శుభస్య శీఘ్రం” అని ఊపిరి వదలకుండా ఏకబిగిన చెప్పింది. ఆమె చెప్పినట్లే వేయి రూపాయిలతో అవధానితో పని కానించేశాడు. పెళ్ళయి పోయింది. కాని చిక్కంతా ఫాస్ట్ నైట్ దగ్గరే వచ్చింది. ముహూర్తం రోజున అలా అయిపోవడంతో నెల రోజులు వాయిదా పడింది. సత్యనారాయణరావుకి మొత్తం నలుగురు ఆడపిల్లలు మగపిల్లలు లేరు. సుజన చిన్నపిల్ల మిగిలిన ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళ వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. శోభనం ఇలా వాయిదా పడటంతో సుజన అక్కయ్యలు ముగ్గురూ ఊర్లకు బయల్దేరితే సత్యనారాయణరావు వాళ్ళను ఆపేశాడు.
“శోభనం ముచ్చట జరక్కుండా మీరు వెళ్ళడానికి లేదు. పిల్లలకు చదువుపోతుందంటే అల్లుళ్ళతో పిల్లల్ని పంపేయండి. రాక రాక వచ్చారు. ఆ ముచ్చటా తీరాక నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని దిగబెడతాను.సుజన కుర్చీలో సర్దుకొని కూర్చుంది. నిరుపమ ఆ జ్ఞాపకాలన్నిటినీ మనసు పొరల్లోంచి బయటికి లాగినట్లు అటూ ఇటూ కదిలి చెప్పటం ప్రారంభించింది. “నాకు అప్పుడు ఇరవయ్ రెండేళ్ళు. ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. పీజీ చెయ్యాలనిపించలేదు. చదువు బోర్ కొట్టేసింది.
చదువు బోర్ కొట్టిందంటే మరేదో కావాలనిపిస్తూ వుందన్నమాట. ఏదో తెలియని ఆరాటం ప్రారంభమయింది. ఇదీ అని చెప్పలేను గానీ జీవితంలో ఏదో మార్పు కావాలని కోరుకుంటోంది మనసు. ఎవరితోనో గాఢంగా మాట్లాడాలని, అతని కోసం ఎదురుచూడాలనీ, పిండివంటలు తినిపించాలనీ, వెన్నెల్లో ఆరుబయట మంచం మీద కూర్చుని కబుర్లు చెప్పాలనిపిస్తోంది. ఎంఏ చదవటానికి ఆర్ధికరీత్యా కూడా కష్టం కావడంతో మా నాన్న కూడా నన్ను బలవంతం చేయలేదు. అమ్మా, నాన్నలకు – నేను, మా అన్నయ్య సంతానం. మా పొలంకాక మరో అయిదు ఎకరాలు లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు వాడు. వ్యవసాయమే మాకు వృత్తి. మంచి సంబంధం వచ్చిందని మొదట మా అన్నయ్యకి పెళ్ళి చేసారు. మా వదిన కాపురానికి వచ్చింది. ఆమె నాకంటే రెండేళ్ళు చిన్నది.
