జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 15 57

ఇంకో కొన్ని నిమిషాల తరువాత మరొక చెయ్యి నా చెంపలపై ప్రేమగా నిమురుతూ ఉండగా ఇక ఈ చేతిని మాత్రం వదిలేది లేనట్లుగా గట్టిగా పట్టుకోగా , వెచ్చటి గాలిని వదిలినా కూడా నేను చేతిని వధలకపోవడంతో నా పెదాలపై గట్టిగా వెచ్చటి ముద్దు పెట్టగా సరాసరి స్వర్గంలో విహరించినట్లుగా అక్కడంతా రాక రకాల పూల చెట్లతో , రొమాంటిక్ సువాసనతో చీకటన్నదే లేనట్లుగా , చుట్టూ నా ప్రాణానికి ప్రాణమైన వాళ్లే సంతోషంగా నా దగ్గరికి దేవతల్లా వస్తుండగా , అందర్నీ చూస్తూ ఈ జీవితానికి ఇది తప్ప ఇంకేమి అవసరం లేదు అన్నట్లుగా వొళ్ళంతా హాయిగా అనిపిస్తుండగా చేతిని వదులు చెయ్యగా నా చేతిని వదిలెయ్యగా , ఆ చెయ్యి అందుకోకపోతే స్వర్గపు ప్రవేశం లేనట్లుగా , చుట్టూ ఉన్నవన్నీ మాయమైపోతుండగా , చేతిని అందుకోవడానికి అన్నట్లు ముందుకు వెళ్లగా సోఫాలో నుండి ధడేల్ మని పడిపోగా , అమ్మా అని అరుస్తూ కళ్ళుతెరువగా తెల్లారిపోయి ఉండగా చుట్టూ చూడగా అందరూ నిద్రలేచి వంటింట్లో ఉన్నట్లుగా చప్పుడు వినిపిస్తుండగా , పైకి లేస్తుండగా నా ఒంటిపై మూడు రగ్గులు ఉండగా అంటే అది కల కాదన్నమాట , నా ముగ్గురు దేవతలు ఒక్కొక్క రగ్గు కప్పారు అన్నమాట అనుకోని , వాళ్ళ ప్రేమకు మురిసిపోసాగాను.

అంతలో చిన్నా పరిగెత్తుకుంటూ వచ్చి మామయ్య పడిపోయావా అని నవ్వుతూ , మామయ్య నిద్రపోతూ సోఫాలో నుండి పడిపోయాడు అని గట్టిగా అరవబోతుండగా గట్టిగా నోరు మూసి నవ్వుకుంటూ పైన ఉన్న జిమ్ రూమ్ కు ఎత్తుకొని వెళ్ళిపోయాను.

కిటికీలు మరియు 4 తలుపులు ఉన్న డోర్ ను తెరువగా ఎదురుగా సముద్రం ఉదయ సూర్యుని కాంతితో మెరుస్తూ కనిపిస్తుండగా , ఒకసారి వొళ్ళు విరుచుకొని జిమ్ బోర్డ్ పై నెమ్మదిగా రన్ చేస్తుండగా , చిన్నా సైకిల్ ఎక్కి కాళ్ళు పూర్తిగా అందక కష్టపడుతూ తొక్కుతుండగా నవ్వుతూ , సముద్రపు గాలి వేగంగా లోపలికి వస్తుండగా పడుతున్న చెమటంతా గాలి ధాటికి ఎగిరిపోతోంది.

కొద్దిసేపటి తరువాత డంబెల్స్ తీసుకొని ఎత్తుతుండగా జిమ్ లోపలికి అప్సరసలా అదే చీరతో రెండు కప్పులు తీసుకొని వచ్చి ఒకటి చిన్నాకు పాలు ఇస్తూ , నవ్వుతూ ఇంకొక కప్ పట్టుకొని నా దగ్గరికి వస్తుండగా ,అన్ని ఆపేసి తన వైపే కళ్ళార్పకుండా చూస్తుండగా, నవ్వుతూ కళ్లతో “ఏంటి బావ” అని అడుగగా, అన్ని కిందకు పెట్టి బాల్కనీ లోకి వెళ్లగా , మహి “బావ ఇదిగో పాలు” అని ఇస్తూ , “ఏంటి బావ నిన్నటి నుండి నన్నే తినేసేలా చేస్తున్నావు” అని అడుగగా, “నేనా…… లే……లేదే” అని తడబడుతూ భయంతో బదులిస్తూ ఉండగా , మహి తనలో తాను నా పరిస్థితిని చూస్తూ సంతోషంగా నవ్వుకుంటుండగా , తన నుండి ముఖాన్ని కప్పు వైపు చూడగా తెల్లటి పాల మధ్యలో ఒక నురగ నల్లగా కనిపిస్తుండగా , రాత్రి మహి నడుముపై ఉన్న పుట్టు మచ్చ గుర్తుకు రాగా , దానినే చూస్తూ ఉండిపోగా, “మచ్చ బాగుందా బావ” అని అడుగగా , నాకు తెలియకుండానే పెదాలపై చిరునవ్వుతో “బాగుండటమేంటి, నీ అందానికే అదిరిపోయేలా ఉంది” అని ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లుగా చెబుతూ , ఏమి మాట్లాడుతున్నానో గుర్తుకు వచ్చి వొళ్ళంతా చెమటలు పట్టి చేతులు వణకగా కొన్ని పాలు కిందకుపడ్డాయి.

1 Comment

  1. E story rasinollaki konchem kuda Budhi ledhanukunta

Comments are closed.