రావోయి మా ఇంటికి! 615

ఉత్తరంలో నన్ను అడిగినట్లు చెప్పమని రాశాడు. ఆ చిన్న వాక్యం రేపుతున్న అలజడి మాత్రం పెద్దగానే వుంది. జోరీగ రొద కూడా ఆగిపోయింది. రాత్రి మరింత చిక్కబడింది. ఆకాశం వెంట నడిచెళుతున్న గంధర్వ కన్యల కాళ్ళకున్న వెండి పట్టీలు రాలిపడిపోయినట్లు చుక్కలు బారులు తీరున్నాయి. కిటికీ అంత ఆకాశం మల్లెపూలు వాడిపోకుండా చుట్టి వుంచడానికి వుంచిన నల్లటి వస్త్రంలా వుంది. అదిగో… అప్పుడు వినిపించింది సైకిల్ బెల్. నా గది కిటికీ అవతలే ఎవరో సైకిల్ బెల్ మొగిస్తున్నట్లు గ్రహించాను. భయంతో గుండె కుంచించుకుపోయింది. కిటికీ కింది రెక్కలు తీసి చూద్దామంటే ధైర్యం చాలడం లేదు.

దిగ్గున లేచి కూర్చున్నాను. “పరంజ్యోతీ…..పరంజ్యోతీ” మెల్లగా ఎవరో పిలుస్తున్నారు. ఆ గొంతును పోల్చుకోలేకపోయాను.”నిజమే కానీ – మా నాన్న విషయం నీకు తెలుసుకదా. ప్రతీదీ శాస్త్రోక్తంగా జరగాలంటాడు. అందుకే నెలరోజులు వాయిదా పడింది” “ఏమిటో మనిషి బతుకు! జీవితం అంత సంక్లిష్టమయింది మరొకటి లేదు. ఒక మనిషి సమస్యలకూ, మరొక మనిషి సమస్యలకూ పొంతన వుండదు. నీ శోభనం ఒక కారణం చేత ఆగిపోతే మరొకరిది మరో సమస్యవల్ల వాయిదా పడుతుంది. శ్రీనిజ అనే మా బంధువుల అమ్మాయిది మరో రకం సమస్య?” “శ్రీనిజ ఎవరు? ఏమిటామె సమస్య?” సుజన ఉత్సాహంగా అడిగింది. “శ్రీనిజది మా పక్క ఊరే. మా పెదనాన్న కూతురు.

పెద్దనాన్న పెళ్ళి కాగానే అత్తవారింటికి ఇల్లరికానికి వెళ్ళాడు. ఇక అక్కడే సెటిలయిపోయాడు. ఆయనకీ ఒక్కటే కూతురు శ్రీనిజ. ఇంటర్ వరకు చదువుకుంది. ఆపై చదవటానికి తగిన వసతులు లేకపోవడంతో చదువు మానిపించేశారు. మరో రెండేళ్ళకు ఆమె పెళ్ళి ఫిక్సయింది. పెళ్ళి కొడుకుది మంగళగిరి. నెల్లూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్. పేరు అమర్. చూడటానికి అందంగా స్టయిల్ గా వుండేవాడు. పెళ్ళయిపోయింది. అతనికి అమ్మాయిలంటే సిగ్గో, భయమో తెలియడం లేదుగానీ ఆడపిల్లలకు ఆమడ దూరంలో వుండేవాడు. ఎప్పుడయినా ఎవరితోనయినా మాట్లాడాల్సొస్తే వణికిపోయేవాడు. సక్రమంగా నోటంట మాట వచ్చేది కాదు. ఆడపిల్లలకి ఎదురైనా ఠక్కున తలవంచుకునేవాడు.