కావలెను – Part 2 66

“మొగుడూ పెళ్లాలు ఉద్యోగం చేసుకుంటూ చన్నీళ్లకు వెడినీళ్లలా కలిసిపోతారు. కాని మొగుడు ఒక్కడే ఉద్యోగం చేస్తే… భార్య ఇంటి పనులు చక్కదిద్దుతూ ఉంటుంది. సంపాదించాలి భర్త ఒక్కడే. హ్… ఎంత కష్టం… అలానే భార్య ఉద్యోగం చేస్తుంటుంది. భర్తకు ఉద్యోగా దొరకదు. అప్పుడెంత కష్టం… భార్య సంపాదనే ఆ కుటుంబానికి ఆధారం”

ఇదంతా బాస్ ఎందుకు చెప్తున్నాడో స్టాఫ్ కు అర్ధంకాలేదు. అనిమిష బాస్ ఏం చెబుతాడోనన్న క్యూరియాసిటీతో ఉంది.

“నేనో నిర్ణయానికి వచ్చాను. మనకంపెనీలో జాబ్ చేస్తున్న ఎంప్లాయికి మేల్ అయినా ఫిమేల్ అయినా… పెళ్లి అయివుంటే వాళ్ల భర్తకో, భార్యకో ఉద్యోగం లేకుండా వుంటే… వాళ్లకి రెట్టింపు జీతం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను”

ఒక్క క్షణం అందరూ షాకయ్యారు. వాళ్లకేమీ అర్ధంకాలేదు. శోభరాజ్ స్టాఫ్ వైపు చూసి, “మీరు కన్ఫ్యూజన్లో వున్నారని అర్ధమవుతోంది. ఇందులో కన్ ఫ్యూజన్ ఏమీలేదు. భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి మాత్రమే ఉద్యోగం వుంటే ఆ కుటుంబం సాగడానికి ఆర్ధికంగా ఇబ్బంది ఉంటుంది. అలా అని నేను ఆ కుటుంబంలోని మరో వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలేను. అందుకని నా వంతుగా నా కంపెనీలో పనిచేసే వాళ్లయిన వారికి వాళ్ల పార్ట్నర్ కి ఉద్యోగం లేని పక్షంలో జీతాన్ని రెండింతలు చేస్తున్నాను. పెరిగిన ఆ జీతం నా వంతుగా అఫిషియల్గా ఇస్తాను. నా కానుకగా! వాటికి మీ శాలరీ స్లిప్పు మీద సంతకం చేయాల్సిన అవసరం లేదు. ఈ కండీషన్ మీ పార్ట్నర్ కి ఉద్యోగం లేనంత వరకే… ఉద్యోగం దొరికితే ఈ సదుపాయం రద్దవుతుంది”

స్టాఫ్ చప్పట్లతో హాల్ మార్మోగిపోయింది. ముఖ్యంగా మగవాళ్లు వాళ్ల భార్యలంతా ఇంట్లో వుంటున్న వాళ్లే. నిఖితకు ఓ డౌట్ వచ్చింది. వెంటనే లేచి క్లారిఫై చేసుకుంది.

“సర్… మా ఆయనకు జాబ్ లేదు. నాక్కూడా డబుల్ శాలరీ ఫెసిలిటీ వర్కవుట్ అవుతుందా?”

“మీ ఆయన ఏం చేస్తారు?

“బిజినెస్”

“ఏం బిజినెస్?” అడిగాడు శోభరాజ్.

“ఫర్నిచర్..” చెప్పింది నిఖిత.

“ఆ బిజినెస్ డీటైల్స్ కనుక్కొని, ఓ క్యాలిక్యులేటర్ తీసుకొని లెక్కలు వేసి, మీ ఆయన సంపాదన నెలకు యాభైవేలకు పైగానే వుంటుంది కదా…” అన్నాడు శోభరాజ్.

“ఉంటుంది సార్… కానీ ఆయనకు ఉద్యోగం లేదు కదా” నిఖిత నెమ్మదిగా అంది.

“పొరపాటు నాదే సిస్టర్… చిన్న సవరణ” అని స్టాఫ్ వైపు చూసి, “నా దగ్గర పనిచేసే స్టాఫ్లోని పార్ట్నర్స్ ఏ ఉద్యోగమూ, వ్యాపారమూ లేకుండా ‘హౌస్’కే పరిమితమైన వాళ్లకే ఈ రెట్టింపు శాలరీ” అన్నాడు.

తర్వాత నిఖితవైపు చూసి, “థాంక్యూ సిస్టర్… మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు” అన్నాడు శోభరాజ్.

“వెల్కమ్ సర్” కచ్చగా అని కూర్చుంది నిఖిత. “ఏయ్ నిఖితా… ఏంటే సణుక్కుంటున్నావ్?” భావన అడిగింది.

“నాక్కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందేమో. ఆ డబ్బులతో నెలకో శారీ కొనుక్కోవచ్చు అనుకున్నాను” అంది నిఖిత.

“నువ్వే అలా ఫీలయితే నేను… మొన్నో సంబంధం వచ్చింది. అబ్బాయికి ఉద్యోగం లేదు. త్వరలో వస్తుందని… ఉద్యోగం లేని మొగుడు నాకెందుకు? అనుకున్నాను. అతన్ని చేసుకుంటే పోయేది…” ఫీలవుతూ అంది భావన. వాళ్ల మాటలు వింటూ ఆలోచనలో పడింది అనిమిష.

****

Updated: August 12, 2021 — 2:33 pm

1 Comment

  1. Puku lagundi band cey anna

Comments are closed.