మెమోరీస్ 3 136

“ఏమి లేవు సార్. . . .” అని అన్నాడు.
అడిషనల్స్ ఎన్ని తీసుకున్నాడోనని ఇన్విజిలేటర్ దగ్గర రికార్డ్ తీసుకుని చూశాడు.
“అన్నీ ఉన్నాయి కదా ఎందుకంత బయపడుతున్నావ్ . . . . . కిటికీ లోనించి కిందకి పడేశావా ” అని కిటికి లోనుంచి తొంగిచూశాడు.
“బయపడకు బాగా రాయి” అని పేపర్స్ ఇచ్చేసి వెళ్లిపోయాడు. స్క్వాడ్ వెళ్లిపోయినా పదినిమిషాలకి కానీ రాజుకి వెన్నులో వనుకు తగ్గలేదు.అసలు బిట్ పేపర్ ఎప్పుడు పంచారో కూడా తెలీలేదు. బిట్ పేపర్ వచ్చిన కొంత సేపటికి తేరుకున్నాడు. బెంచ్ మీద చేయి పెట్టిన చోట ముద్రలు స్పష్టంగా పడ్డాయి. తేరుకుని బిట్ పేపర్ కంప్లీట్ చేశాడు. నిహారికకి హెల్ప్ చేసి పది నిమిషాల ముందే ఎగ్సాం హాల్ లోనుంచి బయటకి వచ్చేశాడు.

ఎగ్సామ్స్ అయిపోయేలోగా నాలుగైదు సార్లు అప్సానాతో వంటరిగా మాట్లాడే అవకాశం దొరికింది. తనది సొంతూరు కదిరి అని, వాళ్ల నాన్న ఇన్ కం ట్యాక్స్ ఆఫిసర్ అని చెప్పింది. తన ఎప్పుడు ఒంటరిగా మాట్లాడే అవకాశం చిక్కినా రాజు ఆమె శరీర భాగాలని అబ్సర్వ్ చేసేవాడు. ఆమె పెదవులు, బుగ్గలే అతన్ని పిచ్చివాణ్ణి చేసేవి. ఆమె పెదవులు థిన్ గా గులాబీ రంగులో ముద్దు పెట్టుకోవాలని పించేవి. తన బుగ్గలు బూరెల్లా ఉబ్బి కొరికి తినాలనిపించేది రాజుకి.

చివరి ఎగ్సాం రోజున రాజు అర్దగంట ముందే ఎగ్సాం సెంటర్ ని చేరుకున్నాడు. అప్సానా అప్పటికే తన కోసం ఎదురు చూస్తొంది. స్కూలికి దూరంగా ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని చదువుతున్నట్టు నటిస్తు రాజు కోసమే ఎదురు చూస్తొంది. ఈ నాలుగైదు రోజులలోనే రాజు మీద ఒక అభిప్రాయం ఏర్పడింది ఆమెకు. అందుకనే మూడు రోజులగా అతనితో మాట్లాడే అవకాశం దొరుకుతుందని ఎగ్సాం సెంటర్ కి ముందుగానే వచ్చేస్తొంది. టీనేజ్ లవ్ కి కారణం అవసరం లేదు. [b]అవతలి వాళ్లలో ఆకర్షించే అంశం ఒకటి ఉంటే చాలు. అప్సానాలోని అందం రాజుని ఆకర్షిస్తే, రాజులోని గర్వం లేని గుణం ఆమెని [/b]ఆకర్షించింది.
రాజు చదువులోనే కాదు, ఆటల్లోనూ ముందే ఉంటాడు. స్కూల్లో అతనికి చానా మంచి పేరుంది. పేరుతో పాటే అసూయతో రగిలిపోయే చిన్నపాటి శత్రు వర్గం కూడా ఉంది. అయినా అందరితో కలిసిపోయే గుణం రాజుది. ఇవన్నీ అప్సానా తన ఫ్రెండ్స్ తో రాజు ఫ్రెండ్స్ దగ్గర తెలుసుకుంది. మొదట తాను ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలనిపించిందో తనకే తెలీదు. తెలుసుకున్న తరవాత అతనంటే ఇష్టపడుతున్నానన్న అభిప్రాయానికి వచ్చేసింది.
రాజు ఆ చెట్టుకిందకు చేరుకునే పాటికి, ఆమె కూర్చున్న రాతి మీద అతనికి కొంత జాగా ఇచ్చింది. ఆ రాయి మీడియం సైజులో ఉంది. ఇద్దరు సర్దుకుని కూర్చోవచ్చు.మామూలుగా అయితే రాజు వేరే రాతి మీద కూర్చునే వాడు.ఆమె తాను కూర్చునే రాతిలో తనకి కొంత ప్లేస్ ఇచ్చే పాటికి రాజుకి కొంత ధ్యైర్యం వచ్చింది.
“ఎలా చదివావు ఫైనల్ ఎగ్సాం కి” మామూలుగానే పలకరించాడు.
“బాగానే చదివాను” అని కొంచెం అన్ కంఫర్టబుల్ గా ఉండే పాటికి జరిగి కూర్చుంది.
రాజు అది గమనించి “నీకు కంఫర్టబుల్ గా లేకపోతే నేను . . . . ” అని పైకి లేయబోయాడు.
ఆమె రాజు చేతిమీద చేయి వేసి ఆపేసింది. “ఇక్కడే కూర్చో ” అని చేతిని కొంచెం గట్టిగా పట్టుకుంది.
కొద్ది క్షణాల పాటు రాజు గుండే వేగం పెరిగింది. ఆమె మాత్రం తల దించుకుని బుక్ వైపే చూస్తొంది. ఆమె బుగ్గల్లో చిన్న పాటి ఎరుపు దనాన్ని రాజు గమనించాడు. ఆమె జబ్బలకి తన జబ్బలు తగిలేలా కొంచెం జరిగి కూర్చున్నాడు. అప్సానా కూడా ఇంకొంచెం దగ్గరికి జరిగి కూర్చుంది.ఇద్దరు ఏమి మాట్లాడుకోవడం లేదు కానీ ఒకరి శరీర స్పర్సని ఒకరు అనుభవిస్తున్నారు. రాజు వాతావరణ మార్పుని ముందుగానే గమనించి
“ఇంగ్లిష్ లో ఇంత పెద్ద పెద్ద ఎస్సేలు ఎలా రాయగలుగు తారు మీరు ” అని అడిగాడు.
అప్సానా చిన్నగ నవ్వుకుని సమాదానం చెప్పబోయింది. ఆమె నవ్వినప్పుడు ఎరుపెక్కిన ఆమె బుగ్గలు చూసి
“ఇ లైక్ యుర్ స్మైల్ ” అని అన్నాడు. ఆ పొగడ్తకి అప్సానా పొంగిపోయింది సమాదానంగా మల్లీ నవ్వింది.
“నిజంగా . . . . నువ్వు నవ్వితే చానా అందంగా ఉంటావు. ముఖ్యంగా ఈ బుగ్గలు . . . . ” అని ఆమె బుగ్గ నిమిరాడు.

మెత్తనైన ఆమె బుగ్గ నిమిరుతుంటే రాజు అంతులేని ఆనందానికి లోనయ్యాడు. అప్సానా మాత్రం రాజు చెయ్యి బుగ్గ మీద పడగానే విస్తుపోయింది.ఆ తరవాత సిగ్గు పడిపోయింది. ఆమె సిగ్గు పడగానే రాజు గుండే వేగం పెరిగింది. ఆమె బుగ్గను తాకకుండా ఉండే అందుకు చానా ప్రయత్నించాడు.ఎందుకంటే వాళ్లు మెయిన్ రోడ్డుకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్నారంతే. ఒక్కోక్కరే స్టుడెంట్స్ సెంటర్ కి చేరుకుంటున్నారు. ధైర్యం చేసితానేమైనా చేసి అదెవరైనా చూస్తే ఆ అమ్మాయి పరువు పోతుంది. అందుకనే ధైర్యం చేయలేక పోయాడు కానీ మనస్సులోని కోరికని బయటపెట్టేశాడు.
“ఎగ్సాం అయిపోతానే యాడికి పోతావ్. . . . . ”
“ఇంకెక్కడికి పోతాను . . .ఇంటికి. . . ”
“నాకు నీతో ఒంటరిగా మాట్లాడాలనుంది”
“ఎగ్సాం అయిపోగానే ఇంటికి వెల్లిపోతాను. . . . ”
“నాకోసం ఒక పది నిమిషాలు కూడా. . . . ఉండలేవా. . . . ” బ్రతిమలాడినట్టు మాట్లాడాడు.
రాజు అలా అనగానే అప్సానా కొంచెపు ఆలోచించింది. తరవాత తల అడ్డంగా ఆడిస్తూ
“ఎగ్సాం అయిపోగానే నూర్జహాన్ తో కలిసి ఇంటికి వెళ్లిపోవాలి. లేకపోతే మా అమ్మీ చంపేస్తుంది. ఇలా ముందు రావడానికే చానా
కష్టమయ్యింది. ఇంక లేటుగా ఇంటికి పోతే ఇంకంతే” అని చెప్పింది.
“నూర్జహాన్ తో పాటు వాళ్ల అన్న వస్తాడు. . . . అస్సలు కుదరదు. . . . అయినా ఎందుకు పది నిమిషాలు”అని అడిగింది.
రాజు కొంచెం తడబడ్డాడు. అయినా ధైర్యం చేసి
“నీ బుగ్గలు ముద్దు పెట్టుకోవాలనుంది. ” అని ఆమె బుగ్గల వైపు ఆశగా చూశాడు.
అప్సానా గట్టిగా నవ్వేసింది.
“ఒక్కసారి . . . . ” అని మీదకు వంగ బోయాడు. ఆమె అతని మూతిని పక్కకు జరిపేసింది.
అంతలోనే రాజు ఫ్రెండ్స్, అప్సానా ఫ్రెండ్స్ ఆ చెట్టుకిందకు చేరిపోయారు. ఆ తరవాత టాపిక్ ఎగ్సాం వైపు మారిపోయింది.
ఎగ్సాం హాల్ లో కూర్చోగానే “ఎగ్సాం అయిపోయిన తరువాత కదిరిలోనే ఉంటావా “అని అడిగాడు రాజు.
“లేదు మా అన్న దగ్గరికి హైదరాబాదు పోతాను” అని చెప్పింది.
“ఎప్పుడు పోతావ్ ”
“రేపే. . . .”
“ఒక్క రోజు కూడా ఉండవా . . . . ఇక్కడ”
“లేదు. . . . . ”
“మల్లీ ఎప్పుడొస్తావ్ . . . . ”
“తెలీదు. . . . ”
“మల్లా ఎప్పుడైనా మాట్లాడాలంటే. . . . ”

ఆ సమాదానం వచ్చే లోగా క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఎగ్సాం అయిపోయెంత వరకు తను మాట్లాడింటే ఒట్టు.
నవ్వుతూ రాజుని ఉడికిస్తూనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *