జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 15 57

బ్యాగును భుజం పై వేసుకొని అయ్యిందా మామా నీ సెంటిమెంట్ అని కన్నింగ్ గా నన్నే చూస్తుండగా బ్యాగు తీసుకొని అమ్మకు మరియు అంటీ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని , అమ్మను చిరు నవ్వుతో ఒకసారి చూసి , కృష్ణ గాడి దగ్గరికి వెళ్లి వాడి వీపుపై ఒక దెబ్బ వేసి పదరా వెళ్దామ్ అని బయటకు వస్తుండగా అమ్మ వాళ్ళు అది చూసి గట్టిగా నవ్వసాగారు.

సెక్యురిటి దగ్గరికి వెళ్లి కొంత డబ్బు ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి , కారు దగ్గరికి వెళ్లగా, డ్రైవర్ లేకపోవడంతో చుట్టూ చూడగా కాంపౌండ్ గోడను పరిశీలిస్తుండగా , హలొ బాస్ అక్కడ ఏమి చేస్తున్నారు టైం అవుతోంది తొందరగా రండి అని పిలువగా , వస్తున్నా అని హిందీ లో చెప్పగా కారులో వెల్తూ అతడిని కనుక్కోగా బీహార్ నుండి పని కోసం వచ్చినట్లుగా , ముందుకు వెళుతూ ఇంటి వైపే చూడసాగాడు. కొత్త ఇల్లు చూస్తున్నాడేమో అనుకోని జావో భయ్యా అని గట్టిగా చెప్పగా ఫాస్ట్ గా ఉరికించాడు.

గంటలో ఎయిర్పోర్ట్ కు చేరుకోగా పే చేసి టికెట్స్ బయటకు తీసి లోపలికి వెళ్ళి చూపించగా, కంప్యూటర్ లో చెక్ చేసి సర్ మీ టికెట్స్ క్యాన్సల్ అయ్యాయి ,మీరు వెల్లలనుకొంటే వాటిని రాత్రి 11 గంటలకు ఉన్న ఫ్లైట్ కు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పగా , నా టికెట్స్ చూడగా టికెట్ కన్ఫర్మ్ అయినట్లుగా date మరియు టైం పక్కాగా ఉండగా , అమ్మకు రెండు రోజుల్లో వస్తానని మాట ఇచ్చాను , ఇలా అయితే ఒక రోజు ఇక్కడే గడిచిపోతుందని , కోపంతో సిబ్బంది పై గట్టిగా టికెట్ చూపిస్తూ అరవగా , పక్కనే ఉన్న పోలీసులు రాగా నా టికెట్స్ పరిశీలించి , లోపలికి వెళ్ళి వాళ్ళను కనుక్కోగా, పోలీస్ ల చెవిలో ఏదో చెప్పగా , మా ఇద్దరిని పక్కకు పిలుచుకొని వెళ్లి తమ్ముడు మీ టికెట్ లను అర్జంట్ గా వెళ్లాల్సి వచ్చిన మంత్రి గారికి కేటాయించడం జరిగింది , కాబట్టి అర్థం చేసుకొని గొడవ చెయ్యకుండా రాత్రికి ఉందని చెబుతున్నారుగా వెళ్లొచ్చు కదా అని నిదానంగా చెప్పగా , సరే సర్ అని చెప్పి రాత్రి ఫ్లైట్ కు మార్పించుకొనగా వేరే టికెట్స్ ఇవ్వగా పర్సులో పెట్టుకొని మీ అదృష్టం రెండు టికెట్స్ మాత్రమే మిగిలాయి అని చెప్పగా , డెస్క్ పై నున్న ఫోన్ నెంబర్ తీసుకొని కృష్ణ తో పాటు బయటకు వస్తూ , ఆ విషయం ముందుగానే చెప్పనందుకు వొళ్ళంతా కోపంతో తిక్కరేగసాగింది.

ఇప్పుడు ఇంటికి వెళితే అమ్మ సంతోషిస్తూ , మళ్ళీ వచ్చేటప్పుడు బాధ పడుతుందని, అది నాకు ఇష్టం లేక ఎలాగోలా సిటీ లోకి వెళ్లి సమయం గడుపుదామని కృష్ణతో చెప్పి కోపంగా క్యాబ్ లో సిటీ వైపు రాసాగాము. కృష్ణ మూవీ కి వెళ్దామని చెప్పగా మల్టీప్లెక్స్ దగ్గర ఆగి లోపలికి కోపంగా వెళుతుండగా , అరే మామా అయ్యిందేదో అయ్యింది అంతా మన మంచికే అనుకుందాము నవ్వరా బాబు చూడలేకపోతున్నాను అని నవ్వు ముఖంతో చెప్పగా ఒక మహిళ నన్ను గుద్దుకొని ఆత్రంగా బయటకు వస్తుండగా , సారి అని చెప్పేలోపు ముందుకు వెళ్లిపోగా , టికెట్స్ తీసుకుందామని పర్సు చేసుకోగా , పర్సు లేకపోవడంతో , గుద్దిన మహిళ గుర్తుకు రాగా,మామా పర్సు దొబ్బేసిందిరా టికెట్స్ కూడా అందులోనే ఉన్నాయి అని చెప్పగా , ఇంకా చూస్తావేంటిరా నువ్వు అటువైపు వేళ్ళు నేను ఇటు వైపు చూస్తాను అని , చిన్న చిన్న సంధుల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి చుట్టూ వేతకసాగాము.

1 Comment

  1. E story rasinollaki konchem kuda Budhi ledhanukunta

Comments are closed.