కావలెను – Part 2 66

ద్విముఖ అలసటతో వచ్చి సోఫాలో కూర్చుంది. “అనిమిషా… ఎక్కడికేల్లోచ్చావ్… నాకు ఒక్క క్షణం భయమేసింది తెలుసా?

“ఎందుకు?” అడిగింది అనిమిష.

“ఎందుకేమిటి… ఆరునెలల్లో యాభై నాలుగు హత్యలు, అరవై ఆరు హత్యాయత్నాలు, ఎనిమిది బందిపోటు దొంగతనాలు, తొంభై దోపిడీలు, నూట అరవై రెండు స్నాచింగ్లు జరిగాయి. ప్రపంచంలో నిమిషానికో రేప్ జరిగే దుస్థితిలో ఉన్నాం. నువ్విప్పటి వరకు రాకపోతే కంగారు ‘వేయదా?” అనిమిష రియాక్షన్స్ అబ్జర్వ్ చేస్తూ అంది ద్విముఖ.

“నూటికి పదిమంది మాత్రమే ఇళ్లల్లో ఉంటారు. మిగతా తొంభై మంది రోడ్లమీదో, ఆఫీసుల్లోనో, షాపుల్లోనో, బార్లలోనో ఉంటారు. భయపడుతూ ఎక్కడికీ వెళ్లకుండా ఎలా ఉండగలం?” నవ్వి చెప్పింది అనిమిష.

“అంతేకానీ ఎక్కడికి వెళ్లావో… ఎందుకెళ్లావో… ఎందుకాలస్యమైందో మాత్రం లాభం లేదు. రహస్య కెమెరాతో నిన్ను ఫాలో అయి ఏదో ఓ రోజు ఆ నిజం నేనే తెలుసుకుంటాను అంది ద్విముఖ.

“ఆపరేషన్ ద్రౌపది…” అని పేరు పెట్టు…” నవ్వి సజెస్ట్ చేసింది అనిమిష.

ద్విముఖ అనిమిష వంకే చూస్తోంది. అనిమిష మొహంలో ఏ భావం కనిపించడంలేదు.

“నాకు నిద్ర వస్తోంది… గుడ్ నైట్” అంటూ మంచం మీద అడ్డంగా పడుకుండిపోయింది అనిమిష బలవంతంగా కళ్లు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నించింది.

కళ్లు మూసుకుంటే నిద్ర రాదు. కల వస్తుంది. కలతను వెంట పెట్టుకొని పీడకల వస్తుంది. కళ్లు మూసుకుంటే కనిపించేది యాక్సిడెంట్.

***

“ఏయ్ భావనా… అనిమిష ఇంకా రాలేదుగా” నిఖిత మెల్లగా అడిగింది.

“రాలేదు… అయినా మన బాస్ కు అనిమిష ఎగ్జాంప్సనే కదా… అనిమిషను చూడగానే మన బాస్ మొహం చూడాలి…. దీపావళి రోజు రంగు రంగుల బల్బులతో షాపులు అలంకరిస్తారు చూడు… అలా ఉంటుంది” అంది భావన.

“థర్టీ ప్లస్ అయినా పెళ్లి చేసుకోలేదు. థర్టీకి దగ్గరవుతోన్న నాకు పెళ్లి కావడంలేదు” భావన విచారంగా చెప్పింది.

“పోనీ బాస్ ని ట్రై చేయరాదూ… అప్పుడైతే నేను ఏకంగా మధ్యాహ్నమే వచ్చి సంతకం చేసి వెళ్లొచ్చు” అంది నిఖిత.

“ట్రై చేయడాలు… లైన్లు వేయడాలు నాకు ఇష్టం ఉండదు. అయినా నాకు కన్నో కాలో వంకర అయి పెళ్లికావడంలేదన్న సమస్య లేదు… కేవలం నా హైటే సమస్య…” కాసింత విచారంగా మొహం పెట్టి అంది భావన.

“అవునవును… నీకో విషయం తెలుసా భావనా? బాస్ నీ పక్కన నిలబడితే… నువ్వే హైట్ అనిపిస్తావ్”

“అందుకే హైహీల్స్ మానేశాను. ఫ్లాట్ చెప్పులే వేసుకుంటున్నాను” చిన్నగా నవ్వి అంది భావన.

“అవును నాకో డౌట్… మగవాళ్లు హైట్… ఆడవాళ్లు పొట్టిగానే ఎందుకుండాలి అలాంటివాళ్లనే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారా?”

“ఏమో… ఓ నవల్లో చదివిన గుర్తు… ఓ క్యారెక్టర్ నాలాంటి క్యారెక్టరే… దేవుణ్ణి వేడుకుంటుంది. ‘దేవుడా… వచ్చే జన్మలో అయినా నన్ను పొట్టిగా పుట్టించు లేదా ఈ మగవాడి మనసులో విశాలమైన భావాలనైనా పుట్టించు’ అని, నాలాగే తనకూ హైట్ ఓ ప్రాబ్లెమ్…” భావన అలా మాట్లాడుతున్నప్పుడు ఆమె గొంతులో విషాదంతో కూడిన జీర ధ్వనిస్తోంది.

Updated: August 12, 2021 — 2:33 pm

1 Comment

  1. Puku lagundi band cey anna

Comments are closed.