కావలెను – Part 3 102

“పక్కింటాయన ఊర్కోడు… ఒళ్లు చీరేస్తాడు” అంది అనిమిష.

రాత్రి పదకొండు అవుతుండగా అనిరుద్ర అనిమిష గది దగ్గరకొచ్చి, పిలిచాడు. అనిమిష తలుపు తీసి, ‘ఏంటి?’ అని అడిగింది.

“నోటితే చెప్తేగానీ నీకు సమ్మగా ఉండదా? బాత్రూమ్ కి వెళ్లాలి” కోపంగా చూసి.

“వెళ్లండి” అంది పక్కకు జరిగి.

“ఎలా వెళ్లను. గుడ్డి ముండావాడిని తీస్కెళ్లు” అన్నాడు అనిరుద్ర.

“నేనా.. ఛఛ… నేను తీసుకెళ్లను”

“అయితే కళ్ల గంతలు, చేతికి వున్న కట్లు విప్పు”

అనిమిష అతణ్ణి బాత్రూమ్ దగ్గరకి నడిపించుకుంటూ వెళ్లి, అతని చేతికి వున్న కట్లు విప్పింది. అయిదు నిమిషాల తర్వాత బాత్రూమ్లో నుండి బయటకు వచ్చాడు. మళ్లీ అతని చేతుల్ని కట్టేసింది. తాపీగా నడుచుకుంటూ బయటికెళ్లాడు అనిరుద్ర.

“అదేంటి… కళ్లకు గంతలు కట్టినా అలా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్తున్నావ్…’

“అలవాటైంది… అన్నట్టు ఓ విషయం తెలుసుకో… కళ్ల గంతలు, చేతులకు , కడితే సరిపోదు. మనసుకు గంతలు కట్టుకోవద్దు” తన గదిలోకి వెళ్తూ చెప్పాడు అనిరుద్ర..

ఇంకెప్పుడూ అలా కళ్లకు గంతలు కట్టకూడదని, చేతులు కట్టి పడేయకూడదని నిర్ణయించుకుంది అనిమిష.

***

ఆఫీసు వదిలే సమయానికి వచ్చింది ద్విముఖ. .

“కొత్త కాపురం ఎలా ఉంది?” అడిగింది ద్విముఖ క్యాంటీన్లో కూర్చొని సమోసా తింటూ.

“నాకేం కొత్తగా అనిపించడంలేదు.. నీ బదులు అతను… కాకపోతే ఒక్కోసారి నాకే గిల్టీ ఫీలింగ్…”

“నీలో గిల్టీ ఫీలింగ్ మొదలైందీ అంటే అనిరుద్ర మీద సాఫ్ట్ కార్నర్ డెవలప్ అవుతోందన్నమాట… నువ్వు అతడి ప్రేమలో పడిపోతున్నావన్నమాట” అంది ద్విముఖ.

“ఛఛ… అలాంటిదేమీ లేదు”

“లేదని నీ నోరు చెప్తోంది. ఉందని నీ బుగ్గలోని ఎరుపు చెప్తోంది. ఇంతకీ నీ పని ఎంతవరకు వచ్చింది?”

“చాలావరకూ అయిపోయినట్టే.. అనిరుద్ర పేరు మీద బైక్ తీసుకోవాలని మా బాస్ ను ‘లోన్’ అడిగాను. అనిరుద్రతో మాట్లాడికానీ లోన్ శాంక్షన్ చేయనని చెప్పాడు. ఈ విషయం అనిరుద్రకు చెప్పాలి. ఆయన్నెలా కన్విన్స్ చేయాలో అర్ధంకావడంలేదు. పైగా చెక్ ఆయన పేరుతోనే ఇస్తాడట”

“పోనీ అనిరుద్రతో నేను మాట్లాడనా?” అంది.

“వద్దోద్దు… బావోదు… అతను అపార్ధం చేసుకుంటాడేమో” “ఏం చేస్తావ్?”

“ఏదో విధంగా నేనే మేనేజ్ చేస్తాను”

3 Comments

  1. I have read this type of novel after a long time. Really very good. Continue writing such novels. I wish you all the success.

Comments are closed.