జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 15 57

అంకుల్ మరియు వాళ్ళ బంధువు ముందు వెళ్లగా అమ్మ వాళ్ళ బ్యాచ్ అంతా ఏవేవో మాట్లాడుతూ లోపలికి వెళ్లగా , బావ అక్క చేతిలో చెయ్యి వేసుకొని , బావ అక్క మరియు బావ మాట్లాడుతూ అందరూ లోపలికి వెళ్లగా , కుడి చేతితో మహి చెయ్యి అందుకొని ఎడమ చేతితో చిన్నాను పట్టుకోగా చిన్నా పక్కన వర్షిని నడువగా , ఒక అర గంట పాటు కింద పార్క్ అంతా తిరిగి , పిల్లలు టాయ్ ట్రైన్ ఎక్కగా వాళ్ళ సంతోషాన్ని చూస్తూ నవ్వుకుంటూ , అందరూ కేబుల్ కార్ లో పైకి వెళ్లి సముద్రాన్ని మరియు సిటీ అందాలను వీక్షించి సమయమే తెలియకుండా మధ్య మధ్యలో స్నాక్స్ , ఐస్ క్రీమ్స్ మరియు కూల్ డ్రింక్స్ నేను కృష్ణ తెచ్చి అందిస్తూ మధ్యాహ్నం 2 గంటల వరకు సంతోషంగా గడిపగా పిల్లలకు ఆకలివేస్తుందని చెప్పగా , అప్పటివరకు తిండి మీద ధ్యాసే లేక అది విన్న వెంటనే అందరికి ఆకలి అవుతున్నట్లుగా ముఖాలు కనిపిస్తుండటంతో , కిందకు వచ్చి 3 గంటల కల్లా బీచ్ పక్కనే ఉన్న 5 స్టార్ హోటల్ కు కారులో అందరిని పిలుచుకొని వెళ్ళాము.

లోపలికి వెళ్ళి అందరి చేతిలోకి మెనూ కార్డ్ తెప్పించి అందరూ చాలా ఆకలిగా ఉన్నందువల్ల ఎవరికి ఏవి కావాలో మోహమాటపడకుండా తెప్పించండి అని అభయమిస్తూ మహి నా కోసం తన పక్కనే సీట్ ఖాళీగా ఉంచి ఉండటంతో వెళ్లి పక్కన కూర్చొని , టేబుల్ కింద చెయ్యి అందుకొని ప్రేమగా నిమురుతూ , 20 నిమిషాలలో వెజ్ , నాన్ వెజ్ ఐటమ్స్ వస్తుండగా బాగా ఆకలిగా ఉండటం వల్ల ఆ వాసనకే నోరు ఊరిపోతోంది. నిదానంగా అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ మనఃస్ఫూర్తిగా కడుపు నిండా తిని కదలదానికి కూడా ఇష్టపడకపోతుండటంతో Ac లో కూర్చోవచ్చని అందర్నీ పక్కనే ఉన్న సినీ కాంప్లెక్స్ కు పిలుచుకొని వెళ్ళాను.

టికెట్స్ తీసుకుంటుండగా అత్తయ్యకు చిన్నా మరియు వర్షిని స్కూల్ నుండి కాల్ రాగా అత్తయ్య మాట్లాడి ఫంక్షన్ కు వైజాగ్ వచ్చామని చెబుతూ , రేపటి నుండి మిస్ కాకుండా పిల్లలు వచ్చేస్తారని చెప్పి కాల్ కట్ చేసి నాకు విషయం చెప్పగా సరే అత్తయ్య ఉదయమే కారులో వెల్దురుగాని అని చెప్పి హాల్ లోపలికి వెళ్ళి పిల్లల మరియు మహి పక్కన కూర్చోగా , మహి నా చెయ్యి చుట్టూ తన రెండు చేతులను వేసి హత్తుకొని తలను నా భుజం పై వాల్చగా తలపై ప్రేమగా ముద్దు పెట్టి మూవీ చూడసాగాము.

రాత్రి 9 గంటలకు మూవీ అయిపోవడంతో బయట హోటల్ లో లైట్ గా భోజనం చేసి బయటకు రాగా వదిలి వెళ్తున్నామన్న బాధతో అక్కయ్య బావ విడిపోగా , అందర్నీ కృష్ణ ఇంటి దగ్గర వదిలి , ఉదయం ఎలా వచ్చామో అలా రెండు వాహనాలలో వస్తూ అత్తయ్య వాళ్ళు ఉదయమే 7 గంటలకు ఊరికి వెళ్ళడానికి ట్రావెల్స్ లో కారును బుక్ చేసి అడ్రస్ చెప్పి అక్కడ పిక్ చేసుకొమ్మని చెప్పి సగం డబ్బు ఇచ్చి , 10 గంటలకల్లా ఇంటికి చేరుకోగా పిల్లలిద్దరూ వాహనం లోనే నిద్రపోవడంతో వర్శినిని నేను ఎత్తుకోగా , చిన్నాను మహి ఎత్తుకొని బెడ్ రూమ్ లో పడుకోబెట్టి , ఇద్దరికి దుప్పటి కప్పి AC on చేసి , పిల్లలిద్దరి నుదుటిపై ముద్దు పెట్టి తలుపు ముందరికి వేసి , పైకి వెళ్లి బాల్కనీ లో మడత మంచం వేసుకొని దానిపై మెత్తటి బెడ్ వేసి వాలిపోయి సముద్రపు ఆలయాలను చూస్తూ ఉండగా 10 నిమిషాల తరువాత మహి తాగడానికి మంచి నీళ్లతో రాగా తాగి దిండు పై వాలిపోగా , నా గుండెలపై మహి వాలిపోయి ఛాతిపై సున్నాల చుడుతూ ఉండగా , ఒక చేతిని తన చుట్టూ వేసి తలపై ముద్దులు పెడుతూ ప్రేమగా మాట్లాడుతూ అలసట వల్ల మెల్లగా నిద్రలోకి జారుకున్నాము.

1 Comment

  1. E story rasinollaki konchem kuda Budhi ledhanukunta

Comments are closed.