కావలెను – Part 2 66

“ఎలా ఏమిటి… కానిచ్చేయడమే…” అంది ద్విముఖ. అనిమిష సీరియస్గా చూడడంతో “అదే నాటకం కంటిన్యూటీని కానిచ్చేయడమే. గదిలో మీరేం చేసేది వీళ్లు చూడొచ్చారా అంది.

శోభరాజ్ అనిమిషవైపు చూసి, “అనిమిషా నీకు ఎవరూ లేరని ఫీలవ్వకు… ఎటు జెడ్ అన్నీ సమకూరుతాయి. అన్నీ శాస్త్ర ప్రకారం, సంప్రదాయబద్ధంగా జరుగుతాయి” అంటూ ద్విముఖవైపు చూసి, “మనం ఆరు బయట కూర్చుని కబుర్లు చెప్పుకుందాం” అన్నాడు అంతా ఆరు బయట సెటిలయ్యారు. శోభనం గదిలో అనిమిష, అనిరుద్ర.

****

మంచం మధ్యలో కూర్చొని రెండు చేతులు చుబుకానికి ఆన్చుకొని మొకాళ్ల మధ్య తల పెట్టి ఓరగా కోరగ అనిరుద్ర వైపు చూడసాగింది అనిమిష.

“ఎంతసేపు చూస్తావు? మెడ పట్టేస్తుంది. లుక్కు మార్చు” “నీ చూపులో నాకు డిఫరెన్స్ కనిపిస్తోంది” అంది అనిమిష

“ఇప్పుడు నన్నేం చేయమంటావ్… బయటకు వెళ్లిపోనా…” అడిగాడు తలుపు దగ్గరకి నడుస్తూ అనిరుద్ర.

“వద్దు… మా బాస్ చూస్తే డౌటొస్తుంది” అంది.

“మరేం చేయను”

“ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను. నా మీద అలాంటి హోప్స్ పెట్టుకోవద్దు” అంది అనిమిష,

“ఎలాంటి హోప్స్?” అడిగాడు ఆమె నడుం మడత వంక చూస్తూ. వెంటనే నడుం మడతను చీర కొంగుతో సరిచేసుకొని కోపంగా అనిరుద్రవైపు చూసింది అనిమిష

“మీరు ఎక్కడో చూస్తున్నారు”

“ఎక్కడో కాదు నడుం మడత వంక చూశాను. చాలా బావుంది. చాలా టెంప్టింగ్గా ఉంది” అన్నాడు అనిరుద్ర.

“అదిగో అలాంటి మాటలు నాకు నచ్చవ్… మన అగ్రిమెంట్ మర్చిపోతున్నారు”

“అగ్రిమెంట్ ఏం మర్చిపోలేదు… సరే కాస్త జరిగితే నేను అటువైపు తిరిగి పడుకుంటాను”

“వ్వా…ట్… అదిరిపడి అంది అనిమిష.

Updated: August 12, 2021 — 2:33 pm

1 Comment

  1. Puku lagundi band cey anna

Comments are closed.