కావలెను – Part 2 66

“ఉండొచ్చు… కానీ అందుకు శాలరీ…”

“వైనాట్… నేను భర్తగా జాబ్ చేస్తున్నందుకు తీసుకుంటున్నాను. కూరగాయలు తెస్తాను. ఇంటి పనులు చేస్తాను. బిల్లులు కట్టి వస్తాను. ఇంటిని నీట్గా ఉంచుతాను”

“ఇలాంటి ఆడ పనులు”

“అదే తప్పు… పనుల్లో ఆడ పని, మగ పని అని ఉండదు. మహా వుంటే మనుష్యులు చేసే పని, జంతువులు చేసే పని అని ఉండొచ్చు”

“ఇదే జీతం మీకు ఎక్కడ చేసినా దొరుకుతుందిగా…”

“దొరుకుతుంది. కానీ జీతంతోపాటు నాకు తృప్తి కూడా ఉండాలిగా. ఈ ఉద్యోగంలో నా భార్యకే చేస్తున్నానన్న తృప్తి… ఎవ్వరూ చేయని ఉద్యోగం చేస్తున్న క్రెడిట్… ఎవరి దగ్గర పడితే వాళ్ల దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు”

“మీ పని నాకు నచ్చకపోతే”

“నన్ను తీసేయవచ్చు. అలాగే నాకు మీ దగ్గర ఉద్యోగం నచ్చకపోయినా వెళ్లిపోతాను. ముందే విడుకుల కాగితాలు రెడీ చేయిస్తాను… నచ్చినంత కాలం నేనీ భర్త ఉద్యోగం చేస్తాను. నచ్చకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు భర్త పోస్టుకు రాజీనామా చేస్తాను. మీరు కూడా… జాబ్లో నుంచి నన్ను తీసేయవచ్చు. ఈ జాబ్ చేయడం చేయించుకోవడం ఇద్దరికీ ఇష్టం వుంటనే ఈ అగ్రిమెంట్…”

“అయితే ఓ కండీషన్… మీరు ‘భర్త’గా జాబ్లో చేరాక మరే ఉద్యోగమూ చేయకూడదు”

“చేయను. కానీ నాకు ఇష్టమొచ్చిన దగ్గరకి వెళ్తాను. సినిమాలు, ఫ్రెండ్స్, హోటల్స్ నా ఇష్టం” –

“ఓకే నేను కూడా అంతే”

“రైట్ ఇంకా…”

“ఇంకా మనం ప్రపంచ దృష్టికి భార్యాభర్తలం. అంతే కానీ ప…” అనిమిష మొహం ఎర్రబడింది.

“చెప్పండి… ‘పని కంటిన్యూ చేయండి”

“పడగ్గదిలో…” ఆమె మొహం మరింత ఎర్రబడింది.

“అది వద్దా?” అడిగాడు అనిరుద్ర.

“ఏది…?” మొహాన్ని మరింత ఎర్రగా మార్చి అడిగింది అనిమిష.

“అదే… అదొద్దా…” తల అడ్డంగా ఊపి.

“అలాంటి హోప్స్ పెట్టుకోవద్దు. ఇది కేవలం బిజినెస్సే.

భర్తగా జాబ్ నాలుగ్గోడల బయట చేస్తే చాలు.. లోపల కాదు” అని చెప్పింది.

“రైట్ ఇంకా…”

Updated: August 12, 2021 — 2:33 pm

1 Comment

  1. Puku lagundi band cey anna

Comments are closed.