రావోయి మా ఇంటికి! 615

ఆమెను అతి స్పీడ్ గా క్రాస్ చేసి, హారన్ మోగించేవాడు. బస్సెక్కేవరకు బస్టాప్ ఎదురుగా వున్న టీ బంక్ లో కూర్చుని అదేపనిగా కాఫీలు, సిగరెట్లు తాగుతూ చూపులను నిలబెట్టేవాడు. తనను ఎవరయినా గమనిస్తున్నారేమోనని పరిశీలించే ఉత్సుకత సాధారణంగా ఎవరికైనా వుంటుంది. కానీ సుజనలాంటి ఏ కొద్దిమందో అలాంటివాటిని అధిగమించి వుంటారు. అందుకే ఆమె అతని ప్రవర్తనను గమనించలేకపోయింది. ఆమె అలా వున్నా ఇతనేమాత్రం పట్టించుకోలేదు. మామూలు కుర్రాడయితే అంతటితో ఆపేసి వుండేవాడు. కానీ చిట్టిబాబు మాత్రం అలా కాదు. ఏదయినా సరే తనకు అందేవరకు అతను పట్టు వదలడు. కొన్నిరోజులకి హారన్ మోగించడానికి బదులు “హాయ్” అని వెనకనుంచి పిలవడం మొదలుపెట్టాడు. అప్పటికి అర్ధమైంది సుజనకు. అతను తను ఎదురింటిలో వుండే వాడని తెలిసింది. అతను శ్రుతిమించకుండా కాస్తంత నిర్లక్ష్యంగా ప్రవర్తించేది.

దీన్ని అతడు సహించలేకపోయాడు. చిన్నప్పట్నుంచి ఏది కోరుకున్నా క్షణంలో ముందుండేవి. అదే మెంటాలిటీ అతనిలో కంటిన్యూ అయింది. ఆమె పట్టించుకోక పోవడంతో పట్టుదల మరింతగా పెరిగింది. ఆమెను ఆకర్షించడానికి రకరకాల పద్ధతుల్ని అవలంభించాడు. మా నాన్న అప్పటికి ఊపిరి పీల్చుకున్నాడు కట్నం లేదనగానే ఆయన ఉత్సాహంగా మాట్లాడాడు. మేం పడుకునేసరికి రాత్రి పదకొండు గంటలయింది. పదిరోజులు గడిచాయో లేదో పెళ్ళివారు దిగారు. పెళ్ళివారంటే ఎంతోమంది లేరు. పెళ్ళికొడుకూ, అతని తల్లీ, మధ్యవర్తీ వచ్చారు. పెళ్ళికొడుకుని చూడగానే నేను పులకరించిపోయాను. చాలా అందంగా వున్నాడు. ఎర్రగా, నాజూగ్గా అచ్చు సినిమా హీరోలా వున్నాడు.

ఆ నూనూగు మీసాలు తీసేస్తే ఆడపిల్లలా వుంటాడనిపించింది. అంత స్మూత్ గా వున్నాడు. చదివింది పదో తరగతి అయినా ప్యాంటూ, షర్టూ టక్ చేసుకుని స్టయిల్ గా వున్నాడు. నేను ఎదురుపడ్డప్పుడంతా తల వంచుకున్నాడు. అతని బిడియము చూసి నేను చాటుగా నవ్వుకున్నాను. ఆడపిల్లలా సిగ్గుపడడం చూసి ఆనందించాను. అతన్ని ఏడిపించాలని మరీ మరీ ఎదురుపడ్డాను. వాళ్ళు వెళ్లి ఉత్తరం రాశారు. పెళ్ళికూతురు నచ్చిందనీ, ఏదో ఉన్నంతలో నగలు పెట్టి, పెళ్ళి జరిపిస్తే చాలని అబ్బాయి తల్లి ఉత్తరం రాసింది. మా వాళ్ళూ ఒప్పుకున్నట్లు ఉత్తరం రాశారు. మా పెళ్ళి రావూరులోనే సింపుల్ గా జరిగిపోయింది. దానికైనా నాన్న శ్రమ పడాల్సి వచ్చింది. పెళ్ళి అయిందంటే అయిందనిపించేశాడు. “వద్దన్నారు” “వద్దన్నా – ఇలాంటప్పుడు వూరకుండకూడదు.