కావలెను – Part 2 66

“నా పక్కన పడుకుంటారా… నో… నెవర్” అంది ఎగిరిపడిన లేవల్లో.

“సారీ…” మళ్లీ తనే అంది అనిమిష.

“ఎందుకు?” అడిగాడు అనిరుద్ర.

“మిమ్మల్ని నేల మీద పడుకోబెడుతున్నందుకు” .

“నెవ్వర్… నేను నేల మీద పడుకోవడమేంటి? ఇది నీ కోసం…” దిండు, దుప్పటి ఆమె చేతిలో పెట్టి మంచం మీద పడుకుంటూ అన్నాడు అనిరుద్ర.

“ఓరి దుర్మార్గుడా…” మనసులోనే కచ్చగా అనుకుంది అనిమిష

“లైట్ ఆర్పేయనా… వెలుతురులో నాకు నిద్ర పట్టదు” అడిగాడు అనిరుద్ర.
“వద్దు… లైట్ ఆర్పేస్తే నువ్వు వెధవ్వేషాలు వెయ్యవని గ్యారంటీ ఏంటి?” అనిరుద్ర అనిమిష వైపు సీరియస్గా చూశాడు.

“అది కాదు… ఈ ఒక్క రాత్రి అడ్జస్టయిపోండి. రేపట్నుంచి వేరు వేరు గదుల్లో పడుకోవచ్చు” కాస్త నచ్చచెప్తున్నట్లుగా అంది అనిమిష.

“అంటే తెల్లవార్లు మెలకువగా ఉండాలా? నో నెవర్…” అన్నాడు అనిరుద్ర.

“ఓ పనిచేద్దాం. మనం అగ్రిమెంట్ రాసుకుందాం… ఇటు టైమ్ పాస్… అటు అగ్రిమెంట్ రాసుకోవడం రెండూ పూర్తవుతాయి”

“అగ్రిమెంటా? నా మెమరీలో ఎప్పుడో డిటిపి చేయించి పెట్టాను. ఎప్పుడు పడితే అప్పుడు ప్రింటవుట్ తీసుకోవచ్చు” అన్నాడు అనిరుద్ర.

“రిటన్గా వుంటే మంచిది కదా…” అంటూ వెళ్లి టేబుల్ మీద వున్న ప్యాడ్ తీసుకొచ్చింది అనిమిష.

“హు… మొదటి రాత్రి ఇలా వుంటుందన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది” అంటూ నిట్టూర్చాడు అనిరుద్ర.

****

“ఇదిగో మీ డ్యూటీస్ వరుసగా రాస్తున్నాను. అన్నింటికీ స్టార్ గుర్తు పెడ్తున్నాను” అంది అనిమిష

నికిష్టమున్న గుర్తులు పెట్టుకో… అన్నట్టు ఓ అపాయింట్మెంట్ లెటర్ కూడా రాయి. మొగుడిగా అపాయింట్ చేసుకున్నట్టు” అన్నాడు అనిరుద్ర.

ఆమెకు చాలా గమ్మత్తుగా అనిపించింది. అనిమిష బుద్ధిగా రాసుకుంటూ పోతోంది. ఆమె వంకే చూస్తుండిపోయాడు అనిరుద్ర.

“అవును… ఉదయమే వాకిలి ఊడ్చి…. ముగ్గు వేసే డ్యూటీ కూడా మీదే కదా” అడిగింది డౌట్గా అనిమిష.

“ఆ డ్యూటీ కూడా చేయాలా?” అడిగాడు అనిరుద్ర.

Updated: August 12, 2021 — 2:33 pm

1 Comment

  1. Puku lagundi band cey anna

Comments are closed.