రావోయి మా ఇంటికి! 616

బాగా కలుపుగోలుగా వుండేది. మా ఇంట్లో ముందు వరండా కాక రెండే గదులు. మొదటి గది మా అన్నయ్యా వాళ్ళు వాడుకునే వాళ్ళు.ఇంతకీ వడ్డాణం ఎక్కడ పోయిందో ఎంత గింజుకున్నా తట్టడంలేదు. కారులో సత్రం నుంచి బయల్దేరాక నెల్లూరులో ఓ టీ బంక్ దగ్గర ఆగాం. ఆ తర్వాత గుడి దగ్గర దిగాం. ఈ రెండుచోట్లే పడిపోయే అవకాశం ఉంది. ఇది తెలుసుకున్న అన్నయ్య అదే కారులో నెల్లూరు బయల్దేరాడు. నాన్న, మరో నలుగురు లాంతర్లు తీసుకుని కాలినడకన వెళ్ళారు. అందరం వాళ్ళకోసం చూస్తూ ఏడుస్తున్నాం ఎవరికయినా శోభనం మాట గుర్తు వచ్చుంటే ఒట్టు. పెళ్ళికొడుకును పట్టించుకొనే నాధుడు లేడు. పెళ్ళి పందిట్లో నానా జోక్ లు వేసిన అతను యింత బాధలో ఒక్కసారయినా వచ్చి పలకరించలేదు.

దాంతో అతనిమీద నాకు విపరీతమయిన కోపమూ, అసహ్యమూ కలిగాయి. వడ్డాణం పోయిందని వినగానే నా దగ్గరికి వచ్చి ‘పోతే పోయిందిలే డియర్ ఆఫ్ట్రాల్ అదెంత? రేపు సాయంకాలానికి కొత్తది తీసుకొచ్చి రాయుడి ముఖాన కొడదాం’ అని అతను అని వుంటే హీరోలా ఫీలయ్యేదాన్నేమో. మనకు ఎంత వయసొచ్చినా కొన్ని భ్రమలు పోవు. ఆయన కేవలం చిన్న ఉద్యోగి అనీ, ఎనభయ్ వేల రూపాయలను చెల్లించడం అతడికి అసాధ్యమనీ నాకు తట్టలేదు. ఆ విషాదం నుంచి ఎంత తొందరగా బయటపడతామా అన్న ఆత్రుత తప్ప మరొకటి లేదు. క్షణం క్రితం హీరోలా కనిపించిన అతను ఇప్పుడు జీరోలా అనిపించాడు. పరిస్థితుల ప్రభావం అలాంటిది.

బాధతో, టెన్షన్ తో ఎవరికీ నిద్ర రావడం లేదు. అలా గుడ్లప్పగించి చూస్తోంది అమ్మ. వదిన ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారిపోయింది. మా మేనత్త అయితే శవం ముందు కూర్చోని ఏడుస్తున్నట్లు ఏవేవో చెప్పి ఏడుస్తోంది. ఇక నాసంగతి చెప్పనక్కరలేదు. నెల రోజుల నుంచీ లంఖణాలు చేస్తున్నట్లు తీసిపోయాను. ఒంటిగంటప్పుడు మా అన్నయ్య వచ్చాడు. అందరం ఒక్కసారిగా చుట్టూ మూగాం.ఎప్పుడైనా సినిమాకు వెళ్ళినా పేర్లు రాగానే నిద్రపోయి, శుభం అన్న అక్షరాలు వచ్చినప్పుడు ఎవరో తట్టి లేపితే లేస్తాం. గంగాభవానీ అందరిలోకి మరీ అమాయకపు పిల్ల. ఒక్కర్తో కలిసేది కాదు. తన పని తప్ప మరొకటి పట్టదు. అమాయకత్వం ఆపిల్లకు ఆభరణంలా అమరింది. ఇలాంటి గంగాభవానీకి పెళ్ళి కుదిరింది. పెళ్ళి కొడుకు ఏదో ఆఫీసులో అటెండర్.