జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 15 57

అంత సుందరంగా అలంకరించారు చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు , హాల్ ఓనర్ ను మనఃస్ఫూర్తిగా అభినందిస్తూ , ఎంత అయ్యిందో మొత్తం బిల్ వేయమని , తరువాత హడావుడిలో కుదరదు అని చెప్పగా అలాగే సర్ అని ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి మొత్తం డీటెయిల్ గా బిల్ ఇవ్వగా అందుకొని , వంట ఏర్పాట్లు పరిశీలించి వాళ్ళను కూడా ఇంత అయ్యిందో చెప్పామనగా , బిల్ ఇవ్వగా అన్నయ్యతో పాటు వాహనం లో వెళ్లి వీలైనన్ని ATM లలో డబ్బు డ్రా చేసుకొని మొత్తం పే చేసేసి మిగిలిన డబ్బును ఖర్చులకు అలాగే పెట్టుకున్నాను.

సమయం 4 గంటలు అవుతుండగా ఒక్కొక్కరుగా వస్తుండగా , అంకుల్ కు నేను మరియు మామయ్యకు అన్నయ్య ఫోన్ చేసి వస్తున్న వాళ్ళను ఆహ్వానించడానికి రమ్మని పిలువగా కొద్దిసేపు తరువాత చేరుకొని ఎంట్రన్స్ లో అందరిని గౌరవంగా ఆహ్వానించసాగారు. స్టేజి పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్లి ముఖం కడుక్కొని కొత్తబట్టలు వేసుకొని రెడి అయ్యి లోపలికి వచ్చిన వాళ్ళు చుట్టూ చూస్తూ ఆశ్చర్యపోతూ పక్కన ఉన్న వాళ్ళతో దాని గురించే మాట్లాడసాగారు.

వచ్చిన వాళ్లకు ుునిఫారం వేసుకున్న స్టాఫ్ సాఫ్ట్ డ్రింక్స్ అందించసాగారు. 6 గంటలు అవుతుండగా మొదట కిషోర్ కుటుంబం తో సహా లోపలికి వచ్చి , బావ ఇది ఫంక్షన్ హలా లేక ఇంద్ర భవనామా అని సంతోషిస్తూ స్టేజి పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్లారు.. కొద్దిసేపటి తరువాత పూలతో అందంగా అలంకరించిన కారులో అమ్మ , అంటీ , అత్తయ్య దివ్యక్కను అందంగా అలంకరించి పిలుచుకొని లోపలికి రాగా , చుట్టూ ఆశ్చర్యంగా చూస్తూ సంతోషిస్తూ స్టేజి పక్కనే ఉన్న మరొక రూమ్ లోకి వెళ్లారు.

1 Comment

  1. E story rasinollaki konchem kuda Budhi ledhanukunta

Comments are closed.