన చేసేసారు.
కానీ అక్కడ గొడవ పెద్దది అవ్వడం వల్ల ఎవరో సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి ఫోన్ చేసారు.
జీప్ సైరన్ వినగానే ఎక్కడి వాళ్ళం అక్కడికి జంప్ జిలానీ.
తర్వాత రోజు క్లాస్ కి రాగానే నేను పెద్ద డాన్ అయిపోయాను.
అందరూ నా దగ్గరికి వచ్చి బావా నిన్న చంపేశావ్ రా అని కొంత మంది అంటే , కొంత మంది నిన్ను చూసే సగం మంది పారిపోయారు అంటున్నారు.
నేను ఇవన్నీ కొత్తగా వింటున్నాను.
నిన్నటి వరకు నరేష్ అంటే పాపం చాలా దూరం నుంచి కాలేజీ కి వస్తాడు, లెక్కలు బాగా చేస్తాడు, లెక్చరర్స్ మీద డైలాగ్స్ బాగా వేస్తాడు, బాగా నవ్విస్తాడు అంతే
కానీ ఇప్పుడు మాత్రం నరేష్ అంటే పవర్ హౌస్, 10మందిని అయినా హ్యాండిల్ చెయ్యగల సత్తా ఉన్న వాడు.
ఇంక నిన్న వచ్చిన వాళ్ళ సంగతి ఇలా ఉంటే రాని వాళ్లు విన్న కథలు అయితే ఇంకా అద్భుతం. వాళ్లు అందరూ అయితే నన్ను ఒక అద్భుతం లా చూస్తున్నారు.
ఇంక ప్రగతి కాలేజీ వాళ్లు మొత్తం షేప్ లు మారిపోయి వెళ్లారు కాలేజీ కి.
ఇత్తడి సామానాన్ని చింతపండు పెట్టి తోమినట్టు అందరూ తళతళలాడి పోతున్నారు.
అందరూ హేళన చెయ్యడం వల్ల మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక గుద్దలో పెట్టేసుకున్నారు.
రాత్రి గొడవ మా రెండు కాలేజీలలోనూ హాట్ టాపిక్ అయ్యింది. రెండు కాలేజీల ప్రిన్సిపాల్స్ మాట్లాడుకుని సెటిల్ చేసేసారు సెక్యూరిటీ అధికారి వాళ్లకి.
కాలేజీకి వచ్చి మాకు దెంగులు పెట్టి కొంపలో ఫోన్ చేసి చెప్పేశారు.