జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 15 57

అంతలో దివ్యక్క వేడి వేడిగా దోసెలు మరియు చికెన్ తీసుకొని వచ్చి వడ్డించగా , అంకుల్ మీరు రండి కలిసి తిందాము అని పిలువగా , నేను ఎప్పుడో తినేశానని నవ్వుతూ చెప్పగా , అంకుల్ మోసం అని గట్టిగా అరవగా అందరూ పగలబడి నవ్వసాగాము. చాలు చాలు అన్నా కూడా దోసెలు మీద దోసెలు ప్రేమగా తెచ్చిపెడితుండగా బలవంతంగా లోపలికి తొయ్యసాగాను. నేను తిన్న తరువాత అంటీ మరియు దివ్యక్కను డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి నేనే స్వయంగా దోసెలు వేసుకొని వచ్చి వాళ్ళ ప్లేట్ లలో వేస్తూ తినండి అని చెప్పగా నా వైపు ఆరాధనగా చూస్తూ తినసాగారు.

అలా అందరూ నవ్వుకుంటూ , జోకులు వేసుకుంటూ తిన్న తరువాత అంకుల్ పని ఉంది వెళ్ళొస్తామని చెప్పి కారును అక్కడే వదిలి కృష్ణగాడి బైకులో బయటకు వస్తూ ,బండిని నేనే తోలుతుండగా ఎక్కడికి రా ఇంత అర్జంట్ అని అడుగగా, సమస్యలన్నీ తీరిపోయాయి గనుక ఒక సారి నాన్నను కలవాలని ఉందిరా అని చెప్పగా , ఎలా రా ,ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా అని అడుగగా , లేదు ఎలాగయినా మా నాన్న స్నేహితులను అందరిని కలిస్తే నాన్న గురించి ఏదైనా విషయం తెలియవచ్చు అని , నాన్నకు తెలిసిన వారందరి ఇళ్లకు వెల్లసాగాము.

మధ్యాహ్నం వరకు ఎక్కడికి వెళ్లినా నా గురించి అమ్మ గురించి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారే తప్ప నాన్న గురించి మాకేమి తెలియదు అంటున్నారు. నాన్నకు చిన్నప్పటి స్నేహితుడు మాత్రం మీ నాన్న గారు ఆ సన్యాసులను ముందుగా ఒక గుడిలో కలిసారని , ఆ గుడికి వెళ్తే ఏదైనా సమాచారం ధోరకవచ్చు అని చెప్పగా , అంకుల్ కు థాంక్స్ చెప్పి సిటీ బయట ఉన్న గుడికి చేరుకోగా , గుడి మొత్తం శిథిలావస్థకు చేరుకొని లోపల మొత్తం కాషాయం బట్టలు ధరించి వాళ్ళు నోటిలో నుండి పొగ వదులుతూ అక్కక్కడ మూలన ఎవడికిష్టమైనది వాళ్లు చేసుకుపోతున్నారు.

ఒక ముసలాయన దగ్గరికి వెళ్లి ఆ సన్యాసుల గురించి అడుగగా , వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చి సంసారంలో విసిగిపోయిన వారిని తమ మాటలతో సన్యాసులుగా మార్చి ఇక్కడికి చాలా దూరం లో ఉన్న తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్తారు అని చెప్పగా , తీసుకు వెళ్లి ఏమి చేస్తారు అని అడుగగా , ఈ ప్రపంచానికి , సుఖ దుక్కాలకు దూరంగా అడవిలో పెరిగిన పండ్లు , కూరగాయలు తింటూ దేవుడిని ప్రసన్నం చేసుకోడానికి అడవులలో తపస్సు చేస్తుంటారు అని వివరించాడు.

1 Comment

  1. E story rasinollaki konchem kuda Budhi ledhanukunta

Comments are closed.