జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 15 54

అంటీ , అంకుల్ నా వైపు ఆరాధనగా చూస్తుండగా అందరూ అలసిపోయారు వెళ్లి పడుకోండి అని చెప్పి , అమ్మను , అత్తయ్యను ,మహిని మరియు పిల్లలను కారులో ఇంటికి పిలుచుకొని వెల్తూ కారు లోపల లైట్ వేసి అద్దం లో వెనుక ఉన్న మహినే తరచి తరచి చూస్తుండగా మహి అందంగా నవ్వుకోసాగింది, బెడ్ పై పిల్లలను పడుకోబెట్టగా , చిన్నా మామయ్య నా పక్కనే పడుకోమని అడుగగా , బుగ్గపై ముద్దు పెట్టి చిన్నా పక్కన పడుకోగా , అమ్మ , అత్తయ్య మరియు మహి హాల్ లో పడుకొనసాగారు.

చిన్నా ఛాతిపై సున్నితంగా తడుతుండగా కొద్దిసేపట్లో ఘాడంగా నిద్రపోగా , చిన్నా పక్కన బెడ్ చివరన వర్షిని కూడా నిద్రపోతుండగా , నిద్రపోవడానికి కళ్ళు ముసుకోగా చక్కగా చీర కట్టుకున్న మహి అందంగా కనిపిస్తూ నవ్వుతూ మెత్తటి పూలపై నడుచుకుంటూ వస్తున్నట్లుగా కనిపించగా కళ్ళు తెరిచి చూడగా , అంతా చీకటి కనిపించగా , పక్కకు తిరిగి కళ్ళుమూసుకోగా మళ్ళీ మళ్ళీ మహి నే అప్సరసలా కనిపిస్తుండగా , నిద్రపట్టక నీళ్లు తాగి వద్దామని లేచి వంటింట్లోకి వెళ్లి ఫ్రిడ్జ్ లో ఉన్న బాటిల్ అందుకొని చల్లటి నీటిని తాగుతూ కిటికీ లో నుండి బయటకు చూడగా సెక్యురిటి ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతుండగా , కిటికీ దగ్గరికి వెళ్లి చూడగా అదే పాప ఇంటికి వెల్తూ పాటపాడుతూ వెల్తూ సెక్యూరిటీతో మాట్లాడి వెళ్ళిపోయింది.

టైం చూడగా రోజు దాటేయడంతో ఆ పాపకు చాలా ధైర్యం ఉందని అనుకోని, నీళ్లు తాగుతూ హాల్ లోకి రాగా అత్తయ్య , అమ్మ మరియు చివరన మహి ప్రశాంతంగా , హాయిగా నిద్రపోతుండగా , చీకటిలో అవతిలి వైపుకు చప్పుడు చెయ్యకుండా వెళ్లి మహి పక్కనే ఉన్న సోఫా లో కూర్చొని చీకటిలో తెల్లని అందమైన మహి ముఖాన్ని పెదవులపై చిరునవ్వుతో ప్రేమగా చూస్తూనే ఉండిపోయాను.

కొద్దిసేపటి తరువాత చలిగా ఉన్నా కూడా మహి తన రగ్గును తన నడుము వరకు కిందకు జరిపి నా నుండి అటువైపుకు తిరగగా , మహి అదే చీర కట్టుకొని పడుకొని ఉందన్న భావనే నా హృదయానికి గట్టిగా ప్రేమ దెబ్బ తగిలినట్లుగా తియ్యటి స్ట్రోక్ రావడంతో , అద్భుతమైన ప్రేమ ఫీల్ తో నా అర చేతిని గుండెలపై పెట్టుకొని పరవశించిపోతూ , మహి వాలు జడ మొదలు నుండి వెనుక వైపు వయ్యారాన్ని చూస్తూ కిందకు రాగా ,జడ పక్కనే జాకెట్ పైన కనబడుతున్న ఆ కొద్ది వీపు భాగం చూస్తుంటే ఆ 18 ఏళ్ల యవ్వన సంపద కోసం ఏమైనా చెయ్యొచ్చు అని కళ్ళు ఆ భాగాన్నే చూస్తూ ఉండిపోయాయి.

1 Comment

  1. E story rasinollaki konchem kuda Budhi ledhanukunta

Comments are closed.