జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 15 57

రెండు నిమిషాల తరువాత మహి పిల్లలను పిలుచుకొని లోపలికి రాగా , మొదటిసారిగా పట్టు చీర కట్టుకొని , చేతికి బంగారు గాజులు వేసుకొని , మెడలో గొలుసు ధరించి , వెంట్రుకలను లూస్ గా కిందకు వదిలేసి , లైట్ గా మేకప్ వేసుకొని అందంగా అప్సరసలా నడుచుకొని వస్తుండగా,కళ్ళు నోరు పూర్తిగా తెరిచి చూస్తూ బండ రాయిలా నిలబడిపోగా , మహి నన్ను చూస్తూ చేతి వేళ్ళతో ముందు ముఖం పై వాలిన వెంట్రుకలను చెవి వెనక్కు వేసుకుంటుండగా తనలో తాను నవ్వుకుంటూ కళ్ళెగరేస్తూ నా పక్కన వెల్తూ తన చేతి వేళ్ళతో నా చేతిని తాకిస్తూ ముందుకు నడువగా , ఫ్లాట్ అయిపోయి ఒక చేతిని గుండెలపై పెట్టుకొని పక్కనే ఉన్న సోఫాలో కులబడిపోగా , మహి వెనక్కు తిరిగి చూస్తూ నవ్వుకుంటూ జాగ్రత్త బావ అని చిన్నగా చెబుతూ దివ్యక్క ఉన్న రూమ్ లోకి వెల్తూ మళ్ళీ ఒకసారి తొంగి చూడగా ,తనవైపే చూస్తూ నా గుండెలపై సున్నితంగా కొట్టుకుంటుండగా ఒక ముద్దు విసిరి లోపలికి వెళ్ళిపోయింది.

వెంటనే పంతులు గారు కిషోర్ మరియు దివ్యక్కను పిలుచుకొని రమ్మనగా ఇద్దరు రాగా సాంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం నడిపిస్తూ , కిషోర్ అక్క దివ్యక్కకు కొత్త బట్టలు ఇవ్వగా , కృష్ణ కిషోర్ అన్నయ్యకు ఇవ్వడానికి పిలువగా నన్ను రమ్మనగా ఇద్దరు కలిసి ఇవ్వగా , ఇద్దరు తమ తమ రూమ్ లలోకి వెళ్లి బట్టలు మార్చుకొని రాగా , ఉంగరాలు మార్చుకొనగా ,అందరూ పైకి లేచి చప్పట్లు కొట్టసాగారు.

వచ్చిన బంధువులందరికి ఆకు వక్క ఇస్తూ అన్ని కార్యక్రమాలు అయ్యేసరికి 8 గంటలు అవ్వగా , ఒక్కొక్కరే తమ కుటుంబాలతో వచ్చి ఫోటోలు దిగుతూ కిందకు వస్తుండగా , అంకుల్ మరియు మామయ్య వాళ్ళను భోజనానికి పిలుచుకొని వెళ్తున్నారు. స్టేజి వైపుకు వెళ్లిన ప్రతిసారి మహిని చూడకుండా ఉండలేకపోయాను , అలా జరిగిన ప్రతిసారి మహి నవ్వుకోసాగింది. అందరూ భోజనాలు చేసి వంటలు అద్భుతంగా ఉన్నాయని చెబుతూ సంతోషంగా ఇంటికి వెల్లసాగారు.

ఇంటికి వచ్చిన బంధువులు రెండు వాహనాలలో ఇంటికి చేరుకుంటుండగా , మళ్ళీ ఖాళీ బాహనాలు వచ్చి మిగిలిన వారిని ఇంటికి చేరుస్తున్నారు. మా రెండు కుటుంబాలు తప్ప ఫంక్షన్ కు వచ్చిన వారందరు వెళ్లిపోగా , సమయం 10 గంటలు అవుతుండగా దివ్యక్క , కిషోర్ బావ పక్క పక్కనే కూర్చొనగా ,నేను వెళ్లి మహి పక్కనే వేగంగా వెళ్లి కూర్చోగా ప్రేమగా ఏంటి బావ అని అడుగగా , చేతి వేళ్ళతో సూపర్ అని పొగుడగా , లవ్ యు బావ అని నెమ్మదిగా చెప్పగా మనసు సంతోషంతో పొంగిపోగా, అందరూ వరుసగా కూర్చోగా భోజనాలు అయ్యేసరికి 11 గంటలు అవ్వగా , కొద్దిసేపు అందరూ హాల్ లో కూర్చొని ఫంక్షన్ గురించి సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకోగా , మామయ్య ఇక వెళదాము అనగా , దివ్యక్క ముఖ0 డల్ గా అవ్వగా , బావ అక్కయ్యను కౌగిలించుకొని నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి ఫోన్ చేస్తాను అని చెప్పి అందరూ బయటకు వచ్చి వాళ్ళు రెండు కారులలో , మేమంతా కారు మరియు వాహనం లో ఇంటికి చేరుకున్నాము.

1 Comment

  1. E story rasinollaki konchem kuda Budhi ledhanukunta

Comments are closed.