జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 15 54

అంతలోపల అందరూ తినేసి రెడి అయ్యి అమ్మ , అత్తయ్యలు చీరలు కట్టుకోగా , మహి కొత్త లాంగ్ కుర్తా మరియు వర్షిని కొత్త టాప్ వేసుకొని తలుపు దగ్గర నుండి నా దగ్గరకు వయ్యారంగా నడుచుకొని వస్తుండగా , అటువైపు చూడగా ఇద్దరు దేవతలు , ఇద్దరు దేవకన్యలు అందంగా ముస్తాబయ్యి వస్తుండగా నోటిని సున్నాలా తెరిచి , కళ్ళార్పకుండా చూస్తూ , ఎవరివైపు చూడాలో తికమక పడుతూ కళ్ళను వేగంగా నలుగురి వైపు తిప్పుతూ , ఒక చేతిని గుండెలపై వేసుకొని తియ్యటి హార్ట్ ఎటాక్ వచ్చినట్లుగా కారు ముందువైపు వెనక్కు పూర్తిగా వాలిపోయి చూస్తుండగా, ముగ్గురు నోటికి చేతిని అడ్డం పెట్టుకొని తమలో తాము నవ్వుకుంటూ నా దగ్గరికి వచ్చి ముగ్గురు నా టీ షర్ట్ పట్టుకొని నెమ్మదిగా లేపి ముగ్గురు కన్ను కొడుతూ ఇక వెళదామా అని చెప్పగా తేరుకొని అమ్మకు కారు తాళాలు అందిస్తూ అమ్మ అత్తయ్య నువ్వు కారులో మీ ఫ్రెండ్ ఇంటి వరకు రండి , నేను పిల్లలు వాహనం లో వస్తాము అని చెబుతూ మహిని నా వాహనం లో రమ్మన్నట్లుగా సైగ చెయ్యగా , అమ్మ నేను బావతో వస్తానని చెప్పగా నవ్వుతూ వాహనం దగ్గరి వరకు చిన్నాను భుజంపై ఎత్తుకొని డోర్ తెరిచి లోపలకు దింపగా డ్రైవర్ సీట్ నుండి వెనక్కు వెళ్లిపోగా వర్షిని అటు వైపు నుండి ఎక్కమనగా అక్క నేను డోర్ పక్కనే కూర్చుంటాను నువ్వు ముందు ఎక్కమనగా , ఎక్కి లోపలికి జరుగగా , వర్షిని ఎక్కి కూర్చొని డోర్ వెయ్యగా , నేను అటువైపు వెళ్లి డోర్ సరిగ్గా వేసిందో లేదో అని ఒకసారి చెక్ చేసి వాహనం ఎక్కి అమ్మ కారు వెనుకే ఫాలో అవ్వసాగాను.

వర్షిని చేతులు బయట పెట్టకుండా అద్దం ఎత్తెయ్యగా దాంట్లో నుండి బయటకు చూస్తుండగా , వెనుక చిన్నా బెడ్ పై వాలిపోయి అటు ఇటు దొర్లుతుండగా నవ్వుకుంటూ మహి నాకు దగ్గరా జరిగి నా చెయ్యి చుట్టూ చేతులు వేసి నా భుజం పై తల వాల్చి మాట్లాడుతూ , అర గంటలో అంటీ ఇంటికి చేరుకోగా అప్పటికే బయట అంటీ , దివ్యక్క మరియు కృష్ణ వాళ్ళ పిన్ని బాబాయ్ ఇద్దరు పిల్లలు మా కోసమే వేచి చూస్తుండగా , అందరూ వాహనం దిగి అమ్మ వెళ్లి అంటీ మరియు వాళ్ళ చెల్లెలితో మాట్లాడుతుండగా రేయ్ కృష్ణ అంకుల్ ఎక్కడ అని అడుగగా , అర్జెంట్ పని ఉందని వెళుతూ మీరు వెళ్లి రండి అని చెప్పారు అని చెప్పగా , దివ్యక్క ఎందుకో యక్టీవ్ గా కనిపించకపోగా సైలెంట్ గా వాహనం వెనుక అమ్మ అత్తయ్యతో పాటు కూర్చోగా , ఈ మౌనం అక్కడికి చేరెవరకె అని అనుకొని , కృష్ణ కు కారు తాళాలు అందించి సరే అయితే అని మీరంతా కారులో రండి , మిగిలిన వాళ్లంతా వాహనం లో వస్తాము అని చెప్పి మేము ముందు వెళుతుండగా కృష్ణ మమ్మల్ని ఫాలో అవ్వసాగాడు.

బావకు కాల్ చెయ్యగా కైలాసగిరి ఎంట్రన్స్ లో వేచి చూస్తున్నామని చెప్పగా వచ్చేస్తున్నాము అని చెప్పి దివ్యక్కను చూసి నవ్వుకోసాగాను.అంతలో అంకుల్ నుండి కాల్ రాగా ఎక్కడ అని అడుగగా కైలాసగిరి వెల్తూ ఉన్నాము అని చెప్పగా అయితే అక్కడికే వచ్చేస్తాను అని చెప్పగా , oh గుడ్ అంకుల్ అని హుషారుగా ముందుకు పోనిచ్చాను.10:30 గంటల కల్లా కైలాసగిరికి చేరుకొని వాహనాలను పార్కింగ్ ప్లేస్ లో పెట్టి ఎంత మంది ఉన్నామో లెక్కపెట్టుకొని ప్రవేశానికి మరియు కేబుల్ కార్ రౌండ్ ట్రిప్ కు అందరికి టికెట్స్ తీసుకొని దివ్యక్క తల వంచుకుని మౌనంగా నడుస్తుండగా ప్రవేశ ద్వారం దగ్గరకు వెళ్లగా ఒక పక్కన మా కోసం ఎదురు చేస్తున్నట్లుగా మహేష్ ఇక్కడ ఉన్నాము అని బావ మాటలు వినిపించగా ,పక్కనే అంకుల్ కూడా ఉండటంతో , దివ్యక్క ముఖం ఒక్కసారిగా వెలిగిపోతూ బావ వైపే నవ్వుతూ చూస్తూ ఉండగా , బావ దగ్గరకు వచ్చి నన్ను కౌగిలించుకోగా , బావ నువ్వు లేవని మా అక్క ఇప్పటి వరకు బాధపడుతూ వచ్చి మిమ్మల్ని చూడగానే ఎంత ఉత్సాహం వచ్చిందో చూడండి అని అక్క వైపు చూడగా , అక్క సంతోషంగా నవ్వుతూ బావ పక్కన చేరి థాంక్స్ అన్నయ్య అని చెప్పగా , మా అక్కయ్యకు ఏమి కావాలో నాకు తెలియదా అని నవ్వుకోసాగాము.

1 Comment

  1. E story rasinollaki konchem kuda Budhi ledhanukunta

Comments are closed.