కావలెను – Part 2 66

“మీరు జీతం ఎంత ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు?” “మీరెంత ఇవ్వగలరు?”

“నిజాయితీగా చెప్తున్నాను… మన పెళ్లయితే నాకు వచ్చే జీతం రెట్టింపవుతుంది అంటే ఆరు వేల రూపాయలు పెరుగుతుంది. అందులో సగం మీకు ఇస్తాను. అంటే మీ శాలరీ త్రీ టౌజండ్)

“సారీ… ఆరు నా లక్కీ నెంబర్… ఆరుకు తక్కువైతే చేయను”

“అలా అయితే త్రీ ఫౌజండ్ సిక్స్ హండ్రెడ్ తీసుకోండి” అనిరుద్ర ఓ నిమిషం ఆలోచించి, “రైట్… మరి ఖర్చు…

“హౌస్ రెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ… ఖర్చులన్నీ షేర్ చేసుకుందాం”

“నాకు వారానికోసారి నాన్ వెజ్ తప్పనిసరిగా కావాలి”

“సారీ… నేను నాన్ వెజ్ తినను”

“నేను నా విషయం చెప్తున్నాను”

“నేను తినకుండా ఎలా…”

“నేను వండుకుని తింటాను” అనిమిష ఏమీ అన్లేక “సరే” అంది.

“పెళ్లయ్యాక నేను మిమ్మలి “ఒసే’ అనొచ్చా. భార్యను అలా పిలవడం నాకిష్టం”

“అదేం కుదర్దు… కావాలంటే నువ్వు’ అని ఏకవచనంతో పిలవచ్చు”

“ఇంకా ఏమైనా కండీషన్స్ ఉన్నాయా?”

“ఏమీ లేవుగానీ… మనిద్దరి మధ్య వున్న ఈ ఒప్పందం మూడో మనిషికి తెలియకూడదు”

“సారీ… మూడో మనిషికి తెలియకుండా వుండడం నా వల్ల కాదు. ఆరో మనిషికి తెలియకుండా చూడగలను”

“అదేంటి?”

“మీ ఫ్రెండ్ కు తెలుసుగా… తను మూడో మనిషి మా ఫ్రెండ్ కు తెలుసు… వాడు నాలుగో మనిషి మా బామ్మకు ఈ విషయం క్లియర్ గా చెప్పాలి. తప్పదు… ఆరో మనిషికి మాత్రం తెలియనివ్వను. మీరు చెప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు”

“సరే… వెంటనే మ్యారేజ్… గుడిలో సింపుల్గా… అన్నట్టు మ్యారేజ్ అయ్యాక నేను మ్యారేజ్ పేరుతో లోన్లు తీసుకుంటాను. వాటి ఇన్స్టాల్ మెంట్స్ నేనే కట్టుకుంటాను… ముందే చెప్తున్నాను”

“మీ ఇష్టం..” భుజాలు ఎగరేసి చేసి అన్నాడు అనిరుద్ర.

టిఫిన్ చేసి కాఫీ తాగి లేచారు. బిల్లు అనిమిషే పే చేసింది.

“కంగ్రాట్స్ అనిరుద్రగారూ… మంచి అమ్మాయిని కొట్టేశారే.. పార్టీ ఇవ్వాలి”

“ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఓకే. అయినా మీరు జాబ్ కొట్టేశారే అనాలి… అమ్మాయిని కాదు.. పైగా మీ ఫ్రెండ్ ‘అది’ వద్దంది” అన్నాడు అనిరుద్ర.

“అదా…? ఏది?” అంటూ అనిమిష వంక చూసి, “ఏమొద్దన్నావే” అని అడిగింది. అనిమిష మొహం ఇంకా ఎర్రబడింది.

“ఇంటికెళ్లాక అడగండి. ఓసారి ఆలోచించుకోమనండి” చెప్పాడు వాళ్ల ఆటో కదుల్తుండగా.

***

Updated: August 12, 2021 — 2:33 pm

1 Comment

  1. Puku lagundi band cey anna

Comments are closed.