కావలెను – Part 3 102

“నాకూ అలానే ఉంది. బెంగుళూరులో ఫైనల్ ట్రీట్ మెంట్ మొదలైంది. వన్ ఆర్ టూ వీక్స్లో సర్జరీ మొదలవుతుంది. ఈలోగా మొత్తం ఆరు లక్షలు సమకూరాలి. లోన్స్, అడ్వాన్స్లు, శాలరీ… అన్నీ కలిపి మూడు లక్షలు దాటలేదు” బాధగా నిట్టూర్చి చెప్పింది.

“చూద్దాం… మీ బాస్ ని పర్సనల్ లోన్ కూడా అడిగావ్గా”

“ఏం చేస్తాడో ఏమో… టైం తక్కువగా ఉంది” అంది అనిమిష.

“అనిరుధ్రను అడక్కూడదనే డిసైడ్ అయ్యావుగా” ” “అవును… ఆయన అదో టైప్ మనిషి”

“ఇంతకీ ఇంతవరకూ ‘అది’ లేదా?” అడిగింది లోగొంతుకతో ద్విముఖ.

“అదేంటి.. అదంటే… ఏది?” ముందు అర్ధంకాక అడిగింది అనిమిష.

“అదంటే ‘అదే’… మీ ఆయనతో “అది” అంది ద్విముఖ.

ఎర్రబడ్డ మొహంతో తలదించుకొని, “ఏదీ లేదు. అయినా ఆయన చేస్తోంది హజ్బెండ్ జాబ్… అందులోనూ టెంపరరీ..” చెప్పింది.

“పర్మినెంట్ చేసెయ్… ‘అది’కి ఒప్పుకుంటే పర్మనెంట్ అయిపోతుంది”

“నాకిప్పుడు వేటి మీదా ఎలాంటి ఆశలు లేవు” అంది అనిమిష ఓ విషాద వీచిక ఆమెను ఆవరిస్తుండగా.

***

అనిరుద్ర కూరగాయలు తరుగుతున్నాడు. అనిమిష అతనికి హెల్ప్ చేస్తోంది.

“ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలు పేముంది. అన్న పాట నిజమే కదూ…” అడిగింది అనిమిష.

“కాదు… అసలు ఆడుతూ పాడుతూ పని ఎలా చేస్తారు? నీలా ఆ కూరగాయలు అటూ ఇటూ కెలకడం తప్ప” అన్నాడు అనిరుద్ర..

“మీకు వంకరగా తప్ప చక్కగా మాట్లాడ్డం రాదా?” ఉక్రోషంగా అంది అనిమిష.

“హలో… మనకు మాట్లాడ్డమే వచ్చు. అది ఎవరితో… ఎప్పుడు… ఎలా… ఎందుకు… ఏ స్టయిల్లో… ఏ పాట్రన్లో… ఏ విధంగా మాట్లాడాలో అన్నది ఎదుటివాళ్లను బట్టి డిసైడ్ చేసుకుంటాను”

“ఏంటి… ఏలు ఎ ఏలు ఉపయోగించారు. ప్రాస కోసమా…” అంది అనిమిష.

అప్పుడే ద్విముఖ వాళ్లిద్దరిని దగ్గరగా చూసి, “సారీ… డిస్ట్రబ్ చేశానా… తర్వాతొస్తాన్లే” అంది వెనక్కి వెళ్లబోతున్నట్టు నటిస్తూ,

“అంతొద్దు. వచ్చేయండి… ఇక్కడ అలాంటి ‘అది’ ప్రోగ్రామ్స్ ఏమీ జరగడంలేదు. అసలు మీ ఫ్రెండ్ ‘ఇదికే ఒప్పుకోవడం లేదు. ఇక ‘అది’కేం ఒప్పుకుంటుంది?”

“ఇది’ అంటే ఏది?”

“అది”కి ముందు ‘ఇది’… అబ్బ… చెప్పాలంటే నాకు సిగ్గు” అన్నాడు అనిరుద్ర.

“ఇదిగో ఇలాంటి తింగరి వేషాలే వద్దు. బీ సీరియస్… అయామ్ యువర్ బాస్..”

“నేనింకా బ్రాస్ అనుకున్నాను. సారీ… బ్రా..స్” అన్నాడు అనిరుద్ర.

ద్విముఖ నవ్వుతోంది. అనిరుద్ర ద్విముఖ వంక చూస్తూ, “ఎంత బాగా నవ్వుతున్నారు… నవ్వడం కూడా ఓ ఫైన్ ఆర్ట్… అందులో ఆడవాళ్ల నవ్వులకు అర్ధాలే వేరేలే” అన్నాడు అల్లరిగా.

“ఏంటీ… నవ్వుల్లో కూడా ఆడ.. మగ… నవ్వులుంటాయా?”

“వైనాట్… మీకో విషయం తెలుసా? మగవారికన్నా ఆడవారే 126 శాతం ఎక్కువగా నవ్వుతారట. ఓ పరిశోధనలో తేలిన అంశం. కాకపోతే మగవాళ్లు సెక్సీ జోకులను ఆస్వాదిస్తారు.

ఆడవాళ్లు అలాంటివాటి పట్ల ఆసక్తి చూపించరు. డిగ్నిటీగా వినగానే ఫ్రెష్ గా నవ్వొచ్చే జోకుతలే ఇష్టం. నవ్వితేనే ఎండార్ఫిన్లనే సహజ ఉత్పత్తి బాధానివారిణీలు పనిచేసేవి. అంతెందుకు.. బాగా నవ్వినప్పుడు మీ గుండె మీద చెయ్యి పెట్టుకొని చూసుకోండి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. నవ్వడం ఆగిపోయిన తర్వాత ముఫ్పై సెకన్ల వరకు అలాగే కొట్టుకుంటుంది”

3 Comments

  1. I have read this type of novel after a long time. Really very good. Continue writing such novels. I wish you all the success.

Comments are closed.