రావోయి మా ఇంటికి! 616

పెళ్ళిచూపుల్లో ఆ అయిదు నిముషాల్లో చూసిన రూపం ఏం గుర్తుంటుంది? కానీ శ్రీనాథ్ ని పదే పదే కళ్ళ ముందుకు తెచ్చుకునేదాన్ని. అయిదుగంటల ప్రాంతాన కిందకు దిగింది. అప్పటికే స్వామితో పాటు అందరూ ఫ్రెష్ గా హాల్లో కూర్చుని వున్నారు. ఆత్మ, పరమాత్మ గురించి స్వామి అనర్గళంగా ఉపన్యాసం ఇస్తూంటే అందరూ తన్మయత్వంతో వింటున్నారు. ఇక అప్పుడు అమ్మని పిలిచినా రాదని తెలియడం వల్ల తనే వంట గదిలోకి వెళ్ళింది. ఫ్లాస్కులోని కాఫీ పోసుకుని తాగి, ఆ తరువాత స్నానం ముగించింది. అనాలోచితంగానే నీలంపూలున్న తెల్లటి షిఫాన్ చీర కట్టుకుంది. అదే డిజైన్ జాకెట్ లో ఆమె సాయంకాలం పూట విచ్చుకున్న మల్లెపూల దండలా వుంది.

అమ్మావాళ్ళు ఏ పొజిషన్ లో వున్నారో చూడడానికి తిరిగి హాల్లోకి వచ్చింది. ఆమెని చూడగానే స్వామి సోఫా మీద అటూ ఇటూ కదలడం ఎవరూ గుర్తించలేదు. అప్పుడే ఉపన్యాసం ముగిసింది. స్వామితోపాటు అందరూ లేచారు. “అబ్బీ! హోమానికి ఏర్పాట్లు చేద్దాం. ఇప్పటికే సమయం మించి పోయింది” అన్నాడు స్వామి. “అలానే స్వామీ” సత్యనారాయణ తల ఆడిస్తూ చెప్పాడు. చాలాపెద్ద తతంగమే జరిగేటట్లు లేదనిపించింది సుజనకు. అందుకే అసలు ఏం జరుగుతూ వుందో తెలుసుకోవాలని పెద్దక్క ఉమతోపాటు బయటికి నడిచింది. “ఏమిటే యాగం గీగం అంటున్నాడు స్వామి?” అని అడిగింది బావిలోంచి నీళ్ళు తోడడానికి ఉపక్రమిస్తున్న ఉమని.

“అదంతా చెప్పే టైం లేదు. సింపుల్ గా చెబుతాను విను. ఈ రాత్రి తొమ్మిది గంటలకు రుద్ర మార్తాండ యాగం చేస్తారట స్వామి. మనింట్లో నాన్న దగ్గరున్న పుస్తఃకాలు చాలా పవర్ ఫుల్ అట. వాటి పవర్ వల్ల ఇంట్లో శక్తంతా హరించుకుపోతుందట గంగమ్మ. అలానే వుంటే ప్రపంచం మాడిపోతుందని వెంటనే ఓ చెంప నరికేస్తారు. చూడు అలాంటిదన్న మాట. అంత పురాతనమైన, శక్తివంతమైన పుస్తకాలను కొయ్యపెట్టెలో దాచి వుంచినందుకు నాన్నను చీవాట్లు పెట్టారు స్వామి. దేవిని ఉపాసించాలేగానీ, ఉంచుకోకూడదురా అంటూ మెత్తగా గడ్డి పెట్టారు.