కావలెను – Part 2 66

బాదం చెట్టు కింద వున్న మంచమ్మీద కూర్చొని రెండు చేతులూ తల మీద పెట్టుకున్నాడు కార్తీక్. అతని పక్కనే తల కింద చేతులు పెట్టుకొని వెల్లకిలా పడుకున్నాడు అనిరుద్ర. మంచం మీద మొబైల్ ఫోన్. ఆ ఫోన్ ఉదయం నుండి నాన్ స్టాప్గా మోగుతూనే ఉంది.

****

“అనూ… ఎంత పనిచేశావు? నువ్విచ్చిన యాడ్ ఏమిటోగానీ ఉదయం నుండి సౌండ్ పొల్యూషన్ ఎక్కువైంది. ఫోన్ నంబర్ ఇచ్చినవాడివి నువ్వే మాట్లాడొచ్చుగా. ముందు నన్ను మాట్లాడమంటావ్. అబ్బ… నీ ఐడియా చూశాక నాకు యాడ్ ఇవ్వాలనిపించింది. అయినా మొగుడి పోస్ట్ కు ఇంత డిమాండ్ ఉంటుందా? అయినా ప్రపంచంలో ఎవరికీ రాని ఐడియాలు నీకే ఎలా వస్తాయిరా….” నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే వున్నాడు కార్తీక్.

అప్పుడే మొబైల్ ఫోన్ మళ్లీ మోగింది. కార్తీక్ భయం భయంగా మొబైల్ చేతిలోకి తీసుకొని ఓకే బటన్ నొక్కి మెల్లిగా ‘హలో’ అన్నాడు.

“నేనూ హలోనే డియర్… మా ఆయన దుబాయ్ లో ఉన్నాడు. టెంపరరీ మొగుడి పోస్టు ఖాళీగా ఉంది. చేస్తావా?” గొంతులో విస్కీ వున్నట్టు హస్కీగా వుంది అవతలి గొంతు.

కార్తీక్ బెదిరిపోయి మొబైల్ ని అనిరుద్రకు ఇచ్చాడు. అనిరుద్రకు విషయాన్ని షార్ట్ హ్యాండ్ లాంగ్వేజ్ లో చెప్పాడు. ఫోన్ కట్ చేసి నవ్వుతూ చెప్పాడు అనిరుద్ర.

“ఇలాంటివన్నీ కామన్… కొంతమంది కావాలనే టీజ్ చేస్తారు. మరి కొంతమంది ట్రయ్ చేస్తారు… అన్నట్టు మొత్తం ఇవాళ మన ఫోన్ కాల్స్ ఎన్ని?”

“దీంతో కలిపి వన్ ఫార్టీ టూ” అన్నాడు కార్తీక్.

“అంటే వన్ ఫార్టీ త్రీ… అంటే ఐ లవ్ యూకు ఒకటి తక్కువగా వుందన్నమాట…” అన్నాడు ఆ నెక్ట్ కాల్ అనిమిషదే అవుతుందన్న విషయం తెలియని అనిరుద్ర.

****

రాత్రి పదకొండు నలభై…

అనిమిష ఆలోచిస్తోంది… టేబుల్ మీద ద్విముఖ తెచ్చిన ఆవేల్టి దినపత్రిక ఉంది. అందులో అనిరుద్ర ఇచ్చిన ప్రకటన , ఉంది. అనిమిష కళ్ల ముందు యాక్సిడెంట్ దృశ్యం కదలాడుతోంది. భయానకమైన ఆ సంఘటన ఆమె మొహంలో స్వేదాన్ని అద్దింది. అలా ఆ…లో…చి…స్తూ…నే ఉంది.

పదకొండు యాభై అయిదు నిమిషాలు. యాభై ఆరు నిమిషాలు… యాభై నాలుగు నిమిషాలు…

టేబుల్ మీద వున్న మొబైల్ తీసి డయల్ చేసింది. 92462-02616 ఒక్కో నంబర్ డయల్ చేస్తుంటే ఆమె చేతి వేళ్లు సన్నగా కంపించసాగాయి. చిన్నపాటి ఉద్వేగం ఆమె మహా శరీరాలను ఆక్రమించుకుంది.

అనిరుద్ర ఆకాశం వంక చూస్తున్నాడు. అతని గుండెల మీద మొబైల్ ఫోన్. ఒక్క క్షణం చిన్నపాటి క…ద…లి…క. ఫోన్ రింగవుతోంది. టైం చూశాడు. అర్ధరాత్రి పన్నెండు గంటలు… మొబైల్ తీసి ఓకే బటన్ ప్రెస్ చేసి, ‘హలో’ అన్నాడు.

“మీరు మిస్టర్ అనిరుద్రే కదూ…” అవతల వైపు నుంచి మనసు పొరలను స్పృశించే కంఠం.

“అవుననే అనుకుంటున్నాను… ఇంతకూ మీరు…”

Updated: August 12, 2021 — 2:33 pm

1 Comment

  1. Puku lagundi band cey anna

Comments are closed.