మెమోరీస్ 3 136

మరుసటి రోజు మ్యాథ్స్ ఎగ్సాం. ఇన్విజిలేటర్ వచ్చీ రాగానే “ఎవరైనా స్లిప్స్ తెచ్చుంటేఇచ్చేయండి. స్క్వాడ్ కి చిక్కారంటే
మాత్రం మీ కర్మ డీబార్ అయిపోతారు” అని వార్నింగ్ ఇచ్చింది. మొదటి గంటన్నర రాజు తలెత్తకుండా రాసేశాడు. ఆ గంటన్నరలో
కవిత సుమారు ఇరవై సార్లు వెనక్కి తిరిగి రాజుని పిలిచింది, రెండు సార్లు గిచ్చింది, ఒకటి రెండు సార్లు పెన్నుతో పొడిచింది. రాజు
ఎగ్సాం అయిపోయే దాకా తలెత్తలేదు. బిట్ పేపరు ఇంకో అర్దగంటలో ఇస్తారనంగా తల పైకెత్తాడు.
“ఎవరికైనా రాకపోతే ఈ అర్దగంటలోనే రాసుకొండని ” ఆ ఇన్విజిలేటర్ మహాతల్లి బయట కెల్లిపోయింది.
ఆయమ్మ ఆ మాటనగానే రాజు ఆన్సర్ షీట్లన్నీ కవిత ముందరున్నాయి. పది నిమిషాల్లో బరికేసింది.ఇంకో పది నిమిషాలుందనగా
ఎవరో పక్కనుంచి పెన్నుతో పొడుస్తున్నట్టనిపింది రాజుకు, పక్కకు తిరిగి చూస్తే తురకది. కొశ్చన్ పేపర్ చూపించి
“ఈ కొశ్చన్ రాసావా”
అవునన్నట్టు తలూపాడు.
“నాకు చూపించవా”
“నేను తెలుగులొ రాసినా, నీది ఇంగ్లీష్ మీడియం కదా ”
“పర్లేదు నేను రాసుకుంటా”
వెంటనే కవిత యెనక్కి తిరిగి
“రేయ్ ఇయ్యద్దు ” అనింది కోపంగా.
రాజు చిన్నగా నవ్వుకుని అప్సానా అడిగిన కొశ్చన్ తాలూకు ఆన్సర్ షీట్ ఇచ్చాడు. కావలసిన కొశ్చన్ తో పాటు ఆ ఆన్సర్ షీట్లో ఉన్న ఆన్సర్లన్నీ కాపీ చేసి పడేసింది. వాటిని వెనకాలున్న నిహారికకి పాస్ చేసింది. బిట్ పేపర్లో కూడా సింహభాగం రాజు పేపర్లోనే చూసి రాసేశారు.
పరీక్ష అయిపోయాక ఇంటికి పోయేటప్పుడు మాత్రం థాంక్స్ అని నవ్వుకుంటూ వెల్లిపోయింది. కవిత మాత్రం
“ఆ థాంక్స్, నిన్న ఇంగ్లిష్ పేపరు చూపీమంటే మాత్రం చూపీలేదు గనీ ” అని మూతి వంకర్లు తిప్పింది.

ఆ రోజు ఇంటికెల్లిన తరవాత రాజుతో ఎప్పుడు మాట్లాడని సర్పంచ్ గారు బసవయ్య ఇంటికి పిలిచాడు. బసవయ్య ఇంటి చుట్టికారమూ పెద్ద కాంపౌడ్ గోడుంది. ఇంటి ముందర పెద్ద వరండా. వరండాలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు బసవయ్య. చుట్టూ ఊర్లోని పెద్దమనుషులు కూర్చున్నారు.
“ఎరా లెక్కలంత బాగా వస్తాయారా నీకు ”
“బాగానే వస్తాయి”
“మల్ల పద్దన నా కూతురు ఎగ్సాం లో సాయమడిగితే చెయ్యలేదంట”
“నన్నడగలేదు ”
“అయితే నేనిప్పుడడుతున్నా రేప్పద్దన్నే ఎగ్సాంకి దానికి సాయం చెయ్యాల”
రాజు తలూపాడు సరేనని.
“మీ నాయన కూడా మొదట్లో ఇట్లే తలూపి తరవాత పార్టీ మార్చేసినాడు లేకపోతే ఇదిగో ఈ రామాంజి గాని ప్లేస్లో MPTC అయ్యేటోడు. యా దానికైనా రాసిపెట్టుండాల. మీ నెత్తిన దరిద్రం రాసి పెట్టుంటే ఎవురేమి చేసేది.” అని చులకనగా మాట్లాడాడు.
“ఏరా నీకంత బాగా చదువెట్లబ్బిందిరా మీ నాయన ఎప్పుడు చూసిన లంజలెనకాలే తిరుగుతాడు. పైగా మీరేమో. . . . “అని రాజు గాని కులాన్ని ఎత్తి చూపాలని ప్రయత్నించాడు రామాంజి. దానికి అక్కడున్న ఎగువపల్లి పెద్దమనిషి కల్పించుకుని
“రేయ్ ఆడు వద్దనుకుని ఇడిచేసినదే నువ్విప్పుడు అనుభవిస్తాండేది ” అని ఎగువపల్లి పెద్దమనిషి రామాంజిని ఎగతాలి చేశాడు. దానికి అక్కడున్న వాళ్లందరూ నవ్వారు.
” ఊ సరే గనీ నువ్వు పో రేపు పాపకు సాయం చేయడం మాత్రం మర్చిపోద్దు.” అని రాజుని పంపేశాడు.
రాజు వెల్లిపోయిన చానా సేపటి వరకు రాజు గాని మీద, వాడి నాయన చేసిన యెదవ పనుల మీద చర్చ జరిగింది. అందరూ నాగప్ప మంచి తనాన్ని పొగిడితే, రామాంజి మాత్రం నాగప్పని తక్కువ చేసి మాట్లాడటానికే ప్రయత్నించాడు. వాడికి నాగప్పంటే ఎప్పటి నుంచో అసూయ. అందుకనే నాగప్ప బసవయ్య కాడ సీటు కాలి చేయగానే ఆడ దూరిపోయి నానా చాకిరి చేసి ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే వాడి చెల్లెలని, పెళ్లాన్ని బసవయ్య కింద పండబెట్టి MPTC స్థాయికి ఎదిగాడు.

స్కూల్ డేస్ :
అప్సానా
ఎగ్సాం సెంటర్ ముందున్న ఒక పెద్ద చింత చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు రాజు అతని తోటి విద్యార్థులు. అక్కడికి బుర్ఖాలేసుకున్న మూడు ఆకారాలొచ్చాయి. రాజు రాజుతో పాటి మిగిలిన వాళ్లు తలెత్తి ఎవరన్నట్లు చూశారు. అప్సానా మొఖం మీద ఉన్న బుర్ఖా ముసుగుని తొలగించింది. తనతో పాటు వచ్చిన ఇద్దరు స్నేహితురాల్లని రాజుకి పరిచయం చేసింది.
ఇంతలోనే కవిత కల్పించుకుని “ఎంది విషయం?” అనింది.
అప్సానా చిన్నబుచ్చుకుంది.
“ఏ ఊరకుండు. . . ” అని కవితని మందలించాడు.
“వూ . . . చెప్పండి. . . . ” అన్నాడు.
అప్సానా చెప్పడానికి నసిగింది. చెప్తే ఏమనుకుంటాడో అనే భయం ఆమెది. చివరికి ధైర్యం చేసి
“నేను ఫ్లో చార్ట్స్, డ్రాయింగ్స్ అంతగా ప్రాక్టీస్ చేయలేదు. ప్లీస్ నాకు హెల్ప్ చేస్తావా” అని అడిగింది అమాయకంగా.
“అవునా. . . మొన్న ఇంగ్లిష్ ఎగ్సాంలో. . . ” అని కవిత వెక్కిరించడానికి రెడీ అయిపోయింది.
“ఏయ్ ” అని తలమీద చిన్న మొటిక్కాయ వేశాడు.
“అట్లనే . . నేను రాసినవన్నీ చూపిస్తాను. రాయని దాన్లకు బలవంతం చెయ్యకూడదు సరేనా ” అని అప్సానాకు సాయం చేయడానికి ఒప్పుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *