జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 15 57

కారు డోర్ లు సరిగ్గా వేశారో లేదో అని ఒకసారి సరి చూసి , డ్రైవర్ దగ్గరికి వెళ్లి మిగతా డబ్బులు ఇచ్చి అతని గురించి తెలుసుకొని మొబైల్ లో ఒక ఫోటో తీసుకొని ఎక్కడా ఆగకుండా వెళ్లిపో అని చెప్పి అమ్మ భుజంపై చెయ్యి వేసి కళ్ళల్లో నీళ్ళు కారుస్తూ అందరికి టాటా చెబుతూ , మామయ్య మామయ్య టాటా అని పిల్లలు అరుస్తుండగా గాలిలోకి ఒక ముద్దు విసిరి నవ్వుతూ టాటా చెప్పగా కారు బయటకు వెళ్ళిపోయింది. అమ్మ నన్ను ప్రేమగా వీపుపై నిమురుతూ లోపలికి పిలుచుకొని వెళ్ళింది.

అన్ని సమస్యలు తీరిపోవడంతో అందరూ హ్యాపీ గా ఉండటంతో ఒకసారి నాన్న గారు ఎక్కడ ఉన్నారో కనుక్కుని కలవాలని కృష్ణ గాడికి ఫోన్ చేసి ఇంటి దగ్గరికి వస్తున్నాను పని ఉంది బయటకు వెళదాము అని చెప్పగా , త్వరగా రారా అని కృష్ణ చెప్పగా అర గంటలో కారులో అంటీ ఇంటికి చేరుకొని నా కారు శబ్దం విని దివ్యక్క బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య tiffen తిందువు రమ్మని పిలువగా , అక్క ఇప్పుడే ఇంటిలో కుమ్మి వచ్చాను అని ఎంత చెప్పినా వినకుండా కారు డోర్ తెరిచి నా చెయ్యి లాక్కొంటూ ఇంటిలోకి వెళ్లి డైనింగ్ టేబుల్ కుర్చీలో కూర్చోబెట్టగా పక్కనే దోసెలు, చికెన్ కుమ్ముతున్న కృష్ణ వైపు చూసి అరే మామా కడుపు నిండిందిరా అని దీనంగా ముఖం పెట్టి చెప్పగా, నేను పిలిస్తే రావనే లోపల ఉన్న అక్కయ్య వచ్చింది , అమ్మ , అక్కయ్య మహేష్ కు చాలా ఆకలిగా ఉందంట చాలా దోసెలు వేసుకురండి అని చెబుతూ నవ్వుతుండగా , ఒరేయ్ నీ యబ్బా అని పైకి లేచి కొట్టబోగా , అంత ఆకలిగా ఉంటే ముందే రావచ్చు గా మహేష్ అని ప్లేట్ నిండా దోసెలు తీసుకొని వస్తుండగా అంటీ నా వల్ల కాదు ఇంట్లోనే తినేసి వచ్చాను , వీళ్ళిద్దరూ ఆటపట్టిస్తున్నారు అని సోఫాలో అంకుల్ పక్కన మూతి గట్టిగా మూసుకొని కూర్చోగా ,
దివ్యక్క వంటింట్లో నుండి వేగంగా బయటకు వచ్చి అన్నయ్యా తినవా అయితే అని అడుగగా , కడుపుపై చెయ్యి వేసి నిండిపోయిందని చూపిస్తూ దీనంగా ముఖం పెట్టి చూపిస్తుండగా , నువ్వు తినకపోతే నేను , అమ్మ తినము అని కరాఖండీగా చెప్పెయ్యగా , కృష్ణ గాడు కూడా కుర్చీలోనుండి పైకి లేచి నేను కూడా తినను అని పైకి లేవగా , అంకుల్ మీరన్నా చెప్పండి అని ప్రాధేయపడగా , గంభీరంగా పైకి లేచి పిల్లాడిని బెదరగొడతారా అని మాట్లాడుతుండగా , హమ్మయ్య అంకుల్ నాకే సపోర్ట్ చేస్తున్నారు అని సంతోషించే లోపు , మహేష్ తినకపోతే నాకు కూడా పెట్టొద్దని చెప్పి కోపం నటిస్తున్నట్లు ఒక వైపు నవ్వుతూ కూర్చోగా ,
అంకుల్ ఎవరివైపు ఉన్నాడో నాకు అస్సలు అర్థం కాలేక అంకుల్ వైపే తదేకంగా చూస్తుండగా , అటువైపు తిరిగి తనలోతాను నవ్వుకొంటుండగా , అంకుల్ మీరుకుడానా అని చెప్పగా , దింట్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని టీవీ లో న్యూస్ చూస్తూ ఉండిపోయారు.

అదే తమ చివరి మాట అని అందరూ నా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుండిపోయారు.అక్కయ్య , అంటీ ప్లీస్ అని వెదుకొనగా ఇద్దరు తమ ముఖాలను బుంగ మూతితో పక్కకు తిప్పుకోగా , ఇక తప్పెట్లుగా లేదు అనుకోని అక్కయ్య తింటానులే అని సోఫాలో నుండి పైకి లేవగా అందరూ సంతోషంగా నవ్వుతుండగా , కృష్ణ గాడి ప్లేట్ చూడగా పూర్తిగా ఖాళీగా ఉండగా , నీ యబ్బా దోసెలు అన్ని కుమ్మేసి అయిపోయిన తరువాత నేను కూడా తినను అంటావా అంటూ వాడి వీపుపై ఒక్క దెబ్బ వేసి 5 నిమిషాలు అని చెప్పి బయటకు వెళ్లి ఒక పదోసార్లు వేగంగా మెట్లు ఎక్కి దిగుతూ , పైకి వెళ్లి బస్తీలు పెట్టసాగాను.అందరూ తలుపు దగ్గరికి వచ్చి నన్నే వింతగా చూడసాగారు.

కొన్ని నిమిషాల తరువాత లోపలికి వచ్చి టేబుల్ ముందు కూర్చొని ముఖం పై చెమటలు కారుతుండగా దివ్యక్క ఇప్పుడు తీసుకు రండి అని చెప్పగా , అంకుల్ నా వైపు ఆశ్చర్యంగా , వింతగా చూస్తూ బయట ఏమి చేసావు అన్నట్లు కళ్లతో అడుగగా , ఇంట్లోనే పూర్తిగా తిన్నాను , అలా చేస్తే కొద్దిగయినా అరుగుతుందని అని చెప్పి నేను ఒక దోసె మాత్రమే తింటే మేము కూడా ఒక్క దోసె నే తింటాము అంటారు మీరంతా తినకపోయి ఆకలితో ఉంటే ఈ హృదయం తట్టుకోలేదు అని ప్రేమగా చెప్పగా ,అంకుల్ చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకొంటు వేలితో సూపర్ అన్నట్లుగా కళ్ళెగరేయ్యగా , అంటీ నా ముందు ప్లేట్ పెట్టి దోసెలు పెడుతుండగా చల్లారిపోయి ఉండటంతో దివ్య వేడి దోసెలు వేయమని చెప్పగా దివ్యక్క నవ్వుతూ వంటింట్లోకి పరిగెత్తగా , అంటీ నా ముఖం పై ఉన్న చెమటను తన చీర కొంగుతో తుడుస్తూ నాకు తమపై ఉన్న అభిమానానికి చాలా చాలా మురిసిపోతూ , ఆనంద భాస్పాలు కారుస్తూ ప్రేమగా నుదుటిపై ముద్దుపెట్టింది.

1 Comment

  1. E story rasinollaki konchem kuda Budhi ledhanukunta

Comments are closed.