జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 15 57

“నా ఇష్టం కాదు నీకు వెళ్లాలని ఉందా” అని అడుగుతూ తన వీపుపై ప్రేమగా నిమురుతూ , తలపై పెదాలు ఆనిచ్చి అడుగగా , “నాకు ఇష్టం బావ వెళదాము” అని చెబుతూ సిగ్గుపడుతూ నా ఛాతీలో తన తల దాచుకొని నా కౌగిలిలో అలాగే ఉండిపోయింది. కొద్దిసేపటి తరువాత మహికి పాలు గుర్తుకురాగా “బావ పాలు” అని నన్ను ఒక చేతితో కౌగిలించుకొని మరొక చేతితో పాలు అందుకొని కొన్ని తాగుతూ “బావ చల్లారిపోయాయి వేరేవి తెస్తాను” అని నా నుండి వెళుతుండగా తనను అలాగే కౌగిలించుకొని తన చేతిపై నా చెయ్యి వేసి నా నోటి దగ్గరకు తీసుకు వచ్చి మహి పెదాలు తాకిన చోట నా పెదాలను తాకిస్తూ తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ మొత్తం పాలను తాగేసి “ఇంత మధురమైన కాలిపోతున్న పాలను ఇప్పటివరకు రుచి చూడలేదు” అని కైపుగా చూడగా , “పో బావ” అని నా ఛాతిపై సున్నితంగా కొడుతూ సిగ్గుపడుతూ కిందకు పరిగెత్తుతుండగా తననే ప్రేమగా చూస్తూ నిలబడిపోయాను.

సమయం చూడగా 8 గంటలు అవుతుండగా కృష్ణ కు ఫోన్ చేసి బంధువుల గురించి అడుగగా , “మా పిన్ని బాబాయ్ మరియు పిల్లలు తప్ప అందరూ ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు” అని చెప్పగా , “సరే వాళ్ళతో సహా అందరూ రెడి అవ్వండి కైలాసాగిరి వెళదాము” అని చెప్పగా , “సూపర్ మామా అమ్మ వాళ్ళు నిన్నటి నుండి బంధువులతో తీరిక లేకుండా అలసిపోయి ఉన్నారు అలా సరదాగా బయటకు వెళ్తే హాయిగా ఉంటుంది , అమ్మకు , అక్కయ్యకు చెప్పి త్వరగా రెడి అవ్వమని చెబుతాను” అని బదులివ్వగా కాల్ కట్ చేసి కిషోర్ నాన్న గారికి కాల్ చేసి అదే చెప్పగా , “అల్లుడు ఇంట్లో ఇంకా చాలా మంది బంధువులు ఉన్నారు , వాళ్ళను వదిలేసి రావడం బాగుండదు , అబ్బాయిని , అమ్మాయిని మరియు అల్లుడుని పంపించనా” అని అడుగగా , “సూపర్ మామయ్య” అని బదులివ్వగా నేను లైన్ లో ఉండగానే బావకు విషయం చెప్పి రెడి అవ్వమన్నారు.

బావకు , అన్నయ్యకు కాల్ చేసి కైలాసాగిరి దగ్గరకు వచ్చెయ్యమని చెప్పి, కిందకు రాగా చిన్నా మరియు వర్షిని టీవీ చూస్తుండగా , వర్షిని దగ్గరకు వెళ్లి “మహి అక్క ఎక్కడ” అని నెమ్మదిగా అడుగగా చిన్నా నవ్వుతూ “స్నానం చేయడానికి వెళ్ళింది మామయ్య” అని గట్టిగా అరవగా , చిన్నా నోరు మూసి నవ్వుతూ , వంట గదిలోకి వెళ్లగా అమ్మ , అత్తయ్య ఇద్దరు శుభ్రన్గా తల స్నానాలు చేసి వంట చేస్తుండగా వెనుక నుండి ఇద్దరి భుజాలపై చెరొక చెయ్యి వేసి వారి తలలపై ప్రేమగా ముద్దులు పెట్టి ,తడిగా వెంట్రుకలలో నుండి వస్తున్న సువాసనను పీలుస్తూ “అమ్మ త్వరగా చెయ్యండి అందరూ సరదాగా బయటకు వెళదాము” అని చెప్పగా , ఇద్దరు ఒకేసారి సరే కన్నయ్య , బుజ్జి అని బాదులివ్వగా ముగ్గురు ఒకరి ముఖాలు మరొకరు చూస్తూ కాళ్ళల్లో నీళ్లు వచ్చేలా నవ్వి , “మేము ఎప్పుడో రెడి నీదే లేట్ కన్నయ్య” అని ఇద్దరు చెరొక చెంపపై ప్రేమగా నిమరగా , లవ్ యు అమ్మ , అత్తయ్య అని బెంటనే రెడి అయ్యి వచ్చేస్తాను అని బయట ఉన్న బాత్రూం లోకి వెళ్ళాను.

అంతలోపు మహి స్నానం చేసి బయటకు రాగా అమ్మ అత్తయ్యతో పిల్లలను కూడా త్వరగా స్నానం చేయించి రెడి చెయ్యి నేను ఈ వంట పని చూస్తాను అనగా సరే వదిన అని ముందు చిన్నాకు స్నానం చేయించి , వర్శినిని బాత్రూం లోకి పంపించింది. 9 గంటల లోపల నేను రెడి అయ్యి tiffen తినేసి కారు మరియు వాహనం తాళాలు తీసుకొని వాటి అద్దాలు తుడవసాగాను.

1 Comment

  1. E story rasinollaki konchem kuda Budhi ledhanukunta

Comments are closed.